4, సెప్టెంబర్ 2021, శనివారం

సమస్య - 3832

5-9-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
"ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!"
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గురువును నిందించిన నొనఁగూడును విద్యల్”
(లేదా...)
“గురువును నింద సేయ నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్”

34 కామెంట్‌లు:


 1. నరకము ప్రాప్తించు గదర
  గురువును నిందించిన, నొనగూడును విద్యల్
  హరిహర స్రస్టసముండని
  గురుచరణమ్ముల కొలిచెడు కూళుని కైనన్.

  రిప్లయితొలగించండి
 2. గురువులకుప్రణామములు
  తరతమభేదమునెంచుచు
  కరమునుమంచిగనడవడిగాననివాడై
  పరమముగాంచనిబరువగు
  గురువునునిందించిననోనగూడునువిద్యల్

  రిప్లయితొలగించండి
 3. పరము లభించ ద దేరికి
  గురువును నిందించిన : నొనగూడు ను విద్యల్
  తిరమగు రీతిగ నెవ్వ రు
  మరులుగ సేవింప నెంచ మాన్యుని సతమున్

  రిప్లయితొలగించండి

 4. మొరకుని మాటలే యవి కుబుద్ధుల నెయ్యము వీడమంటిగా
  నరకము ప్రాప్తమౌనిక వినాశము తప్పదు ధాత్రియందునన్
  గురువుల నిందసేయ, నొనగూడును విద్యలు శిష్యకోటికిన్
  హరిహర బ్రహ్మతుల్యుడని యాతని గొల్చెడు వారికేసుమా!

  రిప్లయితొలగించండి
 5. విరిసినయుద్ధభూమినటవీడనిపట్టుననున్నవిష్ణునిన్
  తిరముగలేనిచిత్తమునతేజమువీడుచునర్జునుండునున్
  కరమునుతూలనాడగనుకాంచెనుబోధనుగీతయాక్రుతిన్
  గురువునునిందసేయనోనగూడునువిద్యలుశిష్యకోటికిన్

  రిప్లయితొలగించండి
 6. కందం
  నిరతము బోధలతో మది
  గురువులు నినదించిన నొనగూడును విద్యల్
  కొరగాని శిష్యుఁడననౌ!
  "గురువును నిందించిన నొనఁగూడును విద్యల్!!"

  చంపకమాల
  నరులన నేర్వ విద్యనుఁ బునశ్చరణంబది చిత్తమందు స
  ద్గురు నిన దించ సేయ నొనఁ గూడును విద్యలు శిష్యకోటికిన్
  మరువకు మీ సుభాషితము మంచిదనన్ గొరకాక పల్కితే
  "గురువును నింద సేయ నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్!"

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. చం:

   తరుణము పూజలొంది గురు దక్షిణ గైకొన నుత్సవంబుగాఁ
   మరువక యేటికేడు తగు మాదిరి నివ్విధి నాచరింపగన్
   సరియగు కట్టు లేక కొనసాగెనె తీవ్ర కరోన, యేల , నా
   గురువును నింద వేయ ? నొనగూడును విద్యలు శిష్యకోటికిన్

   వై. చంద్రశేఖర్

   తొలగించండి
 8. నరకము ప్రాప్తించును స
  ద్గురువును నిందించిన, నొనగూడును విద్యల్
  పరమాత్మగ భావించుచు
  నిరతము సేవలనుజేయ నిశ్చల భక్తిన్

  నరకము నంబడున్ గద యనాదరమున్ పరమాత్మరూపుడౌ
  గురువును నిందసేయ ,నొనగూడును విద్యలు శిష్యకోటికిన్
  నిరతము సేవజేయుచును నిశ్చలభక్తిని శాస్తసన్నిధిన్
  స్థిరమగు శ్రద్ధతోడ పరిశీలన జేయగ వేదవాక్యముల్

  రిప్లయితొలగించండి
 9. మరవకు జీవితాంతమును మా
  నవ పాపపు పంకమంటుగా
  గురువును నింద జేయ, నొనగూ
  డును విద్యలు శిశ్య కోటికిన్
  బరమ పవిత్ర భావమున
  బాధ్యతతో బోధించునట్టి యా
  గరువును సర్వకాలమున గౌర
  వమొప్పగ గాంచగా దగున్

  రిప్లయితొలగించండి
 10. కరువౌ విద్యా గంధము
  గురువును నిందించిన; నొనఁగూడును విద్యల్
  పరమానందముతోడన్
  గురువుకు శుశ్రూషలిడుచు కొలువగ వలయున్

  రిప్లయితొలగించండి
 11. గురువర్యులకు నమస్సులు, సమస్య 3831 కు నా పద్యం పరిశీలించి తప్పొప్పుల తెలుప ప్రార్థన.
  క్షితిపై శ్రావణ మాసమందు వరలక్ష్మీ దేవి ప్రీతిన్ గొనన్
  వ్రతమున్ జేయుచు శుక్రవారమున భవ్యంబైన మార్గమ్ములో
  నతివల్ పూజలొనర్చి పల్కిరిటు లాహ్లాదమ్ము నిండార "హా
  రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధ చిత్తంబులన్"
  ధన్యవాదాలు
  మాచవోలు శ్రీధరరావు

  రిప్లయితొలగించండి
 12. మరువగలేని పాఠములఁ మానవ విల్వల నెన్నియో నిరం
  తరముగ నందజేసి ఘనతం బలు జీవికలన్ సమాజమున్
  తరములుగా నొసంగె చరితార్థులు వారలు! యెవ్విధంబుగన్
  గురువును నింద సేయ నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్?

  రిప్లయితొలగించండి
 13. దురితము నొందెదరెపుడును
  గురువును నిందించిన ; నొనఁగూడును విద్యల్
  కొఱతలు లేకుండు నటుల
  గురువుల శిక్షణ వలననె , గొలువుము వానిన్

  రిప్లయితొలగించండి
 14. నిరతము గురువుల సేవతొ
  కరములె నిండి, గురు భక్తి గల్గి మెలగినన్,
  గరపిన గడ్డిని గట్టిగ
  గురువును నిందించిన, నొనఁగూడును విద్యల్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుసేవాభాగ్యముతో
   కరములెనిండి, గురుభక్తి గల్గి మెలగినన్
   గరపినగడ్డినిగట్టిగ
   గురువును నిందించిన ,నొనఁగూడును విద్యల్

   తొలగించండి
 15. సమస్య :

  గురువును నింద సేయ నొన
  గూడును విద్యలు శిష్యకోటికిన్

  ( శిష్యులకు గురిని చూపించే గురువును ఒళ్లు మరచి నిందించేవారికి చదువు లెలా వస్తాయి ? )

  చంపకమాల
  .....................

  ధరణిని శిష్యు లందరకు
  దన్మయమందుచు బోధసేయునే !
  చెరపును దెచ్చు బాటలను
  జేరగనీయక కాచుచుండునే !
  ఎరుకను నిచ్చు నాయనను
  ఎప్పుడు నెచ్చట నెట్టి రీతులన్
  గురువును నింద సేయ - నొన
  గూడును విద్యలు శిష్యకోటికిన్ ??

  ( ఎరుక -జ్ఞానము ; నాయనను -తండ్రిని , ఆయనను)

  రిప్లయితొలగించండి
 16. నిరతము నొజ్జ బోధనము నిశ్చల మౌమతి స్వీకరించుచున్
  తరుణ వయస్సునన్ జదివి తద్దయు ప్రీతిని చిత్తశుద్ధితో
  పెరిమను చూపకుండ వడి వీడుచు మిత్రుల వారు దుష్టులై
  గురువును నింద చేయ, నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్
  అసనారె

  రిప్లయితొలగించండి
 17. ప్రతిభా మూర్తులు జాతిరత్నములు నవ్యాలోకవేదాంతధీ
  మతసంపన్నులు తత్వవేత్తలటు సన్మార్గంబుసాధింపగా
  మతిదీరన్గొలువన్జయంబనుచు సన్మానించుచున్మంగళా
  రతికిన్ సిద్ధము గండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్

  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 18. గురువన దైవంబిలలో
  గురుతరమగు రీతి చదువు గుణములు గరపున్
  నరులెట్టుల వంద్యుండౌ
  గురువును నిందించిన నొనఁగూడును విద్యల్?

  రిప్లయితొలగించండి
 19. గురువన దైవమీజగతి కోరిన విద్యలనెల్ల నేర్పి తా
  గురుతరమైన బాధ్యతగ గూర్చును శిష్యుని కార్యశీలుగా
  పరమ పవిత్రమూర్తియని భావన చేయక నెవ్విధంబుగా
  గురువును నింద సేయ నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్?

  రిప్లయితొలగించండి
 20. నిరతము దుఃఖమందునను నిల్పును హీనులతోడమైత్రి, యీ
  ధరపయి సౌఖ్యనాశనము తాను ఘటింపగ జేయు, దానినిన్
  స్థిరమతులౌచు నిచ్చలుగ క్షేమము గోరుచు నాశ్రయించి స
  ద్గురువును, నింద సేయ నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్.

  రిప్లయితొలగించండి
 21. భరతుడు యేలవచ్చెనట
  భారతదేశముపేరుగాంచెనో
  గురుకులపాఠశాలెలిసి
  కూర్మిమిమీరగవిద్యగర్పగా
  నిరతముగొల్చిరేగురుని
  నిష్టగ చేసిరిపాదపూజలే
  బలమగు విద్యకేంద్రములు
  భాసిలె ఈయపకీర్తిలేలనో
  గురువునునిందసేయనొన
  గూడునువిద్యలుశిష్యకోటికిన్
  ...తోకల...

  రిప్లయితొలగించండి
 22. గురుపూజ
  గురునిపూజజేయగుణవంతుజేయును

  రుజయుతొలగుగురునిరూపుజూడ
  దేశికుండునగుచుదేశాలుదిరిగెడు
  వరలుమేటిగురువ!వందనములు

  రిప్లయితొలగించండి
 23. నరకంబునకును బోవును
  గురువును నిందించిన,నొనగూడును విద్యల్
  నిరతము భక్తిని గొలిచిన
  దురితములున్ బోవు నిజము తొయ్యన సామీ!

  రిప్లయితొలగించండి
 24. గురు కృపతో గురు దేవుని
  గురు తర మహిమ నిజ శిష్య కోటికి ధరలో
  గురు నిందార్థ కలుష వా
  గురువును నిందించిన నొనఁగూడును విద్యల్

  [వాక్ + ఉరువును = వాగురువును; ఉరువు = విరివి]


  గిర లవి యొంటఁబట్టుఁ బరికింపఁగ సద్గురుఁ గొల్చి నప్పుడే
  గురువును దైవ తుల్యముగఁ గోరి భజించెద సంతతమ్ము నే
  నిరవుగ శ్రద్ధ తోడఁ దగ నిట్లనినం బ్రణుతింతు నింపుగా
  గురువును నింద సేయ నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్

  [నింద సేయను + ఒనఁగూడును = నింద సేయ నొడఁగూడును]

  రిప్లయితొలగించండి
 25. నరకము తథ్యమౌ వినుమనశ్వరధీనిధినందజేయునా
  గురువును నింద సేయ; నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్
  గురువును గారవించుచునకుంఠవిధేయతనభ్యసించినన్
  గురువు తమోరియై జగతి గూర్చును జ్ఞాన నికాశమున్ సదా

  రిప్లయితొలగించండి
 26. గురువడచును తామసమును
  గురువిడు విజ్ఞాననిధిని గూరిమి ధరణిన్
  గురుతెరుగుము నీవెటులా
  గురువును నిందించిన నొనఁగూడును విద్యల్?

  రిప్లయితొలగించండి
 27. నరకము జూతురెప్పుడును నాకపువాసులు సైతమున్సుమా
  గురువును నిందసేయ,నొనగూడును విద్యలు శిష్యకోటికిన్
  నీరతము సేవజేయగను నిర్మలబుద్ధిని దేశి వర్యుకున్
  దురితములెల్లబోవునిక తోరపు పుణ్యముకూడ యబ్బునౌ

  రిప్లయితొలగించండి
 28. కరువగు నక్షరమ్ములు, వికాసము గల్గదు, బుద్ధి హీనమౌ
  గురువును నింద సేయ! నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్
  ధర నసమాన పాటవము దాల్చుచు నున్నత స్థాన మందుచున్
  మెరపుల చిందగా నగును మేలు భజింపగ నొజ్జ లందరన్!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురువర్యులకు నమస్సులు,
   మీ సూచనకు ధన్యవాదాలు
   సవరించిన నా పద్యాన్ని పరిశీలించ ప్రార్థన.
   కరువగు నక్షరమ్ములు, వికాసము గల్గదు, బుద్ధి హీనమౌ
   గురువును నింద సేయ! నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్
   ధర నసమాన పాటవము దాల్చుచు తద్దయు మేటి వారలై
   మెరపుల చిందగా నగును మేలు భజింపగ నొజ్జ లందరన్!

   మాచవోలు శ్రీధరరావు

   తొలగించండి
 29. చం. సరి యగు నౌకరీ తనకు జక్కొనదంచు, గురుత్వమొక్కటే
  దొరుకగ నంది పుచ్చుకొని, ద్రోహము వృత్తికి జేయగా, తగున్
  గురువును నింద సేయ, నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్,
  నిరతిని గల్గి, జ్ఞానమును నేర్పు, గురూత్తము సేవ జేసినన్.

  - M.V.S. Ranganadham, Hyderabad

  రిప్లయితొలగించండి
 30. త్వరితముగాహీనుడగును
  గురువును నిందించిన,నొనగూడును విద్యల్
  గరువమువిడిసేవించిన
  గురువులనిలతప్పకనొనగూడునుశుభముల్

  తరుగును జ్ఞానంబెల్లయు
  గురువును నిందించిన,నొనగూడును విద్యల్
  నిరతము విన గురు బోధలు
  పెరుగుచు నుండును నిరతము విజ్ఞాన సుధల్

  రిప్లయితొలగించండి