21, సెప్టెంబర్ 2021, మంగళవారం

సమస్య - 3849

22-9-2021 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేవుని సొమ్ముఁ దినువానిదే భక్తి యగున్”
(లేదా...)
“దేవుని సొమ్ము నంతయునుఁ దేరగ దోచెడివాఁడె భక్తుఁడౌ”
(పెద్దింటి లక్ష్మణాచార్యుల వారికి ధన్యవాదాలతో...)

32 కామెంట్‌లు:

 1. సేవింపుచు పరమాత్మను
  భావింపుచు సంపదెల్ల ప్రభువుని దయగా,
  నైవేద్యంబిడి, నెనరున
  దేవుని సొమ్ముఁ దినువానిదే భక్తి యగున్.

  రిప్లయితొలగించండి
 2. ఏవిధినెవ్వరువెదకిన
  తావెక్కడయనియుచూడదాపుననుండున్
  ఈవనమావనమంతయు
  దేవునిసోమ్ము, దినువానిదేభక్తియగున్

  రిప్లయితొలగించండి
 3. కవిమిత్రులకు నమస్సులు...

  నిన్నటినుండి కారణం లేకుండానే ఎందుకో నాకు భయం భయంగా ఆందోళనగా ఉంటున్నది. ఏపని చేయాలనిపించడం లేదు. శరీరారోగ్యం బాగానే ఉంది. మరొక రెండు మూడు రోజులు నేను మీ పూరణలను సమీక్షించలేక పోవచ్చు.

  మిత్రులలో ఎవరైనా పూనుకొని పద్యాల గుణదోషాలను, సవరణలను చెప్పడానికి ముందుకు రావలసిందిగా విజ్ఞప్తి!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సర్
   పంచాక్షరి 108సార్లు పారాయణచేయండి.భయం పోతుంది

   తొలగించండి
  2. గురువు గారికి నమస్కారం! శరీర ఆరోగ్యం బాగున్నప్పుడు ఆందోళన పడనవసరంలేదు. మానసిక ప్రశాంతతకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. దైవధ్యానం వల్ల మానసిక స్థైర్యం తప్పక కలుగుతుంది.

   తొలగించండి
 4. పావనుడాయెగోపనయుభాసురమయ్యెగవానిజన్మమున్
  రావణువైరితాయెదనురాగముతోడిదబంధనంబునన్
  దేవళమందునిల్పగనుతెచ్చెనుతానిషసోమ్మనంతటన్
  దేవునిసోమ్మునంతయునుఁదేరగదోచెడివాడెభక్తుడౌ

  రిప్లయితొలగించండి
 5. క్రొవ్విడి వెంకట రాజారావు:

  దేవాలయములు నిట్టివి
  వేవేగమె కట్టుదునని బేలుతనమ్మున్
  పావడములనుండి పునికి
  దేవుని సొమ్ము దినువానిదే భక్తి యగున్.

  రిప్లయితొలగించండి
 6. భక్తరామదాసు అంటే గిట్టనివారి ప్రచారం:

  కందం
  సేవకు ప్రభుత్వమొప్పఁగ
  నావల గుడి గట్టుపేర నందిన పన్నుల్
  ప్రేవుల పాలొనరించుచు
  దేవుని సొమ్ముఁ దినువాని దే భక్తి యగున్?

  ఉత్పలమాల
  సేవకుఁడై ప్రభుత్వమునఁ జేరిన గోపన రామభక్తుడన్
  భావన రామదాసునిగఁ బన్నుల పైకము వైచి నాడనన్
  బ్రేవుల, దైవమందిరపు వేడుకకన్న నవాబు యొప్పునే
  దేవుని సొమ్ము నంతయునుఁ దేరగ దోచెడివాఁడె భక్తుఁడౌ!

  (ప్రజలే మా దేవుళ్ళను ప్రభువులు వసూలు చేసే పన్నులు దేవుని సొమ్మే నను భావనతో)

  రిప్లయితొలగించండి
 7. జీవులకు సేవ సల్పుచు
  పావన మతి తోడ మహిత భావము వలనన్
  చేవగ దీనుల కొఱకై
  దేవుని సొమ్ము దిను వాని దే భక్తి యగున్

  రిప్లయితొలగించండి
 8. క్రొవ్విడి వెంకట రాజారావు:

  దేవళమిట్టి దొక్కటిని తిన్నగ కట్టెదనంచు జెప్పుచున్
  పావనమౌ మదిన్ జనులు భక్తిని గూడుచు నిచ్చు కాన్కలన్
  వావిరిగా వ్యయించుచును వంచన జేసెడి మానసమ్ముతో
  దేవుని సొమ్ము నంతయును దేరగ దోచెడి వాడె భక్తుడౌ.

  రిప్లయితొలగించండి
 9. రిప్లయిలు
  1. ఉ:

   నీవెగ మాకు దైవమని నిత్యమొనర్చుచు నారగింపులన్
   సేవలు మెచ్చి మత్తుగొన చెప్పెడి యూసులు నమ్మబల్కుచున్,
   మావటి మార్చు చందమున మత్త గజంబులు పోవు ద్రోవలన్,
   దేవుని సొమ్ము నంతయును దేరగ దోచెడి వాడె భక్తుడౌ

   వై. చంద్రశేఖర్

   తొలగించండి

 10. కోవెలనుగట్టి యార్జిత
  సేవలనెడు పేరు తోడ సిసువుల చేతన్
  గోవరముఁ ధనము లాగుచు
  దేవుని సొమ్ము దినువానిదే భక్తియగున్.


  ఆవిలమున్ హరించును జనాళి యొసంగెడు దానమొక్కటే
  కోవెల జేరి నిర్గుణుని కొల్వుమటంచును భక్త కోటితో
  సేవల పేర విత్తమును చేగొనుదంతులు ధర్మకర్తయే
  దేవుని సొమ్ము నంతయునుఁ దేరగ దోచెడి వాఁడె భక్తుఁడౌ.

  రిప్లయితొలగించండి
 11. జీవాత్మయె పరమాత్ముడు
  జీవుని తృప్తిపడ జేయ సేవే యగు గా
  ఆ వసువు జీవునిదెగద ,
  దేవుని సొమ్ముఁ దినువానిదే భక్తి యగున్

  రిప్లయితొలగించండి
 12. దేవుని మాన్యపు రక్షణ
  సేవల మాటున పలువురు శిష్టులు నడిచే
  త్రోవను కనుగొన దెలియును
  దేవుని సొమ్ముఁ దినువానిదే భక్తి యగున్

  రిప్లయితొలగించండి
 13. సమస్య :

  దేవుని సొమ్ము నంతయును
  దేరగ దోచెడివాడె భక్తుడౌ

  ( భగవంతునిలోని సప్తగుణసంపన్నతను
  సంపూర్ణంగా దోచుకొన్నవాడే భక్తుడు )

  కావగ నేగుచుంట ; దయ
  గాంచుచు నుండుట ; తారతమ్యపుం
  భావము శూన్యమౌట ; తన
  వారిగ భారము మోయుచుంటయున్ ;
  పావనదృష్టి ; సాత్వికత ;
  బాధసహిష్ణుత - సప్తకంబునౌ
  దేవుని సొమ్ము నంతయును
  దేరగ దోచెడివాడె భక్తుడౌ .

  రిప్లయితొలగించండి
 14. బావులు నిండగా కురిసె వానలు,పాడయె ధాన్యమంతయున్
  కోవెలలోని గింజలను కోరిన వారల కిచ్చె నంబి,స
  ద్భావన తోడ పేదలకు బంచెను దేవుని డబ్బు నీతిగా
  దేవుని సొమ్ము నంతయునుఁ దేరగ దోచెడివాఁడె భక్తుఁడౌ!

  రిప్లయితొలగించండి
 15. కావళివత్తుయాదగిరి
  కాసులుయడ్గనిసేవకుండనై
  పావననారసింహభజ
  పానముచేయగశక్తినిచ్చెనే
  శావలుదీసివేడెదను
  సాక్షిగనిల్వుముమానసంబులో
  భావనజేసినోమితిని
  పాపముదెంచుము ముక్తినివ్వుమా
  దీవెనలిచ్చిపంపుమిటు
  దేవుడయడ్గితిదైవసంపదే
  దేవునిసోమ్మునంతయును
  దేరగదోచెడివాడె భక్తుడౌ
  ....తోకల...

  రిప్లయితొలగించండి
 16. భావనచేయ దేవునకు భక్తులొసంగెడు హుండి కానుకల్
  దేవుని మాన్యమౌటనవి దేవళ నిర్వహణా నికాయముల్
  దేవళ కార్యనిర్వహణ ధ్యేయము వీడి చరింప నెవ్విధిన్
  దేవుని సొమ్ము నంతయునుఁదేరగ దోచెడివాఁడె భక్తుఁడౌ?

  రిప్లయితొలగించండి
 17. చేవను జూపుచు దమవౌ
  పావుల గదుపుచు ఘనమగు పదవుల మాటున్
  ఆవురు మంచును గుడిలో
  దేవునిసొమ్ము దినువానిదే భక్తియగున్

  ఈవిని పంచభూతముల నీశ్వరుడిచ్చిన కాన్కగాదగ
  న్నావల సూర్యచంద్రులను యన్నము నౌషధమిచ్చు వారిగా
  భావనచేసి సర్వమును వాని ప్రసాదమటంచు పుత్రుగా
  దేవునిసొమ్ము నంతయును దేరగ దోచెడివాడె భక్తుడౌ

  రిప్లయితొలగించండి
 18. పావన మౌ మనస్సునను పద్మ దళాక్షుని కోవెలందునన్
  సేవలు చేయువారరిది, చేతికి చిక్కిన దారగించి తా
  నీవి నటించుచున్ సతతమీ కలికాలము నందు నెంచగా
  దేవుని సొమ్ము నంతయునుఁ దేరగ దోచెడివాఁడె భక్తుఁడౌ

  రిప్లయితొలగించండి

 19. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
  పావన దైవసన్నిధిని పద్దతి
  దప్పక నెల్లవేళలన్
  సేవలు సేసె డర్చకుడె శీలము
  వీడియు దుష్ట బుద్ధిచే
  గావలి గాయువాడె కడు కాంక్ష వ
  హించి రహస్యమొప్పగా
  దేవుని సొమ్మునంతయును దేరగ
  దోచెడు వాడె భక్తుడౌ!!
  ~~~~~~~~~~~~~~~~~~~~~~~

  రిప్లయితొలగించండి
 20. పావన మూర్తిని రాముని
  సేవించుచు భక్తితోడ శ్రీకర ఫలముల్
  నైవేద్య మిచ్చి దానా
  దేవునిసొమ్ము దినువానిదే భక్తియగున్

  రిప్లయితొలగించండి
 21. పావన చరితం బలరఁగఁ
  దా వీడి ధనాశ నెల్లఁ దన సొమ్ములనే,
  యావల భద్రముగ నునిచి
  దేవుని సొమ్ముఁ, దిను వానిదే భక్తి యగున్


  ఈ వలెఁ దోయమో ఫలమొ యింపుగఁ బుష్పమొ పత్ర మైననున్
  దేవునిఁ జూడ సొమ్ము లట దేవునిఁ గొల్చుట కైన సొమ్ములే
  దేవుఁడు నయ్యెఁ బెట్టుబడి దేవుఁడు పణ్యము నయ్యె నిక్కలిన్
  దేవుని సొమ్ము నంతయునుఁ దేరగ దోఁచెడి వాఁడె భక్తుఁడౌ

  [భక్తుఁడు = భాగము కలవాఁడు; భక్తము = భాగము]

  రిప్లయితొలగించండి
 22. కావగరాని శిక్షనిల గబ్బునబొందునునిశ్చయంబుగా
  దేవుని సొమ్మునంతయును దేరగ దోచెడివాడె,భక్తుడౌ
  నేవిధమైన దోపిడిని నెప్పుడుజేయక భక్తితో శివున్
  నీవిక మాకుదిక్కనుచు నెమ్మిని ప్రార్ధన జేయువాడెసూ

  రిప్లయితొలగించండి
 23. దేవుని మాన్యమ్ములతో
  దేవళమును నిర్వహింప దేవుఁడు మెచ్చున్
  దేవుని భక్తుడ నేనని
  దేవుని సొమ్ముఁ దినువాని దేభక్తి యగున్?

  రిప్లయితొలగించండి
 24. ఈవసుధన్ పాపంబన
  దేవుని సొమ్ము దినువానిదే,భక్తియనన్
  జీవితమందునసతతము
  దేవుడొసంగిన ఫలమును తృప్తిగ గొనుటే

  రిప్లయితొలగించండి