12, సెప్టెంబర్ 2021, ఆదివారం

సమస్య - 3840

13-9-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
"దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు"
(లేదా...)
"దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేనివారికిన్"

52 కామెంట్‌లు:

  1. తలపనాకలిమంటలుదగులుకోనగ
    తరిగిపోవునుతలపులుధర్మనిరతి
    పట్టెడన్నముపెట్టకవట్టిచదువు
    దానమోనరింపరాదుక్షుద్బాధితులకు

    రిప్లయితొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆకలిని దరిజేరుచు నన్నమడుగు
    పేదవారలకెప్పుడు ఖాదనమిడి
    అలరజేయు చుండుము గాని యర్థ మసలు
    దాన మొనరింప రాదు క్షుద్భాధితులకు.

    రిప్లయితొలగించండి
  3. దనుజ సంతతి యనదగు తామసులకు
    దాన మొన రింప రాదు :క్షుద్భాధి తులకు
    కుక్షి నింపగ యత్నిo ప గోరు వారి
    మాధవుడు మెచ్చు ట నిజము మహిని యంద్రు

    రిప్లయితొలగించండి

  4. పిడికెడు మెతుకు లందక వీధియందు
    కదలలేని వాని నొకని గాంచినీవు
    దానమిడుచు రక్షించెడు తరుణమున ని
    దానమొనరింపరాదు క్షుద్బాధితులకు.

    రిప్లయితొలగించండి
  5. వానికి వాని సంతునకు వాస్తవ
    మొప్పగ లేక తిండియున్
    మానసమందు వేదన సమన్విత
    మాయెను దారిలేక తా
    బూనెను భిక్షమెత్త, నొక పూజ్యడు
    దానము చేసె నావు గో
    దానము జేయ బూను టుచితం
    బొకొ తిండికి లేని వానికిన్

    రిప్లయితొలగించండి

  6. దీనుల కోగిరమ్మునకు దిక్కిక లేదని వీధు లందునన్
    జానెడు పొట్టకై కరము జాపెడు ధ్వాక్షుని పాత్రలో నను
    ద్యానము తోడనన్నమిడ ధర్మము గాని హరీతుండవౌచు సం
    దానము జేయబూనుటుచితమ్మొకొ తిండికి లేనివారికిన్.

    రిప్లయితొలగించండి
  7. ప్రజల పన్నుల సొమ్మును ప్రభుత యిటుల
    పంపకమిడుట నెంతయు పాడిగాదు
    ఓట్ల కొరకురాష్ట్రమునకు తూట్లు పొడిచి
    దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "పంపక మిడుట యెంతయు.." అనండి.

      తొలగించండి
    2. ప్రజల పన్నుల సొమ్మును ప్రభుత యిటుల
      పంపకమిడుట యెంతయు పాడిగాదు
      ఓట్ల కొరకురాష్ట్రమునకు తూట్లు పొడిచి
      దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు

      తొలగించండి
  8. పాలకులొసగు సంక్షేమ పథకములకె
    సొగయుచు శ్రమము నెరుగని సోమరులకు
    దాన మొనరింపరాదు ; క్షుద్బాధితులకు
    వలయు భోజనమొసగుచు వాసిగొనుము

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    కన్నకొడుకుకు హానియన్ కడుపుమంట
    క్షుచ్ఛమింప హరి కవచ కుండలముల
    నెంచఁగ విచికిత్స వదలి యిన సుతుండు
    దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు

    ఉత్పలమాల
    ప్రాణము దీయుఁ గోవిడని బంధితులౌచును గూలి వారలున్
    హీన పరిస్థితిన్ గనఁగ నెంతకుఁ దీరక మీర నాకలుల్
    పూనుచు వైద్యసేవలని పొట్లము లందున మందు మాత్రమే
    దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేనివారికిన్

    రిప్లయితొలగించండి
  10. ఉన్నమ్మా ఉన్నమ్మకే పెడుతుంది , లేనమ్మా ఉన్నమ్మకే పెడుతుంది !

    మానము పెంచునంచు నభిమానము జాటుచునున్నవారికే
    వైనముగాను కూతురి వివాహపు వేళను నన్నవస్త్రముల్
    దానము జేయబూను టుచితమ్మొకొ? తిండికి లేని వారికిన్
    ప్రాణము నిల్పగాదగిన భక్ష్యము చేలము లిచ్చినన్దగున్

    రిప్లయితొలగించండి
  11. ధనముజగతికిమూలము, దానగుణము
    ఉత్తముల లక్షణంబగు నుర్విమీద
    పాత్రనెరిగియుండవలెను, పౌరులెపుడు
    దానమొనరింపరాదు, క్షుద్బాధితులకు
    అన్నమొండివడ్డించగ అన్నదాత
    ...తోకల...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వండి'ని 'ఒండి' అనరాదు. "అన్నమును వండి వడ్డించ నన్నదాత" అనండి.

      తొలగించండి
  12. ఓట్లు మాత్రమే లక్ష్యమై నోట్లు పంచి
    ప్రజల మేలును మరచిన కుజనులగుచు
    నీచ మార్గమ్ము నెంచిన నేతలు పరి
    దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు

    రిప్లయితొలగించండి
  13. ఉ:

    కూనల దొంగిలించి నతి క్రూరము దుర్బల పర్చ దేహమున్
    హీనులటంచు కూడలిగ హేయపు వృత్తిని దింపజేయుచున్
    దానవ నైజమున్ గలిగి దారుణ రీతి గడింప ద్రవ్యమున్
    దానము జేయ బూను టుచితమ్మొకొ ? తిండికి లేని వారికిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  14. మానధనాఢ్యులై మెలుఁ గమాయక జీవులకింక నేఁ డపా
    దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ, తిండికి లేనివారికిన్?
    దీనుల గావగా ప్రభుత ధీమను బీమను సేద్యమందు సం
    ధానము సేయుటుత్తమము ధారణి నేలెడి నాయకోత్తముల్.

    అపాదానము-నష్టము

    రిప్లయితొలగించండి
  15. కనకము, ధనము, వజ్రపు గడనగలను
    దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు,
    వితరణ మొనరింపవలయు విరివిగ రుచి
    గలది, సుచిగల, యన్నము కరుణ తోడ.

    రిప్లయితొలగించండి
  16. సమస్య :
    దానము జేయబూనుటుచి
    తమ్మొకొ తిండికి లేనివారికిన్

    ( శుష్కప్రియాలు - శూన్యహస్తాలు )

    మానవ ! మంచిబట్టలవి
    మానము గాయగ లేనివారికిన్ ;
    గానగ రాని కష్టముల
    గందరగోళము నందువారికిన్ ;
    జేనగు సాయమున్ మరచి
    చేరుచు మెచ్చుల మాటలాడి వా
    గ్దానము జేయబూనుటుచి
    తమ్మొకొ ! తిండికి లేనివారికిన్ .

    రిప్లయితొలగించండి
  17. వానలు మెండుగా కురియ బంటలు హెచ్చుగ పండినందునన్
    కానగలేము వాసముల గాదెలు ఖాళిగ , నట్టి వారికిన్
    దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ ; తిండికి లేనివారికిన్
    బోనము నిచ్చి యాకలిని పూర్తిగ బాపుట పాడియౌ గదా !

    రిప్లయితొలగించండి
  18. ఆకలినిగొన్న వానికి నన్నమిడక
    శూన్యహస్తము జూపుట శోభనిడదు
    ప్రతిఫలంబుగా దేవుని వరము లడిగి
    దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు

    రిప్లయితొలగించండి
  19. రిప్లయిలు
    1. భూనుతసద్గుణాఢ్య! హుతభుక్తతి నిల్లు విదగ్ధమౌ తరిన్
      పూనిక బావిఁ ద్రవ్వుదువె! పొంగునె! తత్క్షణనీరమయ్యెడన్
      వానకు గూలి కొట్టుకొని వాసము సర్వము వోవ,శుష్కవా
      గ్దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేని వారికిన్.

      కంజర్ల రామాచార్య.

      తొలగించండి
    2. మీ పూరణ మనోహరంగా, అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  20. దానము నీయగా దగును తల్లడమందున నున్నవానికిన్
    కానక కన్నుమిన్ను పరకాంతలగూడెడి దుర్మదాంధుకున్
    దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ? ,తిండికి లేనివారికిన్
    దానముఁజేయ పాడియగు దైవము మెచ్చును వారి యీవికిన్

    రిప్లయితొలగించండి
  21. ధ్యానమొనర్చుచున్ సతత మాలయమందున యాచనార్థమై
    గానముచేయుచున్ హరిని, కమ్మని గాత్రముతోడమించుచున్
    పానము చేయగా మధువు పైకము నంత వ్యయమ్ము చేసినన్
    దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేని వారికిన్?

    రిప్లయితొలగించండి
  22. తానొక భాగ్యశాలినను దర్పము దోడ ప్రచార కాంక్షతో
    దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ; తిండికి లేనివారికిన్
    దానము జేయుటే పరమ ధర్మమదే పరమాత్మ సేవయౌ
    గాననపాత్రదానమునకార్యముగా గ్రహియింప మేలగున్

    రిప్లయితొలగించండి
  23. ధనము మత్తుగ గలవాని కెన్నడిలను
    దానమొనరింపరాదు,క్షుద్బాధితులకు
    నన్న దానము జేసిన మిన్నగాను
    పుణ్య మబ్బును దప్పక గణ్యముగను

    రిప్లయితొలగించండి
  24. హీనముగా దలంతునిక హేమపుటాభరణంబు లుండగా
    దానముజేయబూనుటు,చితమ్మొకొ తిండికిలేనివారికిన్
    దానముజేయకుండగను ధార్మికసూక్తులు బోధసేయుటన్
    దానము జేయగా వలయు దప్పక యన్నము నీరమున్ రతిన్

    రిప్లయితొలగించండి
  25. ఎడఁ గనఁడు తాను దూఱంగ మెడకు డోల?
    తిండి పెట్ట లేఁడు కడుపు నిండుగ నన
    నగల మాట లేలయ్య కన్యామణులను
    దాన మొనరింపరాదు క్షుద్బాధితులకు


    మీనము మేషముల్ దలఁప మేలొడఁ గూడునె రోగి కెన్నఁడుం
    గాన నెఱింగి చక్కగను గార్యము సేయ ఫలమ్ము దక్కదే
    నేను దలంతు వే కడుపు నిండుగ నన్నము నీక పైడినిన్
    దానముఁ జేయఁ బూను టుచితమ్మొకొ తిండికి లేని వారికిన్

    రిప్లయితొలగించండి