5, సెప్టెంబర్ 2021, ఆదివారం

సమస్య - 3833

6-9-2021 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భర్తను పుత్రుఁడుగఁ దలఁపఁ బాడియ సతికిన్”
(లేదా...)
“భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి కెల్లవేళలన్”

28 కామెంట్‌లు:

 1. కర్తయలోకముకంతకు
  నర్తనతోడనుజగతికిమాటునశివుడున్
  వర్తిలెబిడ్డగశక్తికి
  భర్తనుపుత్రుడుగఁదలపఁబాడియసతికిన్

  రిప్లయితొలగించండి

 2. మూర్తియె పిలువగ నన్నకు
  మార్తె వివాహమునకేగి మానిని పలికెన్
  కీర్తీ! సోదరుని తనయ
  భర్తను పుత్రుడుగ దలప బాడియ సతికిన్.

  రిప్లయితొలగించండి

 3. వార్తల వోలె నెప్పు డపవాదుల నెన్నియొ వ్యాప్తిజేసెడిన్
  మూర్తిని గాంచి పల్కెనట మూర్ఖుడ చాలుమటంచు కోపమున్
  గీర్తియె మోయలేక నపకీర్తిని, భ్రాత తనూజ కయ్యెడిన్
  భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాటియగున్ సతికెల్లవేళలన్.

  రిప్లయితొలగించండి
 4. కర్తయయి సృష్టి కంతకు
  వర్తిలు పర మేశ్వ రుండు పార్వతి మగడై
  నర్తించు నట్టి జగతికి
  భర్తను పుత్రుడుగ దల ప బాడియ సతికిన్?

  రిప్లయితొలగించండి
 5. షట్కర్మయుక్తా కులధర్మపత్నీ!

  కందం
  వర్తనమున క్షమ, రంభగ
  నర్తించుచు, దాసి, మంత్రి, నారాయణిగా
  నార్తిని దీర్చెడు భుక్తిని
  భర్తను పుత్రుఁడుగఁ దలఁపఁ బాడియ సతికిన్

  ఉత్పలమాల
  వర్తనమందుఁ గార్యములఁ బంచఁగ సేవలు దాసి, మంత్రి సం
  స్కర్తగ, నోర్మినిన్ బుడమి, సద్గుణ శీలిగ లక్ష్మి రూపమై,
  యార్తిని దీర్చు రంభయన హాయిని గూర్చుచు, నన్నపూర్ణయై
  భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి, కెల్లవేళలన్

  రిప్లయితొలగించండి
 6. వర్తిలుమేనయల్లుడుగవారసువోలెనువెండికోండపై
  కర్తయగాగలోకములకానగవచ్చెడిదేవదేవుడున్
  ఆర్తినిబాపుచున్జనులయాశలదీర్చెడిశంభునాయుమా
  భర్తనుపుత్రుగాదలపఁబాడియగున్సతికెల్లవేళలన్

  రిప్లయితొలగించండి
 7. సమస్య :

  భర్తను పుత్రుగా దలప
  బాడి యగున్ సతి కెల్లవేళలన్

  ( అనుకోని ప్రమాదంలో అవయవహీనుడైన
  భర్తను భార్య పుత్రునిగా భావించి కాపాడుకోవాలి )

  కర్తగ నింటిబాధ్యతల
  గైకొని మిన్నగ నిర్వహించుచున్ ;
  వర్తనమందు నెట్టి చెడు
  బాటల బట్టని బుద్ధిమంతునిన్ ;
  గర్తము కారణంబగుట
  కాలిని , చేతుల గోలుపోవగా -
  భర్తను పుత్రుగా దలప
  బాడి యగున్ సతి కెల్లవేళలన్ .

  ( గర్తము - గొయ్యి )

  రిప్లయితొలగించండి
 8. నర్తనమున పతి క్రుంగిల
  నర్తి పడక దిటము నొంది యాదుకొనుటయే
  కర్తవ్యమని సెస సలుప
  భర్తను పుత్రుఁడుగఁ దలఁపఁ బాడియ సతికిన్

  రిప్లయితొలగించండి
 9. ఉ:

  వర్తనమెంచగా వలయు వాంఛిత కార్యము నిర్వహింపగన్
  నర్తకి తీరుగన్ ప్రజలు నచ్చెడి రీతిని నాట్య మాడనై
  ధర్తగ గేహ బాధ్యతలు దండిగ చేకొన నక్కరైనచో
  భర్తను పుత్రుగా దలప బాడి యగున్ సతి కెల్ల వేళలన్

  వై. చంద్రశేఖర్

  రిప్లయితొలగించండి
 10. 3833 వ సమస్యకు నా పద్యాన్ని పరిశీలించ ప్రార్థన.

  కరువగు నక్షరమ్ములు, వికాసము గల్గదు, బుద్ధి హీనమౌ
  గురువును నింద సేయ! నొనఁగూడును విద్యలు శిష్యకోటికిన్
  ధర నసమాన పాటవము దాల్చుచు నున్నత స్థాన మందుచున్
  మెరపుల చిందగా నగును మేలు భజింపగ నొజ్జ లందరన్!
  ధన్యవాదాలు
  మాచవోలు శ్రీధరరావు

  రిప్లయితొలగించండి
 11. భర్తతలపైనివెన్నెల
  కర్తయు చల్లని వెలుగుల కారకుడున్ స
  ద్వర్తనుడగు నా కలువల
  భర్తను పుత్రుఁడుగఁ దలఁపఁ బాడియ సతికిన్

  రిప్లయితొలగించండి
 12. భర్తకు దాసియై పనిని భారము పంచుకొనంగయున్, పరా
  వర్తపు కార్యముల్ తనకు మంత్రిగ, నాకలి చూచు తల్లియై
  భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్, సతి కెల్లవేళలన్
  వర్తనమున్ సనాతనము పాత్రము పాత్రల ప్రోదిసేయగన్౹౹

  రిప్లయితొలగించండి
 13. వర్తనమున పసిబాలుఁడు
  భర్తగ లభియించెనకట భార్యామణికిన్
  కర్తవ్యదీక్షతోనా
  భర్తను పుత్రుఁడుగఁ దలఁపఁబాడియ సతికిన్

  రిప్లయితొలగించండి
 14. నేర్తురుజన్మదన్యతకు
  నీ చతురాశ్రమపాఠవంబులో
  పేర్తురుజీవితంబిదని
  పెండిలిజేయగృహస్తుడైయ్యెగా
  కర్తగనుందురేపనుల
  కార్యముఇంటినిచక్కబెట్టగా
  భర్తను పుత్రుగాదలపబాడియగున్ సతికెల్లవేళలన్
  ...తోకల...

  రిప్లయితొలగించండి
 15. పూర్తిగ నన్న సేవకయి పోడుల వెంటను రామమూర్తి తో
  స్ఫూర్తిని, తల్లిమాట విను శుద్ధమనస్కుడు సోదరుండునై
  వర్తిలు చారు శీలుడిని వావి మరిందియు నైన యూర్మిళా
  భర్తను, పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి కెల్లవేళలన్.

  రిప్లయితొలగించండి
 16. కర్త సృజించె పృథ్విపయి కప్పుర గంధుల పూరుషుండు స
  త్కర్తగ మారునట్లుగను తద్దయు ప్రీతిని సంస్కరించుచున్
  వర్తనమందు దాసిగను ప్రగ్గడగా శయనంబు రంభయై
  స్ఫూర్తినొసంగ, కష్టములు పొందిననప్పుడు బుజ్జగించుచున్
  భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి కెల్లవేళలన్
  అసనారె

  రిప్లయితొలగించండి
 17. అక్కమహాదేవి

  కర్తగ సర్వలోకముల గాచుచు నుండును విశ్రమించకే
  ఆర్తిగ క్షుత్పిపాసలను నాదరమెంచుచు దీర్చువారలై
  వర్తిలు దల్లిదండ్రులను బాంధవులెర్గని దీనుడౌ జగ
  ద్భర్తను పుత్రుగాదలప బాడియగున్ సతికెల్ల వేళలన్

  రిప్లయితొలగించండి
 18. కీర్తీ! తలపగ నేరము
  భర్తనుపుత్రుడుగ,దలప పాడియ సతికిన్ ?
  హర్తను సత్పురుషునిగా
  గర్తవ్యము నెఱుగవలయు గనికరమందున్

  రిప్లయితొలగించండి
 19. భర్తకు సేవజేయుతరి భార్య వహించును దాసిపాత్ర; యా
  భర్తకు మంత్రియై దనరు బాధ్యతతో సలహాల నిచ్చుచున్;
  భర్తకు రంభవోలె తన ప్రాయము పంచును; వంటశాలలో
  భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి కెల్లవేళలన్

  రిప్లయితొలగించండి
 20. భర్తకు దాసిగా మఱియు భార్యగ నమ్మగ బ్రేమపంచుటన్
  భర్తను పుత్రుగాదలప బాడియగున్ సతికెల్లవేళలన్
  హర్తకు వోలె నుండకను హాయిని నిచ్చుచు నుండగావలెన్
  భర్తకునెల్లవేళలను వాయికి చేతికి దోడుగాధరన్

  రిప్లయితొలగించండి
 21. వర్తిలి మంత్రిగఁ జిక్కులఁ
  గీర్తిత దాసిగ పనులను గేళీ లీలన్
  గుర్తున భోజన వేళల
  భర్తను పుత్రుఁడుగఁ దలఁపఁ బాడియ సతికిన్


  ఆర్తిని నంద నేల మది నాత్మజు లేమికి సత్య మెంచినం
  గీర్తిత శాంత భావ నర కేసరి నత్యనురాగ యుక్త స
  ద్వర్తన హర్ష కారకుని ధర్మ ర తాత్ముని స్వీయ పుత్రికా
  భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి కెల్ల వేళలన్

  రిప్లయితొలగించండి
 22. ధూర్తులకార్యకారులతిదుర్మతులున్ పెడదారి జేర్చు దు
  ర్వర్తనులైన స్నేహితుల బ్రాపున జేరగనీక మాలిమిన్
  స్ఫూర్తి రగుల్చు సూక్తులను సూచన జేసెడి దల్లి వోలె దా
  భర్తను పుత్రుగాఁ దలఁపఁ బాడి యగున్ సతి కెల్లవేళలన్

  రిప్లయితొలగించండి
 23. భర్తయె దైవమ్మిలలో
  భర్తయె సర్వస్వ మిలను భామల కెల్లన్
  కర్తగ కర్మగ క్రియగా
  భర్తను పుత్రుడుగ దలప బాడియ సతికిన్

  కర్తయు నాతడేయనుచు కాంతయు నెప్పుడు తల్చుచుండుతా
  నార్తిగ చెంతచేర గను నాకలి బాపుచు నాదరించుచున్
  కీర్తిని పెంచు నట్లుగను కేలును పట్టుచు విద్యనేర్పటన్
  భర్తను పుత్రుగా దలచ పాడియగున్ సతి కెల్లవేళలన్

  రిప్లయితొలగించండి
 24. ఉ. కీర్తికరంబుగా, తనదు గేస్తుని తోడుగ, సప్త సంతతిన్
  స్ఫూర్తిగ పెంపు జేసి, మది పూర్తిగ దైవము నందు నిల్పి, దే
  హార్తి ముదిన్ వరింప, నిక హాంత్రము కోసమె వేచియున్న, యా
  భర్తను పుత్రుగాఁ దలఁపఁ, బాడి యగున్ సతి కెల్లవేళలన్.

  రిప్లయితొలగించండి