1-1-2022 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది..."వెడలిపోయిన దానికై వేడ్కలేల"(లేదా...)"పోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సడలి పోవును ప్రాయము నొడలు క్రుంగుకాల గతిలోన తథ్యము కలత యేలవెడలిపోయిన దానికై; వేడ్కలేలననగ తరుణత మదినింపి నలరు కొరకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
బాల్య కౌమార యౌవన ప్రాయములవిశాశ్వతము కాద నెఱుగుమీ జగతి యందు పండిపోయిన తలకేల వర్ణమద్ద వెడలిపోయిన దానకై వేడ్కలేల?
చక్కని పూరణ. అభినందనలు.
ప్రాయము కాదు శాశ్వతము వార్ధక మెవ్వడు నాపలేడటన్ గాయము శక్తిహీనమగు కన్నులు కాంతి విహీనమౌ కదా మాయజగత్తునందికను మానుము కృత్రిమ వేషధారణల్ పోయినదేది రాదు మఱి పోయెనటంచిటులేల వేడుకల్.
తేటగీతిఏల నో వెర్రి పరుగులు వింత గలుగువెడలి పోయిన దానికై వేడ్క లేలగడచిన విలువగల క్షణ కాల మైనతిరిగి బొందలేము నిజము తరచి జూడప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటర్
కాలమేవింతజీవికికానబడదుబురిడిగోట్టించిమనిషినిపోవుగాదెకలలసౌధంబుగూల్చునుకరుణలేకవెడలిపోయినదానికైవేడ్కలేల
కష్ట నష్టాలు సుఖముల కడలి వోలె మచ్చ లెన్నియొ మిగిలించి మనుజ తతికికాల చక్రము గదలుచు గదలి పోయె వెడలి పోయిన దానికై వేడ్క లేల?
తేటగీతిమారి కోవిడు డెల్టాగ మహినిఁ జెలఁగిపిదపనదియె నెమిక్రాను పేర కుదిపెనుపశమించుచు మార్పున నుప్పతిల్లవెడలిపోయిన దానికై వేడ్కలేల?ఉత్పలమాలహాయిని గూర్చు మాంసమని యందిన పాముల గబ్బిలమ్ములన్మేయగఁ బుట్టి కోవిడది మృత్యువు నౌచును తగ్గి, రేగి డెల్టాయన! శాంతమై, యెమికరానన రెచ్చెను! మారకుండగన్బోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా! నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు🙏
పాయనిబంధముల్జనులబాధలుబెట్టుచుకాలచక్రమేచేయగఘోరముల్సుడులజీవనగమ్యమయోమయంబెగాకాయల్పూవులున్వడలెకానరెజన్ననుభాసురంబుగాపోయినదేదిరాదుమఖిపోయెనటంచిటులేలవేడుకల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "కాయలు పూవులున్వడలె..."
భావిపయి నాశ నొందుట భావ్య మెగద“వెడలిపోయిన దానికై వేడ్కలేల”ననుచు నుడివిరి , మరి యిది యాగమించుఆంగ్ల సంవత్సరమున కాహ్వాన మిడుట
కానరెజన్మను
హాయిగసాగిపోయినదియాచిరుప్రాయమునాటపాటలన్తీయనితీపిగుర్తులనుతీసుకుపోయెనుయౌవనంబుదీర్ఘాయువుగోరియోషధులకాయముకల్పముకీయన్యాయమా*"పోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్"*
ధన్యవాదాలు గురువు గారు
ఉత్పలమాల:పోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్"తోయజ మిత్రుడేపగది దూరపుకొండలఁజేరువేళలన్ తోయపు టంజలిన్గొనుచు తోషమునింపడె భూజనాళికిన్ పోయెడు వత్సరంబటులె మూట మిగుల్చును తీపి గుర్తులే --కటకం వేంకటరామశర్మ.
కనులకొకనిముసమునైన కునుకునిడకమోమునకునెల్లవేళల ముసుగుకప్పివేదనమిగిల్చి యేడాది వెడలిపోయెవెడలిపోయిన దానికై వేడ్కలేల
పోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్సేయుట పాడి గాదనుట చెల్లని మాటగు చేరి చూడగాపోయినదా విషాణువది భూతలమున్ వణికించె నాడికన్సేయుచు నీమపాలనము సేమమునెంచుచు జాగరూకులైహాయిగనెల్లరున్ జరుపగాదగు వేడుక వత్సరాదినిన్
ఉత్పలమాల:పోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్"చేయుదురంచు ప్రశ్నిడిన చెప్పెడు తత్త్వమదొక్కటే మహిన్మాయయెగాదె కాయముల మార్చుచు జన్మలఁ బొందు సంధిలో హాయిగ జేయవేడుకలనందరు మెత్తురిదీ యదే కనన్ --కటకం వేంకటరామశర్మ.
దిగులుతొలగించి యాశలు చిగురుతొడుగవచ్చె ముందుకు నూత్న సంవత్సరమ్మువచ్చు కాలము నూహించి వాదులేలవెడలిపోయిన దానికై వేడ్కలేల
మంచి పూరణ. అభినందనలు.
🦌🙏
🙏
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: స్వస్థత చెఱపి జనులను బాధపెట్టి జీవనాధారముల నెల్ల పోవజేసి దయ నెడలి గత వర్షము తా కులుకుచువెడలి పోయిన దానికై వేడ్కలేల?
క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా: హేయమునైన రోగమున నిల్పుచు యూపిరిదీయుచున్ సదా శ్రేయమొనర్పకున్ జనుల జీవితమందు నవస్థ లుంచుచున్ గాయముజేసి పోయె నపకారపు వత్సర ముర్వివీడుచున్ పోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్?
కాయము యౌవనమ్ము కలకాలము నిల్పవు సంతసమ్మునన్ప్రాయమడంగినన్ దిరిగి రాదది, యెంచ సుఖమ్ము దుఃఖమున్ఖాయముగా ఘటిల్లును నికాయపు జీవనయానమందునన్ధ్యేయము భావిపైనిలిపి తేకువతో వసియింప మేలగున్పోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్
ప్రశ్నోత్తరితే.గీ:వచ్చు దానికి నిడ నేల స్వాగతమ్ము?పుట్టి నట్టి బిడ్డను జూచి పొంగినట్లు."వెడలిపోయిన దానికై వేడ్కలేల"?మరణ మొందిన తాత సంస్మరణ మట్లు
అర్కుడుదయించి పడమర యస్తమించుతరలివచ్చిన తనువైన మరలిపోవుకాలమెప్పుడైన కదలక నిలిచేనవెడలిపోయిన దానికై వేడ్కలేల
ప్రశ్నోత్తరిఉ:"పోయిన దేది రాదు మరి "పోయిన దం చిటు లేల !వేడుకల్?""పోయెనుగా విడాకు లిడి బుద్ధిగ నింతట నైన చాలు లే.""పోయెను భార్య యంచు తెగ పొంగుచు నుంటివి బాధ లేదొకో?""పోయెను కావునన్ సుఖము బొందెద నింతట కర్మ తీరెగా!".(మా మిత్రు డొకడు భార్యతో బాధ పడి తనకి విడాకు లొచ్చిన రోజు నాకు కూల్ డ్రింక్ ఇచ్చాడు లెండి.ఇలాంటివీ ఉంటాయి.ఇంకా బాధ పెట్టకండా విడాకు లైనా ఇచ్చిందని అతడి సంతోషం.)
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా: ఎల్ల జనులను భయమున నేడిపించి ప్రజల సౌఖ్యము లెల్లను పాడు జేసిబాధలను పంచి యుండిన వర్ష మదియె వెడలి పోయిన దానికై వేడ్కలేల?
ఉంచ నేల యాశ లలమ టించు టేల కాల చక్రము నాప శక్యమ్ము కాదు వచ్చి వెడలెడు దానికై పర్వ మేల వెడలిపోయిన దానికై వేడ్కలేలమాయను దాఁటఁగాఁ దరమె మానవ కోటికి నెంత నేర్చినం గాయము లుండఁ బోవు కలకాలము నేరికి నొక్క రీతినిన్ రేయి పవళ్లు కాదు విపరీతము నిత్యము వచ్చి పోవుటల్ పోయిన దేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో.....వెడలి పోయిన దానికై వేడ్కలేల యనగ మంచియేజరుగుటందు వలనవర్ష మంతయు శుభములే బడయు కతన జరుపు కొంటిమి వేడుకల్ సంత సమున
పోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్?మాయలమారి వత్సరమమంగళకారిణిగా గతించె లేబ్రాయపు కూననైనవిడువన్ దయమాలి వధించెనందుకేపోయిన వత్సరంబు చనిపోయిన సంతసమంద సాజమే.
మూడవపాదం విడువన్ బదులు విడకన్ అని చదువ ప్రార్థన
కాయము శాశ్వతంబనుచు గట్టడి జేసిన బోవుదప్పకన్ బోయినదేదిరాదు మఱి పోయెనటంచిటు లేల వేడుకల్ మాయయె యీజగంబుసుమ మాధవు నామము నెల్లకాలమున్ శ్రేయము మోక్షమందుటకు చేయుము ధ్యానము శ్రద్ధతో నికన్
కాయము మాయమౌను గల కాలమునిల్వదు ధాత్రిలోపలన్నాయువుమూడగానె జను లందరజేకొనిపోవు కాలుడున్బాయక యేడ్చినన్ దిరిగి ప్రాప్తముకాదని యెర్గి యందుకేపోయిన దేది రాదు మరి పోయెనటంచిటులేల వేడుకల్
కాలగర్భంబునన్దాగి కష్టసుఖములిట్టి మానవహృదయాన నిముడుకొనగనట్టి యనుభవసారంబు బట్టుకొనక-వెడలిపోయిన దానికై వేడ్కలేల?!
తీయని గుర్తులన్నిలిపి తీరని కోర్కెల దోగు కాలమున్బోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్హాయిగ నీ యనంత సమయంబున నందిన జీవనమ్ములోబోయుము క్రొత్త యూహలకుబూయగ జీవ మనంత ప్రేమమున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసడలి పోవును ప్రాయము నొడలు క్రుంగు
రిప్లయితొలగించండికాల గతిలోన తథ్యము కలత యేల
వెడలిపోయిన దానికై; వేడ్కలేల
ననగ తరుణత మదినింపి నలరు కొరకు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబాల్య కౌమార యౌవన ప్రాయములవి
శాశ్వతము కాద నెఱుగుమీ జగతి యందు
పండిపోయిన తలకేల వర్ణమద్ద
వెడలిపోయిన దానకై వేడ్కలేల?
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిప్రాయము కాదు శాశ్వతము వార్ధక మెవ్వడు నాపలేడటన్
గాయము శక్తిహీనమగు కన్నులు కాంతి విహీనమౌ కదా
మాయజగత్తునందికను మానుము కృత్రిమ వేషధారణల్
పోయినదేది రాదు మఱి పోయెనటంచిటులేల వేడుకల్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిఏల నో వెర్రి పరుగులు వింత గలుగు
వెడలి పోయిన దానికై వేడ్క లేల
గడచిన విలువగల క్షణ కాల మైన
తిరిగి బొందలేము నిజము తరచి జూడ
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటర్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికాలమేవింతజీవికికానబడదు
రిప్లయితొలగించండిబురిడిగోట్టించిమనిషినిపోవుగాదె
కలలసౌధంబుగూల్చునుకరుణలేక
వెడలిపోయినదానికైవేడ్కలేల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికష్ట నష్టాలు సుఖముల కడలి వోలె
రిప్లయితొలగించండిమచ్చ లెన్నియొ మిగిలించి మనుజ తతికి
కాల చక్రము గదలుచు గదలి పోయె
వెడలి పోయిన దానికై వేడ్క లేల?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిమారి కోవిడు డెల్టాగ మహినిఁ జెలఁగి
పిదపనదియె నెమిక్రాను పేర కుదిపె
నుపశమించుచు మార్పున నుప్పతిల్ల
వెడలిపోయిన దానికై వేడ్కలేల?
ఉత్పలమాల
హాయిని గూర్చు మాంసమని యందిన పాముల గబ్బిలమ్ములన్
మేయగఁ బుట్టి కోవిడది మృత్యువు నౌచును తగ్గి, రేగి డె
ల్టాయన! శాంతమై, యెమికరానన రెచ్చెను! మారకుండగన్
బోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్?
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా! నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు🙏
తొలగించండిపాయనిబంధముల్జనులబాధలుబెట్టుచుకాలచక్రమే
రిప్లయితొలగించండిచేయగఘోరముల్సుడులజీవనగమ్యమయోమయంబెగా
కాయల్పూవులున్వడలెకానరెజన్ననుభాసురంబుగా
పోయినదేదిరాదుమఖిపోయెనటంచిటులేలవేడుకల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"కాయలు పూవులున్వడలె..."
భావిపయి నాశ నొందుట భావ్య మెగద
రిప్లయితొలగించండి“వెడలిపోయిన దానికై వేడ్కలేల”
ననుచు నుడివిరి , మరి యిది యాగమించు
ఆంగ్ల సంవత్సరమున కాహ్వాన మిడుట
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికానరెజన్మను
రిప్లయితొలగించండిహాయిగసాగిపోయినదియాచిరుప్రాయమునాటపాటలన్
రిప్లయితొలగించండితీయనితీపిగుర్తులనుతీసుకుపోయెనుయౌవనంబుదీ
ర్ఘాయువుగోరియోషధులకాయముకల్పముకీయన్యాయమా
*"పోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్"*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురువు గారు
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండిపోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్"
తోయజ మిత్రుడేపగది దూరపుకొండలఁజేరువేళలన్
తోయపు టంజలిన్గొనుచు తోషమునింపడె భూజనాళికిన్
పోయెడు వత్సరంబటులె మూట మిగుల్చును తీపి గుర్తులే
--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికనులకొకనిముసమునైన కునుకునిడక
రిప్లయితొలగించండిమోమునకునెల్లవేళల ముసుగుకప్పి
వేదనమిగిల్చి యేడాది వెడలిపోయె
వెడలిపోయిన దానికై వేడ్కలేల
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్
రిప్లయితొలగించండిసేయుట పాడి గాదనుట చెల్లని మాటగు చేరి చూడగా
పోయినదా విషాణువది భూతలమున్ వణికించె నాడికన్
సేయుచు నీమపాలనము సేమమునెంచుచు జాగరూకులై
హాయిగనెల్లరున్ జరుపగాదగు వేడుక వత్సరాదినిన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉత్పలమాల:
రిప్లయితొలగించండిపోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్"
చేయుదురంచు ప్రశ్నిడిన చెప్పెడు తత్త్వమదొక్కటే మహిన్
మాయయెగాదె కాయముల మార్చుచు జన్మలఁ బొందు సంధిలో
హాయిగ జేయవేడుకలనందరు మెత్తురిదీ యదే కనన్
--కటకం వేంకటరామశర్మ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిదిగులుతొలగించి యాశలు చిగురుతొడుగ
రిప్లయితొలగించండివచ్చె ముందుకు నూత్న సంవత్సరమ్ము
వచ్చు కాలము నూహించి వాదులేల
వెడలిపోయిన దానికై వేడ్కలేల
మంచి పూరణ. అభినందనలు.
తొలగించండి🦌🙏
తొలగించండి🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిస్వస్థత చెఱపి జనులను బాధపెట్టి
జీవనాధారముల నెల్ల పోవజేసి
దయ నెడలి గత వర్షము తా కులుకుచు
వెడలి పోయిన దానికై వేడ్కలేల?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిహేయమునైన రోగమున నిల్పుచు యూపిరిదీయుచున్ సదా
శ్రేయమొనర్పకున్ జనుల జీవితమందు నవస్థ లుంచుచున్
గాయముజేసి పోయె నపకారపు వత్సర ముర్వివీడుచున్
పోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాయము యౌవనమ్ము కలకాలము నిల్పవు సంతసమ్మునన్
రిప్లయితొలగించండిప్రాయమడంగినన్ దిరిగి రాదది, యెంచ సుఖమ్ము దుఃఖమున్
ఖాయముగా ఘటిల్లును నికాయపు జీవనయానమందునన్
ధ్యేయము భావిపైనిలిపి తేకువతో వసియింప మేలగున్
పోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్
ప్రశ్నోత్తరి
రిప్లయితొలగించండితే.గీ:వచ్చు దానికి నిడ నేల స్వాగతమ్ము?
పుట్టి నట్టి బిడ్డను జూచి పొంగినట్లు.
"వెడలిపోయిన దానికై వేడ్కలేల"?
మరణ మొందిన తాత సంస్మరణ మట్లు
అర్కుడుదయించి పడమర యస్తమించు
రిప్లయితొలగించండితరలివచ్చిన తనువైన మరలిపోవు
కాలమెప్పుడైన కదలక నిలిచేన
వెడలిపోయిన దానికై వేడ్కలేల
ప్రశ్నోత్తరి
రిప్లయితొలగించండిఉ:"పోయిన దేది రాదు మరి "పోయిన దం చిటు లేల !వేడుకల్?"
"పోయెనుగా విడాకు లిడి బుద్ధిగ నింతట నైన చాలు లే."
"పోయెను భార్య యంచు తెగ పొంగుచు నుంటివి బాధ లేదొకో?"
"పోయెను కావునన్ సుఖము బొందెద నింతట కర్మ తీరెగా!".
(మా మిత్రు డొకడు భార్యతో బాధ పడి తనకి విడాకు లొచ్చిన రోజు నాకు కూల్ డ్రింక్ ఇచ్చాడు లెండి.ఇలాంటివీ ఉంటాయి.ఇంకా బాధ పెట్టకండా విడాకు లైనా ఇచ్చిందని అతడి సంతోషం.)
కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:
రిప్లయితొలగించండిఎల్ల జనులను భయమున నేడిపించి
ప్రజల సౌఖ్యము లెల్లను పాడు జేసి
బాధలను పంచి యుండిన వర్ష మదియె
వెడలి పోయిన దానికై వేడ్కలేల?
ఉంచ నేల యాశ లలమ టించు టేల
రిప్లయితొలగించండికాల చక్రము నాప శక్యమ్ము కాదు
వచ్చి వెడలెడు దానికై పర్వ మేల
వెడలిపోయిన దానికై వేడ్కలేల
మాయను దాఁటఁగాఁ దరమె మానవ కోటికి నెంత నేర్చినం
గాయము లుండఁ బోవు కలకాలము నేరికి నొక్క రీతినిన్
రేయి పవళ్లు కాదు విపరీతము నిత్యము వచ్చి పోవుటల్
పోయిన దేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో.....
రిప్లయితొలగించండివెడలి పోయిన దానికై వేడ్కలేల
యనగ మంచియేజరుగుటందు వలన
వర్ష మంతయు శుభములే బడయు కతన
జరుపు కొంటిమి వేడుకల్ సంత సమున
పోయినదేది రాదు మఱి పోయె నటం చిటు లేల వేడుకల్?
రిప్లయితొలగించండిమాయలమారి వత్సరమమంగళకారిణిగా గతించె లే
బ్రాయపు కూననైనవిడువన్ దయమాలి వధించెనందుకే
పోయిన వత్సరంబు చనిపోయిన సంతసమంద సాజమే.
మూడవపాదం విడువన్ బదులు విడకన్ అని చదువ ప్రార్థన
తొలగించండికాయము శాశ్వతంబనుచు గట్టడి జేసిన బోవుదప్పకన్
రిప్లయితొలగించండిబోయినదేదిరాదు మఱి పోయెనటంచిటు లేల వేడుకల్
మాయయె యీజగంబుసుమ మాధవు నామము నెల్లకాలమున్
శ్రేయము మోక్షమందుటకు చేయుము ధ్యానము శ్రద్ధతో నికన్
కాయము మాయమౌను గల కాలము
రిప్లయితొలగించండినిల్వదు ధాత్రిలోపల
న్నాయువుమూడగానె జను లందర
జేకొనిపోవు కాలుడున్
బాయక యేడ్చినన్ దిరిగి ప్రాప్తము
కాదని యెర్గి యందుకే
పోయిన దేది రాదు మరి పోయెన
టంచిటులేల వేడుకల్
కాలగర్భంబునన్దాగి కష్టసుఖము
రిప్లయితొలగించండిలిట్టి మానవహృదయాన నిముడుకొనగ
నట్టి యనుభవసారంబు బట్టుకొనక-
వెడలిపోయిన దానికై వేడ్కలేల?!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితీయని గుర్తులన్నిలిపి
రిప్లయితొలగించండితీరని కోర్కెల దోగు కాలమున్
బోయినదేది రాదు మఱి
పోయె నటం చిటు లేల వేడుకల్
హాయిగ నీ యనంత సమ
యంబున నందిన జీవనమ్ములో
బోయుము క్రొత్త యూహలకు
బూయగ జీవ మనంత ప్రేమమున్!