9, జనవరి 2022, ఆదివారం

సమస్య - 3957

10-1-2022 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పారిజాతమున్ గిరిజకుఁ బార్థుఁ డొసఁగె”
(లేదా...)
“అర్జునుఁ డద్రినందనకునై కొని వచ్చెను పారిజాతమున్”

28 కామెంట్‌లు:

  1. సత్యకేమిచ్చె కృష్ణుడు సంతసముగ,

    యెవరి సవతియై గంగమ్మ యెలమి బడిసె,

    గయున కభయ మొసగి నట్టి ఘను డెవరకొ

    పారిజాతమున్,గిరిజకు,బార్థు డొసగె

    రిప్లయితొలగించండి
  2. తనువుసగమైనతన్వికితరుణమెంచి
    మర్మయోగంబుదెలిసినమరునివైరి
    కలయఁబోసినగూఢంపుకాముడగుచు
    పారిజాతమున్గిరిజకుపార్థుడోసగె

    రిప్లయితొలగించండి
  3. వర్జముస్రుష్టికిన్గనడువారణసేయఁడుకాలకర్మమున్
    కర్జముసేయుచుండుకఱకంఠుడుప్రేక్షకపాత్రయందునన్
    తర్జనభర్జనేలఘనతాండవమాడుచుహాస్యమాడుచున్
    అర్జునుడద్రినందనకునైకోనివచ్చెనుపారిజాతమున్

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    గరికిపాటి ప్రవచనమ్ము మురిసి వింటె?
    వరుసనున్న వారల నలంకరణఁ గంటె?
    నేడు జెప్పితె కథ సఖీ! నీదునోట
    పారిజాతమున్ గిరిజకుఁ బార్థుఁ డొసఁగె!

    ఉత్పలమాల
    ఆర్జన జేయ జ్ఞానమును నాలయమందు పురాణమంటివే?
    జర్జను తోడి ప్రేక్షకుల సంబరమందుచు మున్గియుంటివో?
    వర్జితమైనదౌ గరికిపాటి ప్రసంగమునందు నెక్కడే
    యర్జునుఁ డద్రినందనకునై కొని వచ్చెను పారిజాతమున్?

    రిప్లయితొలగించండి
  5. క్రమాలంకారంలో --
    సత్య కేమిచ్చె కృష్ణుడు సంతసమున?
    శివు డెవరికి కట్టె ను దాళి చెలువ మలర?
    విప్రు కెవరిచ్చి రావును విల్లు బూని?
    పారిజాతమున్ : గిరిజకు : పార్థు డొసగె

    రిప్లయితొలగించండి
  6. ఆటవెలది

    సత్య భామ యడుగ చక్రి కాదనకను
    ప్రీతినొసఁగె//పారిజాతమున్,గి
    రిజకుఁబార్ధుఁడొసగె//భజియించి యీశ్వరున్
    పండ్లు పూలు పాశు పతముఁగోరి.

    రిప్లయితొలగించండి

  7. పొలతి సత్యయె కోరెనే పుష్ప మదియు,
    యీశి కౌశికి యనుపేరు లెవరి వంటి?
    ద్రోణు కెవరిచ్చిరితెలుపు ద్రుపదుడనన
    పారిజాతమున్, గిరిజకు, బార్ధు డొసగె.

    రిప్లయితొలగించండి

  8. తర్జన భర్జనల్ విడు యధార్థము తెల్పెదనంచు కార్తవీ
    ర్యార్జునుడిచ్చె పారిజము యాదవి కంచు వచింప మూర్ఖుడౌ
    దర్జియె చెప్పె నిట్టుల బుధానుడ నీభువి నేనటంచు నా
    యర్జునుడద్రి నందనకు నైకొని వచ్చెను పారిజాతమున్.

    రిప్లయితొలగించండి
  9. దుర్జనులైన కౌరవుల ద్రుంచగ నెవ్వడు
    చేసె యుద్ధమున్?
    గర్జనతోడ పర్వులడు గంగను దోడుగ
    దెచ్చె నీశుడున్
    ఆర్జన జేసి సత్యకయి యచ్యుతు
    డెయ్యది తెచ్చియిచ్చెడిన్?
    అర్జను డద్రినందనకునై కొని తెచ్చెను
    పారి జాతమున్

    రిప్లయితొలగించండి
  10. ఇంద్రలోకమునకు కృష్ణుడేమికోరి
    వచ్చె? శంకరుడెవరికి భర్త? గయుడు
    శరణు వేడగ దానినొసగినదెవరు?
    పారిజాతమున్; గిరిజకుఁ; బార్థుఁ డొసఁగె

    రిప్లయితొలగించండి
  11. హితుడు పార్థుని తోడుగ హిమజ కీయ
    పెరటి పారిజమును గొని వెడలిరిగద ,
    దేవళమున నేమయెనన దెలిపె నిటుల
    ‘పారిజాతమున్ గిరిజకుఁ బార్థుఁ డొసఁగె’

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    ప్రక్కయింటి పార్థుడమిత భక్తితోడ
    శివున కభిషేక మొనరించి చెంతనున్న
    ఈశ్వరి గుడిని దర్శించి యిమ్ముతోడ
    పారిజాతమున్ గిరిజకు బార్థుడొసగె.

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    అర్జునుడన్న పేరుగల నాప్తుడు శంభుని దేవళమ్ములో
    వర్జితమొంద పాపములు ఫాలుని కర్చన జేసి పిమ్మటన్
    కర్జములందునన్ జయము గల్గగ నెంచుచు తోటనుండియున్
    అర్జునుడద్రి నందనకునై కొనివచ్చెను పారిజాతమున్.

    రిప్లయితొలగించండి
  14. వెర్రి దోసను తింటివో, వెంగలివొకొ!
    భంగు నీమెదడునుభంగ పరచెనొక్కొ
    "పారిజాతమున్ గిరిజకుఁ బార్థుఁ డొసఁగె”
    ననుచు పలుకుటలోనంతరార్ధమేమి?

    రిప్లయితొలగించండి
  15. నిర్జితనిర్జరేంద్రుడు వినీలపయోదవిరాజితుండు వీ
    ర్యార్జితపారిజాతసుమరాజము సత్య కొసంగె నంట నీ
    వూర్జితశక్తి నాకొసగవో యన పార్వతి భూతిలిప్తవ
    ర్ణార్జునుఁ డద్రినందనకునై కొని వచ్చెను పారిజాతమున్

    అర్జున = తెలుపు
    భూతిలిప్తవర్ణార్జునుడు = విభూతి పూయబడిన వర్ణముచే తెల్లనైన వాడు శంకరుడు

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  16. తేటగీతి
    దేవపతి సమర్పించెను దివ్య సుమము
    పారిజాతమున్ గిరిజకు ,బార్థు డొసగె
    ద్రోణునకు గురు దక్షిణ ద్రుపదు నొడిసి
    పట్టి సంగరమున పరిపంథి గానె.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  17. శౌరి కోరి తెచ్చెనదేమి సత్య కొరకు
    నేరి వలపు నిలుపనెంచి నెరిసె మదను
    డేరిడెనభయంబు గయునకెన్నగాను
    పారిజాతమున్ గిరిజకుఁ బార్థుఁ డొసఁగె

    రిప్లయితొలగించండి
  18. ఆర్జన సేయ పాశుపత మాహరు మ్రొక్కె, స్తుతించె భక్తితో
    నర్జునుడద్రినందనకునై,కొని తెచ్చెను పారిజాతమున్
    నిర్జరులెల్లగాంచి కడు నివ్వెర జెందుచునుండ శీఘ్రమే
    దుర్జన నాశకుండు హరి తోరపుఁబ్రేమను సత్యభామకై.

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. సత్యకిచ్చెను బ్రేమతో జక్రపాణి
    పారిజాతమున్ ,గిరిజకు పార్ధుడొసగె
    ననుట సరికాదు మఱియును నర్ధ రహిత
    మార్య! చింతజే యుడొకపరి మీరు కూడ

    రిప్లయితొలగించండి
  21. ఆర్జన మందగించి మనసంత కకావికలై యొకండు తా
    నూర్జము సన్నగిల్లి తన యుల్లము తల్లడమంద వెర్రియై
    గర్జన చేయుచున్బలికె కర్ణపుటంబులు కంపమొందగా
    నర్జునుఁ డద్రినందనకునై కొని వచ్చెను పారిజాతమున్

    రిప్లయితొలగించండి
  22. వటువుగా వచ్చి స్వీయ రూపమ్ము సూపి
    మెచ్చి తనమీది భక్తికి నిచ్చ గొప్ప
    వరము కైలాస గిరిరాజు వాక్ప్రసూన
    పారిజాతమున్ గిరిజకుఁ బార్థుఁ డొసఁగె


    స్వర్జన పూజనీయుఁడును బార్థుని సారథి వాసుదేవుఁడే
    కర్జము లందు నైపుణుఁడు కంస విరోధియు శాత్రవాలికిన్
    దుర్జయుఁ డైన గోపకుఁడు దోర్బలుఁ డెత్తెను మేఘ సన్ని భా
    నర్జునుఁ డద్రి నందనకునై కొని వచ్చెను బారిజాతమున్

    [సన్నిభ + అనర్జునుఁడు = సన్ని భానర్జునుఁడు; అనర్జునుఁడు = నల్లని వాఁడు; నందన = సంతోషించునది, ఇక్కడ సత్యభామ]

    రిప్లయితొలగించండి
  23. అర్జునుడద్రి నందనకునై కొనివచ్చెను పారిజాతమున్
    నిర్జరుడౌ మునీశ్వరుడు నెమ్మది పారిజమున్ గొనంగగా
    నర్జునుడు నద్రినందనకునై గొనిదెచ్చెనటంచు బల్కిరే
    యర్జును డేగొనెన్ననుట కానిక చూపుము రాజశేఖరా!

    రిప్లయితొలగించండి
  24. వలచి పెండ్లాడె గిరిజను పార్థుడనెడు
    పడుచువా డాత డెంతయో గడుసువాడు
    పెండ్లమడుగఁగ పువ్వులు పెరటిలోని
    పారిజాతమున్ గిరిజకుఁ బార్థుఁ డొసఁగె

    రిప్లయితొలగించండి