10, జనవరి 2022, సోమవారం

సమస్య - 3958

11-1-2022 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విపరీతమ్ములఁ బలికిన విద్వాంసుఁ డగున్”
(లేదా...)
“విపరీత ప్రతిభాష లాడినపుడే విద్వాంసుఁ డంచందురే”

26 కామెంట్‌లు:

  1. కపటపు పండితు డగు దా
    విపరీతమ్ముల బలికిన : విద్వాo సు డగున్
    తపనము తో రచియించుచు
    నిపుణులు మెచ్చ o గ దాను నేర్పును జూపన్

    రిప్లయితొలగించండి

  2. అపకారమ్ములు జేసెడి
    విపక్షుల పలుకు లకెప్డు భీతిల్లక తా
    నపమర్ధము చెందకనే
    విపరీతమ్ములఁ బలికిన విద్వాంసుడగున్.

    రిప్లయితొలగించండి
  3. కందం
    అపశబ్ధంపు సమస్యకు
    సుపథమ్మున పూరణమ్ము శోభిల్లదనన్
    విపులాక్షేపణమెంచుచు
    విపరీతమ్ములఁ బలికిన విద్వాంసుఁ డగున్

    మత్తేభవిక్రీడితము
    అపురూపంపు వధాన మందున సమస్యాపృచ్ఛకుండంతటన్
    విపరీతార్థము పాదుగొల్పియిడగన్, విద్వత్తుఁజూపించి తా
    నపశబ్ధంబును మార్చ పూరణమునందాక్షేపణంబెంచుచున్
    విపరీతప్రతిభాష లాడినపుడే విద్వాంసుఁ డంచందురే!

    రిప్లయితొలగించండి

  4. అపరాధమ్మదికాదు సంతతము హాస్యంబాడుచున్ వేడ్కగా
    నపకారమ్మును చేయబూనెడరులే యజ్ఞానమున్ బల్కగా
    నపమర్ధమ్మును చెందబోక తగు పర్యాయంబులన్ వాడుచున్
    విపరీతప్రతి భాషలాడినపుడే విద్వాంసుడంచందురే.

    రిప్లయితొలగించండి
  5. అపచారముకాదనుచును
    కుపితుండైసంఘమందుకోవిదువోలెన్
    తపననుప్రతికూలతతో
    విపరీతమ్ములబలికినవిద్వాంసుడగున్

    రిప్లయితొలగించండి
  6. చపలత్వంబు బయల్పడు
    విపరీతమ్ములఁ బలికిన,విద్వాంసుఁ డగున్
    నుపదేశంబుల నొసగుచు,
    యపవాదును బొందకుండ యలరిన ప్రతిభన్

    రిప్లయితొలగించండి
  7. నిపుణత్వంబును లేదు భాష పయినన్,
    నిక్కంబు తెల్యుంగదా,
    విపరీత ప్రతిభాష లాడినపుడే, విద్వాంసు
    డంచందురే
    చపలత్వంబును లేక పండితులకున్
    సద్భావమేపారగా
    విపులంబొప్పగ విన్నవించు నతనిన్
    వేనోళ్ళ కీర్తించుచున్

    రిప్లయితొలగించండి
  8. కపటపు సన్యాసిగ తా
    నపచారమ్ములు సలిపెడు నటమటగాడై
    యుపదేశమ్ముల పేరిట
    విపరీతమ్ములఁ బలికిన విద్వాంసుఁ డగున్

    రిప్లయితొలగించండి
  9. తపముల్సల్పుచు తత్త్వ చింతనములో తాదాత్మ్యముం జెందుచున్
    కృపతో భక్తులనుద్ధరించు పనిలో గీలించు సన్యాసిగా
    కపటాటోపముచూపు దాంభికులదే కాలమ్ము యోచింపగా
    విపరీతప్రతిభాష లాడినపుడే విద్వాంసుఁ డంచందురే

    రిప్లయితొలగించండి
  10. నృపసభ నలరుచు నిత్యము
    నపకారముఁజేయఁబూని యనృతములాడే
    యపవాదకుతోఁదగుగతి
    విపరీతమ్ములుఁబలికిన విద్వాంసుఁడగున్.

    రిప్లయితొలగించండి
  11. కపటియని యందురు జనులు
    విపరీతమ్ములఁ బలికిన .; విద్వాంసుఁ డగున్
    యపరాధము నలుపకనే
    యుపయుక్తమయిన విషయము నొప్పుగ దెలుపన్

    రిప్లయితొలగించండి
  12. అపకీర్తియె మిగులునుగద
    విపరీతమ్ములఁ బలికిన; విద్వాంసుఁ డగున్
    చపలములేనిపొలుపునన్
    విపరీతపుకృషినిసల్పి విద్యనునేర్వన్

    రిప్లయితొలగించండి
  13. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    అపురూపపు కథ యైనను
    నిపుణతతో దానియందు నిక్షిప్తమునై
    అపకారమెంచు చుండెడి
    విపరీతమ్ముల బలికిన విద్వాంసుడగున్.

    రిప్లయితొలగించండి
  14. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    అపురూపమ్మగు పాఠ్యమంచు నతిగా నార్భాటమున్ చెందుచున్
    విపరీతమ్ముగ పొంగు వారలకు తాపేర్కొంచు నందుండునౌ
    అపకారమ్మును గూర్చు యంశములనే యావిష్కృతిన్ జేయుచున్
    విపరీతప్రతిభాష లాడినపుడే విద్వాంసుఁ డంచందురే!

    రిప్లయితొలగించండి
  15. కపటపు గురువుగ పేలిన
    చపలపుటాంగ్లపు గిరీశ సంభాషణముల్
    సుపరిచిత నిదర్శనములు
    విపరీతమ్ములఁ బలికిన విద్వాంసుఁ డగున్

    (కన్యాశుల్కం నాటకాథారము)

    రిప్లయితొలగించండి
  16. ఎపుడేరీతి వచించ మంచిదటులే హృద్యంబుగాబల్కుచున్
    నృపు సాన్నిధ్యమునందు నొప్పు బుధులున్ నేర్పుల్
    ప్రదర్శించరే!
    యపవాదంబులు వచ్చినన్ వెఱతురే!న్యాయంబుకై
    పోరుచున్
    విపరీత ప్రతిభాషలాడినపుడే విద్వాంసుడంచందురే!

    రిప్లయితొలగించండి
  17. కందం
    తపశీలి హిమజ కోపిం
    చె పరమ శివ దూషణంబు జేసిన వటువున్
    కపట వటువయ్యె హరుని గ
    విపరీతమ్ములు బలికిన విద్వాంసుడగున్
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  18. శ్రీకృష్ణుడు శిశుపాలునితో ...

    కృపణత్వమ్మెద మచ్చుకైన కలదే ప్రేలాపనల్ మానవో!
    యపనీతోక్తులు మాటలాడ శిశుపాలా! నూరు తద్వాక్యముల్
    కృపతో తాలిమి జూపితిన్, సహన మింకేలా వహించన్ దగున్
    విపరీత ప్రతిభాష లాడినపుడే విద్వాంసుఁ డంచందురే?

    కంజర్ల రామాచార్య

    రిప్లయితొలగించండి
  19. అపకీర్తియె దక్కునుగా
    విపరీతమ్ములఁ బలికిన; విద్వాంసుఁ డగున్
    నిపుణతతో శాస్త్రంబుల
    నపశబ్దంబులు దొరలకనావేదింపన్

    రిప్లయితొలగించండి
  20. అపహాసము పాలగుదురు
    విపరీతమ్ములబలికిన,విద్వాంసుడగున్
    దపనను జదివిన మనుజుడు
    నిపుణతదానొంది భువిని నింగిసిగ దయన్

    రిప్లయితొలగించండి
  21. ఉపకార మేమి సంతత
    ము పలువురు కఱపిన మారుపు కనం బడునే
    కపటులు పాషండులకున్
    విపరీతమ్ములఁ బలికిన విద్వాంసుఁ డగున్


    కృప శాస్త్రజ్ఞులు ధర్మ వేత్తలు తగం గీర్తించు ధర్మాలికిన్
    నెపముల్ సూపుచు శిష్య బృందమునకున్ నిత్యమ్ము దుర్బుద్ధిఁ బ్ర
    త్యుప దేశమ్మొనరించు పూరుషుని యా దుష్టాత్ము వాక్యాలికిన్
    విపరీత ప్రతిభాష లాడినపుడే విద్వాంసుఁ డంచందురే

    రిప్లయితొలగించండి
  22. అపహాస్యంబుగ బల్కబూనుదురు మాహాత్మ్యంబు బోనాడుచున్
    విపరీత ప్రతిభాషలాడినపుడే,విద్వాంసుడంచందురే
    యెపుడున్ శాస్త్రము లన్నియున్ నిరతి యీడేరన్ సమాయత్తునిన్
    సఫలం బౌచును వానికీర్తీయిక నాశాంతంబు వ్యాపించుగా

    రిప్లయితొలగించండి
  23. ఉపమానంబులు జూడగా తెలియులే యుర్విన్ కవుల్ కొందరిన్
    విపరీత ప్రతిభాష లాడినపుడే విద్వాంసుఁ డంచందురే,
    నెపముల్ మోపుచు రామకృష్ణకవియే నెగ్గెన్ సదా నేర్పుతో,
    యపవాదున్నను నేటికిన్ వికటతన్,విఖ్యాతుడై మాన్యుడై.

    రిప్లయితొలగించండి
  24. కపటంబందురు యెవ్వరైన భువిపై కాఠిన్య చిత్తమ్ముతో
    విపరీత ప్రతిభాష లాడినపుడే, విద్వాంసుఁ డంచందురే
    తపనమ్మొంది లిఖించుచున్ గవిత బ్రాధాన్యంపు సందేశమున్
    విపులమ్మౌగతి చేర్చుచున్ బ్రజలకున్ విజ్ఞానమున్ బంచగా

    రిప్లయితొలగించండి
  25. ఉపమానంబుల జూపి కైతలను ధృ త్యోత్సాహమున్ వ్రాయగన్
    నిపుణత్వ మ్మలరంగ పాండితి సభా
    నీకంబు రంజిల్లగన్
    నెపముల్ జూపు విమర్శకాళికిని వా
    నిన్ద్రోలి భాసింపగన్
    విపరీత ప్రతిభాష లాడినపుడే
    విద్వాంసుఁ డంచందురే!

    రిప్లయితొలగించండి