15, జనవరి 2022, శనివారం

సమస్య - 3963

16-1-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తృప్తిపడి రెల్లరును దినఁ దిండి లేక”
(లేదా...)
“తినుటకుఁ దిండి లేక కడుఁ దృప్తిని పొందిరి చూడ నెల్లరున్”

44 కామెంట్‌లు:

  1. మౌనిగణము, దుర్వాసుడు మంకు వీడె

    వెన్న దొంగ మాయవలన‌ వెతలు పడుచు

    తృప్తి పడిరెల్లరును,తిన‌ తిండి,లేక

    ఖాళి యిసుమంత వారల కడుపు లందు

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    అన్నమిడుదునంచు నన్నపూర్ణ యనగ
    వ్యాసుఁడేగె శిష్యవరుల తోడ
    వారణాసిఁ//దృప్తి పడిరెల్లరును,దినఁ
    దిండిలేక //యొక్క డుండ లేదు.

    రిప్లయితొలగించండి
  3. కడుపునిండినపెద్దలుఘనతతోడ
    అంబరమ్మునచిందులనాడుచుండ
    త్రుప్తిపడిరెల్లరును, దినతిండిలేక
    పేదగుండెలుమండెనువేధతోడ

    రిప్లయితొలగించండి

  4. ఆనకట్టల గట్టుచు నగ్గిచూలి
    నిలువజేయుట గాంచుచు నిజముగాను
    తృప్తి పడిరెల్లరును, దిన దిండి లేక
    చావబోమంచు తలచిరే సంతసమున.

    రిప్లయితొలగించండి
  5. వనముల గూల్చినంత నిక వర్షము లుండక భూతలమ్మునన్
    వనమది మృగ్యమై పొలము బంటలు లేకజనాళి జావరే
    తినుటకు దిండిలేక, కడు దృప్తిని పొందిరి చూడ నెల్లరున్
    ఘనమగు వానకట్టలవి కట్టి కబందమునంద జేయగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "ఘనమగు నానకట్టలవి కట్టి జలంబుల నందజేయగన్" అంటే బాగుంటుందేమో?

      తొలగించండి
  6. రాజు దేశసంచారము చేసిన విధానాన్ని తన సేవకునికి చెప్తూ...
    చ.
    వనముల దీనులై జనులు పంటల యందు జరించి, ప్రాణముల్
    పణముగ పెట్టి జీవితము పైనొక యించుక నాశ లేక వార్
    మనుయుచు నుండ నేను గని మన్నన చేత నొసంగ వారికిన్
    తినుటకుఁ దిండి, లేక! కడుఁ దృప్తిని పొందిరి చూడ నెల్లరున్

    లేక = సేవకుడు

    రిప్లయితొలగించండి
  7. తేటగీతి
    విషపు రోగమగు కరోన విరుచుకు పడ
    జనుల పై ,దల్చి రంతట జాలి గొల్ప
    బ్రతికిన బలుసాకును తిని బ్రతుకుదుమని
    తృప్తిపడి రెల్లరును దిన దిండి లేక.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  8. కుండపోతగవానలు కురియ ప్రజల
    కష్టములుదీర్చ ప్రభుతయే కదలివచ్చె
    తృప్తిపడి రెల్లరును దినఁ దిండి లేక
    నలమటించెడు నార్తుల నాదుకొనగ

    రిప్లయితొలగించండి
  9. చినుగులజీవితంబులనుచేర్చగనోడ్డుకుచింతఁదీర్చగా
    జనులకుచిత్రమెంతయునుఁజెప్పగవచ్చునుగోప్పగానిలన్
    కనిరిగకాంక్షతీరగనుగాధలునేత్రమువిందుచేయగా
    తినుటకుతిండిలేకకడుద్రుప్తినిపోందిిరిచూడనెల్లరున్

    రిప్లయితొలగించండి
  10. దాత సాయము జేయంగ దనిసి వారు
    తృప్తి పడి రెల్లరును దిన తిండి లేక
    నున్న మమ్మెల్ల కాపాడ నుసురు మిగిలె
    ననుచు మ్రొక్కిరి యాతని కంద రపుడు

    రిప్లయితొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వర్షపాతము మితిమీరి పంటచేలు
      మునిగె నరుదగు కరవుతో ముప్పువచ్చె
      నిస్సహాయులై గ్రుక్కెడు నీళ్ళుతాగి
      తృప్తిపడి రెల్లరును దినఁ దిండి లేక

      తొలగించండి
  12. భక్త మైదురూకలకను పథకము విని
    తృప్తిపడి రెల్లరును ; దినఁ దిండి లేక
    నలమటించు జనులకిది యనుగుణమని
    దలచి , నాయకునొక గొప్ప దాతయనిరి

    రిప్లయితొలగించండి
  13. రిప్లయిలు
    1. తేటగీతి
      ఎగువ ప్రాంత వర్షాభావమెరిగి నేత
      యెత్తిపోతల పథకాలనింపుఁ గూర్చ
      గతమున వెగచి,ధాన్యపు గాదెలఁ గని
      తృప్తిపడి రెల్లరును, దినఁ దిండి లేక

      చంపకమాల
      మనుటకు నెత్తపోతలవె మార్గమటంచును మిట్ట ప్రాంతమై
      మనమున నెంచి నేత కడుమాన్యుడు సేయఁగ రూపకల్పనన్
      దనరఁగ ధాన్యరాశులవె ధామము సేర గతమ్మునందునన్
      దినుటకుఁ దిండి లేక కడుఁ దృప్తిని పొందిరి చూడ నెల్లరున్!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  14. చంపకమాల
    కనరు మొయిళ్ళజాడ చినుకన్నది కానక పంటలన్నిచెడన్
    మునుపు జనమ్ము కష్టముల మోపుల మోసిరి కంటనీటితో
    “తినుటకుఁ దిండి లేక, కడుఁ దృప్తిని పొందిరి చూడ నెల్లరున్”
    గునగున కృష్ణ గౌతమిల క్రొత్తగ నెత్తుజలమ్ముల న్గనన్
    --కటకం వేంకటరామ శర్మ

    రిప్లయితొలగించండి
  15. అనయము దారు లందుఁ గని యన్నిరకమ్ములకూడుఁ గ్రోలుచున్
    గొనరు కుటుంబ భోజనముఁ గోరిన వంటలు చేయఁ గష్టమై
    కనుచు కరోన భూతము దుకాణము లన్నియు మూయ వీథులన్
    దినుటకుఁ దిండి లేక కడుఁ దృప్తిని పొందిరి చూడ నెల్లరున్

    రిప్లయితొలగించండి
  16. మునిఁగనియన్నపూర్ణవినుమోయి!శపించగఁబూనినావుగా
    తినుటకుఁదిండిలేక,కడుదృప్తినిపొందిరిచూడ
    నెల్లరున్
    పనివడి మీకుభిక్షనిడ,పాడియె మీకిది?వారణాసి యం
    దున నివసింపగాఁదగదు దూరముగాఁజను శీఘ్రమే యనెన్.

    రిప్లయితొలగించండి
  17. కనివిని యెర్గనట్టి యతి కష్టపు
    కాలము సంభవించెడిన్
    మనుటకు మార్గ మెర్గకను మట్టి జనావళి యేడ్చుచుండగన్
    తినుటకు తిండిలేక, కడు దృప్తిని
    పొందిరి చూడనెల్లరున్
    అనుపమ ప్రేమతోడ జను లాకలి
    దీర్చె దయాళువొక్కడున్

    రిప్లయితొలగించండి
  18. తేటగీతి
    పెద్ద పండుగ 'కెటులనో వీలు గల్గి
    స్వంత యూరికి చేరంగ పయనమయ్యి
    “తృప్తిపడి రెల్లరును దినఁ దిండి లేక”
    పోయిననుగాని తమవూళ్ళఁ బోవుటకును
    '
    --కటకం వేంకటరామ శర్మ

    రిప్లయితొలగించండి
  19. బాలసారెకు వచ్చిన బంధు గణము
    కడుపు నిండుగ భుజీయించి విడువ కుండ
    తృప్తిపడిరెల్లరును ,దినతిండిలేక
    బాధ పడుచుండి రెందఱో వరద వలన

    రిప్లయితొలగించండి
  20. అచట క్షామము తాండవ మాడ భృశము
    వర్షములు లేక మఱి పెక్కు వర్షములును
    గుమిలి యాఁకలి కంత నలమట, చెదరఁ
    దృప్తి, పడి రెల్లరును దినఁ దిండి లేక


    అని పని నైపుణమ్మున భయమ్మును వీడి రిపుస్థలమ్ములం
    దనశన రీతిఁ జేయఁగ బలాధిపుఁ డింపుగఁ గాంచి యంత నీ
    సున నరుదెంచి వీడి చను చుండఁగ వెన్కకు శత్రు కోటియే
    తినుటకుఁ దిండి లేక కడుఁ దృప్తిని పొందిరి చూడ నెల్లరున్

    రిప్లయితొలగించండి
  21. వినుమిది యెందరో యిలను భీకర రోగము బారి నొందిరే
    తినుటకు తిండిలేక,కడు దృప్తిని పొందిరి చూడనెల్లరున్
    దినగను బిండీ వంటలను దేనుపు దేన్చగ మేరకున్ మఱిన్
    ఘనముగ బెండ్లి వేడుకల ఘట్టము హెచ్చగు రీతిగ నుండుచోటునన్

    రిప్లయితొలగించండి
  22. వినుడు నిజంబటంచు దన పిల్లలకిట్టుల దల్లి నేర్పగా
    "దినుటకునెక్కసంబనుచు దిండిని వ్యర్ధమొనర్పరాదయో
    గనుమటువంక పేదలతి కష్టముగా పచరింత్రు జీవికన్
    తినుటకుఁ దిండి లేక", కడుఁ దృప్తిని పొందిరి చూడనెల్లరున్

    రిప్లయితొలగించండి

  23. ఘనముగ వేడ్క జేసిరట
    కాంతుల నీనెడి చప్పరంబులన్
    గననట పిజ్జబర్గరులె
    కానగ రావట పాయసాన్నముల్
    కనుగొన నస్మదీయులకు
    కమ్మని ఘుమ్మను‌ పిండివంటలన్
    దినుటకుఁ దిండి లేక! కడుఁ
    దృప్తిని పొందిరి - చూడ నెల్లరున్!

    రిప్లయితొలగించండి