21, జనవరి 2022, శుక్రవారం

సమస్య - 3969

22-1-2022 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శవము దటాలునను లేచె సంతస మెసఁగన్”
(లేదా...)
“శవము దటాలునన్ మిగుల సంతసమందుచు లేచెఁ జూడుమా”

23 కామెంట్‌లు:

  1. పవనునినిష్ర్కమంబనగప్రాణమువోవుటగానపెన్మిటిన్
    ఉవిదప్రశాంతచిత్తవయియొద్దకుదెమ్మనినారసింహవా
    ణివనితతోననన్శవమునేగొనిదెచ్చినహస్తస్పర్శతో
    *“శవము దటాలునన్ మిగుల సంతసమందుచు లేచెఁ జూడుమా”*
    గురుచరిత్ర కథ ఆధారంగా

    రిప్లయితొలగించండి
  2. అవకాశముకుదిరెనునే
    డవసరముగ బాలవీరులందరగూడన్
    భవనమునవారిఁ గన శై
    శవము దటాలునను లేచె సంతస మెసఁగన్

    రిప్లయితొలగించండి

  3. శివుడు వధించిన బాలుని
    భవాని శోకించెననుచు పద్మి తలను మా
    ణవకుని కతికింపగనే
    శవము దటాలునను లేచె సంతస మెసగన్.

    రిప్లయితొలగించండి
  4. కందం
    అవిరళ యోగక్రియలో
    శవాసనము జూసి, చచ్చె చతురుడనె జనుల్!
    చివఱకు యోగ నిపుణుడను
    శవము దటాలునను లేచె సంతస మెసగన్

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.
    చతురుడు-యోగక్రియ నేర్పరి.

    రిప్లయితొలగించండి
  5. అవురా!సావిత్రియు,స
    త్యవంతు ప్రాణంబులడుగ యమునిన్ యుక్తిన్
    నవలా!యిచ్చితినన,తత్
    శవముతటాలునను లేచె సంతసమెసగన్.

    కవివర!యాటపాటల సుఖంబుగ దొర్లును జీవితాన,శై
    శవము,తటాలునన్ మిగుల సంతసమందుచు లేచెఁజూడుమా!
    నవనవలాడు యౌవనమనంగునికిన్ నిజ ధామమేయనన్
    చివరగ వార్ధకమ్ము మనిషింగడు క్రుంగగఁజేయు సత్యమౌ.

    రిప్లయితొలగించండి

  6. భవహరుడైన శంకరుడె బాలుని నిర్దయుడై వధించెనం

    చు విజయ క్రుళ్ళగించగనె శోకము మాన్పదలంచి వేగ భా

    ర్గవపు శిరమ్ము దెచ్చి కరకంఠుడు తానతి కించి నంతనే

    శివము దటాలునన్ మిగుల సంతస మందుచు లేచెఁ జూడుమా.

    రిప్లయితొలగించండి
  7. భువిలో బాలురు కొందరు
    జవమున పరుగులను దీయు చాతుర్యము దా
    నవ లోకించిన తరి శై
    శవము ద టాలునను లేచె సంతస మెస గన్

    రిప్లయితొలగించండి
  8. భవమునొసంగు మద్విభుని భవ్య చరిత్రుని మౌళి యందు ప్రా
    భవముగ పింఛమున్ మెడను బాయక కౌస్తుభ మున్నయా సుధా
    ర్ణవమునువీడి గోకులము రంజిలవచ్చిన కృష్ణుగాంచ శై
    శవము దటాలునన్ మిగుల సంతసమందుచు లేచెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  9. సవితృని చెల్లెలి గృహమున
    వివాహ విందున నొసగిన ప్రియమగు వంటన్
    చవిగొన నాయందలి శై
    శవము దటాలునను లేచె సంతస మెసఁగన్

    రిప్లయితొలగించండి
  10. చంపకమాల:
    పవలును రేయిలున్ జనుల బాధలు దీర్చగ పోరుసల్పితిన్
    కవనము జేసి పేదప్రజ కష్టములన్ యెలుగెత్తి చాటితిన్
    చివరకు నాదు కాయము విచిత్రము వైద్యుల విద్యకందగా
    “శవము దటాలునన్ మిగుల సంతసమందుచు లేచెఁ జూడుమా”
    --కటకం వేంకటరామ శర్మ

    రిప్లయితొలగించండి
  11. నవనవమగుబాలురచట
    శివమెత్తిన రీతి వైచు చిందులు చూడన్
    చివచివమనినాలో శై
    శవము దటాలునను లేచె సంతస మెసఁగన్

    రిప్లయితొలగించండి
  12. కందము:
    పవనములైదు విడిచినవి
    జవసత్త్వమ్ములు చెమటగ జారి వరదలై
    భువిజారి, "నాశ "చావకే
    “శవము దటాలునను లేచె సంతస మెసఁగన్”
    --కటకం వేంకటరామ శర్మ

    రిప్లయితొలగించండి
  13. ప్రవిమలమైన చిత్తమున వాహిని తానము చేయుచుండి యం
    బువున మునంగ నీరుగొని పోయెను ప్రాణమటంచు నెంచగా
    దివుజునిఁ బోలునొక్కరుడు తీయజలమ్మును నొక్కి మేను నా
    శవము దటాలునన్ మిగుల సంతసమందుచు లేచెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  14. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  15. అవిరళముగ బనిజేయగ
    వివశత్వము బొంది మిగుల,వీడగ శ్వాసన్
    భవునిన్బలుమరు వేడగ
    శవము దటాలునను లేచె సంతస మొసగన్

    రిప్లయితొలగించండి
  16. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  17. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  18. అవిరళ కార్యభారమున నాకుల రాములు శోషజెందగా
    వివశత నొంది యొక్కపరి వీడగ శ్వాసనునందరప్పుడున్
    భవుని మనంబునన్దలచి ప్రార్ధన జేయగ స్వామి సత్కృపన్
    శవము దటాలునన్ మిగులసంతసమందుచు లేచె చూడుమా

    రిప్లయితొలగించండి
  19. భువి నత్యాశం జెందం
    గ వలదని వచింప నొక్క కథ నింపారం
    గ వినిన మది యా కథ పా
    ర్శవము దటాలునను లేచె సంతస మెసఁగన్

    [పార్శవము = పరశువునకు సంబంధించినది]


    చెవు లట దద్దరిల్లఁగను జిందులు వేయుచు బాలు రచ్చటన్
    రవములు నిండ దిక్కులను రమ్య తరమ్ముగ నాడఁ జూడఁగా
    వివశము సెంది మానసము వింతగ జ్ఞప్తికి రాఁగ నాత్మ శై
    శవము దటాలునన్ మిగుల సంతస మందుచు లేచెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  20. భువిపై మరలా బ్రతుకుట
    శవముగ మారిన తదుపరి సాధ్యంబగునా
    వివరింపగనొక జీవ
    చ్ఛవము దటాలునను లేచె సంతస మెసఁగన్

    రిప్లయితొలగించండి
  21. యువకునిగా విదేశములకువ్విళులూరుచు నేగి జీవికన్
    భవముగ నివ్వహించి నిజ బాంధవులన్ గన నేగెనూరికిన్
    భవనము జేరగానె మది బైకొనె నాటి స్మృతుల్ స్ఫురించె శై
    శవము దటాలునన్ మిగుల సంతసమందుచు లేచెఁ జూడుమా

    రిప్లయితొలగించండి
  22. సవినయమొప్ప జీవితము సాగుట
    కెన్నయొ యాటుపోటులు
    న్నవిరల కష్ట నష్టముల నన్నియు
    నేను సహించితిన్ సదా
    భువి యవకాశమందినది పొంకపు
    పౌత్రులతోడనాడ శై
    శవము తటాలనన్ మిగుల సంతస
    మొందుచు లేచె చూడుమా

    రిప్లయితొలగించండి
  23. కందం
    అవనిని బాల్యపు స్మృతులు త
    నివిదీరవనఁగఁ గుచేలుని నతిధిగ గనన్
    స్తవనీయ కృష్ణునకు శై
    శవము దటాలునను లేచె సంతస మెసఁగన్


    కందం
    భువిని హరి వేంకటపతిగ
    నవరూపము దాల్చి వకుళ నర్మిలిఁ గనఁగన్
    బ్రవిమల యశోద స్మృతి శై
    శవము దటాలునను లేచె సంతస మెసఁగన్

    చంపకమాల
    భువిఁదిగి లక్ష్మికై వెదకి పుట్టను దా నివసించువేళ మా
    ధవుడట గాయమై నుదుట తల్లియనన్ వకుళమ్మఁ జేరఁగన్
    బ్రవిమలమౌ యశోద స్మృతి రంజిల జేయఁగ బాలకృష్ణ శై
    శవము దటాలునన్ మిగుల సంతసమందుచు లేచెఁ జూడుమా!

    రిప్లయితొలగించండి