27, జనవరి 2022, గురువారం

సమస్య - 3975

28-1-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శల్యుం డర్జునునకు రథసారథి యయ్యెన్”
(లేదా...)
“శల్యుం డయ్యెను పార్థసారథిగ నా సంగ్రామమం దొప్పుగన్”

38 కామెంట్‌లు:

  1. తుల్యతనరుదగుసృష్టిని
    కల్యాణంబునగనబడుఘనుడౌహరియే
    మాల్యంబులెశరములునై
    శల్యుండర్జునకురథసారధియయ్యెన్

    రిప్లయితొలగించండి

  2. బాల్యము నందే ధర్మపు
    మూల్యంబు నెరగినవాడు మురహరి వాడే
    శల్యము పట్టననుచు కౌ
    శల్యుం డర్జునునకు రథసారథి యయ్యెన్


    తుల్యుండంచు పృథాసుతుండకనిలో దుర్యోధనాదేశమున్

    శల్యమ్ముల్ వడి వేయు సూర్యజునకున్ సవ్యేష్ఠుగా వీరుడౌ

    శల్యుండయ్యెను, పార్థసారథిగ నా సంగ్రామమందొప్పగన్

    కళ్యమ్ముల్ విడ జఘ్ని పట్టనని వక్కాణించెనా కృష్ణుడే.

    రిప్లయితొలగించండి
  3. శల్యుడు రథ సారధి గా
    మూల్యంబయ్యె నుగ సూత పుత్ర నాశము కా
    శల్యుo డైన న దెట్టుల
    శల్యుo డర్జునున కు రథ సారధి యయ్యెన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      రెండవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. రెండవ పాదంలో సూత పుత్రారి గ నా అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  4. శల్యము పట్టనని దైవ
    తుల్యుడు పోరితము నుండి దొలగిన వేళన్
    బాల్యమున నరి నణచు కౌ
    శల్యుం డర్జునునకు రథసారథి యయ్యెన్

    కౌశల్యుడు = కౌశలము కలవాడు

    రిప్లయితొలగించండి
  5. కృష్ణుడు నిద్రనటించి పార్థునకు ముందుగా కోరుకొనే అవకాశం కల్పించిన సన్నివేశాన్ని దృష్టిలోనుంచుకొని...నా ఈ పూరణ


    పల్యంకంబున జూపి న
    మూల్యంబగు తనమహిమను మురళీధర కై
    వల్యుడు కృష్ణుండతి కౌ
    శల్యుం డర్జునునకు రథసారథి యయ్యెన్

    రిప్లయితొలగించండి
  6. తుల్యుండౌదువు శౌరితోడ యుధిలో తోలంగనే గుఱ్ఱముల్
    శల్యా!కర్ణునకంచు కౌరవులనన్,సవ్యేష్ఠుగా బాపురే!
    శల్యుండయ్యెను,పార్థసారధిగ నాసంగ్రామమందొప్పుగన్
    శల్యాదుల్ ధరియించనన్న హరి సాక్షాత్కారమయ్యెంగదా!

    తుల్యుఁడగు మాతులునితో
    శల్యుండర్జునునకు ,రథసారధియయ్యెన్
    “తుల్యుండవు హరితో నో
    శల్యా!”యన కౌరవులును సఖు కర్ణునకున్.

    రిప్లయితొలగించండి
  7. కందం
    లౌల్యమ్మునఁ ద్వరపడఁ గౌ
    శల్య విహీనుఁడమరఁ బ్రవచన కర్తగ వై
    కల్యము సెందిన కథలో
    శల్యుం డర్జునునకు రథసారథి యయ్యెన్!

    శార్దూలవిక్రీడితము
    లౌల్యంబందునఁ దొందరింప నమరన్ ప్రారబ్ధ మేమందు? కౌ
    శల్యంబించుక లేని పండితుఁడు వేషంబందునన్ సూరి! వై
    కల్యంబొందగ జేసె భారతమహో! గాండ్రించు వాగ్ధాటిలో
    శల్యుం డయ్యెను పార్థసారథిగ నా సంగ్రామమం దొప్పుగన్!

    రిప్లయితొలగించండి
  8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చల్యించిన' అనడం సాధువు కాదు.

      తొలగించండి
    2. కందం
      లౌల్యుడు శల్యుడు విజయుని
      తుల్యుడవే గావనుచును దూషించగ సౌ
      శీల్య హితవు కర్ణుడనెన్
      శల్యుండర్జునునకు రథసారథి యయ్యెన్
      ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
      ఉండవల్లి సెంటర్.
      ధన్యవాదాలు గురువుగారు.

      తొలగించండి
  9. శల్యంబును పట్టుకొనెడు
    లౌల్యంబించుకయు లేక రణమందున సా
    కల్యంబుగ నారణ కౌ
    శల్యుం డర్జునునకు రథసారథి యయ్యెన్

    రిప్లయితొలగించండి
  10. లౌల్యంబించుక లేక నాయుధము సంగ్రామమ్ము నన్బట్ట సా
    కల్యంబారణమందు పాండవుల పక్షంబందునన్ నిల్చి వై
    కల్యంబుల్ దరిజేరనీక హరి తాకర్తవ్యముం దెల్పి కౌ
    శల్యుండయ్యెను పార్థసారథిగ నాసంగ్రామమం దొప్పుగన్

    రిప్లయితొలగించండి
  11. కళ్యాణ రూపుడా హరి
    తుల్యుండుగ బార్ధు దలచి తోషిత మదినిన్
    శల్యమును బట్ట ననికౌ
    శల్యుండర్జునునకు రధ సారధి యయ్యెన్

    రిప్లయితొలగించండి
  12. బాల్యము నుండి రిపుఘ్నఁడు
    కాల్యాలోచన పరుండు కంసారియు నా
    కల్యాణప్రదుఁడు విగత
    శల్యుం డర్జునునకు రథసారథి యయ్యెన్

    [విగత శల్యుఁడు = వీడిన బాణము గలవాఁడు]


    కల్యాణమ్ము నొసంగఁ బార్థునకు సంకల్పించి స్వీయాత్మ వై
    కల్యుం జేయఁగ నెంచి గర్ణుని నటం గౌంతేయుఁడే కోరఁగాఁ
    దుల్యుండై తగఁ బార్థసారథికిఁ దా దుష్టాంగ భూనేతకున్
    శల్యుం డయ్యెను బార్థ సారథిగ నా సంగ్రామమం దొప్పుగన్
    [పార్థసారథి = 1. కృష్ణుఁడు 2.రాజునకు సారథి]

    రిప్లయితొలగించండి
  13. తుల్యుండౌటను గుంతిపుత్రునకు వే తోలంగ గుఱ్ఱంబులన్
    శల్యుండయ్యెను,పార్ధసారధిగ నాసంగ్రామ మందొప్పగన్
    శల్యంబున్ మఱి పట్టనంచు ననిదాచక్కంగ నయ్యెన్ ననిన్
    శల్యంబున్ గురిచూచి వేయుటయనన్ శల్యుండు ముఖ్యుండునౌ

    రిప్లయితొలగించండి
  14. కం//
    శల్యక మొక్కటి పరుగిడ
    తుల్యముగా నడుపుచుండె దూత్యము జేయన్ !
    శల్యపరీక్షను సలిపి, వి
    శల్యుం డర్జునునకు రథసారథి యయ్యెన్ !!

    రిప్లయితొలగించండి
  15. కుల్యుండున్ మహోన్నతుండు ఘనుడున్
    ఘోరంబైన యుద్ధ కౌ
    శల్యంబున్ గల కర్ణు యోధునకునున్ సా
    రథ్యముంజేయగా
    శల్యుండయ్యెను, బార్థసారథిగ నా సంగ్రామ
    మంబొప్పగన్
    లౌల్యంబెర్గని వాడు కేశవుడు తా లౌక్యంబు
    తో నయ్యెడిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  16. కుల్యుండా పరమాత్ముఁడ
    తుల్య కృపాకరుఁడధర్మదూరుండు జగ
    త్కల్యాణోపార్జన కౌ
    శల్యుం డర్జునునకు రథసారథి యయ్యెన్

    రిప్లయితొలగించండి
  17. తెల్యన్జేసెదవినుమా
    తుల్యబలుండయిరథమునుతోలెరవిజుకున్
    శల్యమువేయుమనుచుహరి
    శల్యుం డర్జునునకు రథసారథి యయ్యెన్

    రిప్లయితొలగించండి