1, జూన్ 2022, బుధవారం

సమస్య - 4097

2-6-2022 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఖరగానము సభను వినఁగఁ గల్గె ముదంబే”
(లేదా...)
“ఖరగానమ్ము సభాంగణమ్మున వినన్ గల్గించె నానందమున్”

22 కామెంట్‌లు:

  1. కందం
    సురగంగాఝరి పగిదిన్
    దొరలఁగఁ గడు భక్తి తోడఁ దుదివరకనగన్
    స్వరమిడఁగ 'బాలు' నటశే
    ఖరగానము సభను వినఁగఁ గల్గె ముదంబే!

    మత్తేభవిక్రీడితము
    సురగంగాఝరిఁ బోలు రాగమనఁగన్ సొంపైన భావమ్మునన్
    దొరలన్ భక్తి మమేకమౌచు జనసందోహమ్ము జేజేలనన్
    స్వరమందింపగ బాలుగాపిలచు సుబ్రహ్మణ్యమా చంద్ర శే
    ఖరగానమ్ము సభాంగణమ్మున వినన్ గల్గించె నానందమున్!

    రిప్లయితొలగించండి
  2. చరమాంకమ్మునసారవత్కవితశోషన్బొందెతానోడగా
    పరమంబాయెనుచిత్రగీతములునాపంగన్తరంబెట్లగున్
    కురిసెన్జల్లులుకూతలన్మనములోకూర్పంగరోమాంచమున్
    ఖరగానమ్ముసభాంగణమ్మునవినన్గల్గించెనానందమున్

    రిప్లయితొలగించండి
  3. అరుపులమెఱుపునసెంబ్లీ
    కురియగవడగండ్లవానగోలగనుండన్
    సరిగమనాదంబనగాా
    ఖరగానముసభనువినగగల్గెముదంబే

    రిప్లయితొలగించండి

  4. ఉరగాభరణుని కొలిచిన
    హరించును పాపములని హరిదాసట సు
    స్వరమున జేసిన శశిశే
    ఖర గానము సభను వినగఁ గల్గె ముదంబే.

    రిప్లయితొలగించండి
  5. విరిసిన పూమా లల తతి
    బరగెడు గంఠంబుగల్గు బాలుని వోలెన్
    నురమును హత్తెడు కవి శే
    ఖరగానము సభను వినగగల్గె ముదంబే

    రిప్లయితొలగించండి
  6. అరుదగు నాటక మందున
    బరువగు పాత్రను ధరించి పలువురు మెచ్చ న్
    మురిపము లొల్కగ నట శే
    ఖర గానము సభను వినగ గల్గె ముదంబే "

    రిప్లయితొలగించండి
  7. "హర!హర!శంభో!శివ!శం
    కర!నటరాజ! శశి మౌళి!గౌరీ ప్రియ!ప్రో
    వర!"యని,డమరు,ముఖరిత ము
    ఖరగానము సభను వినఁగల్గె ముదంబే.

    రిప్లయితొలగించండి
  8. చిఱుతలు చదివెడు బడిలో
    తరగతు లు ముగిం పునొందు తరుణము నందున్
    తరగతి నందలి గుణశే
    ఖరగానము సభను వినఁగఁ గల్గె ముదంబే

    రిప్లయితొలగించండి

  9. కరిచర్మాంబరధారి శూలి భగుడా ఖట్వాంగి కేదారుడౌ
    హరుడే సర్వమటంచు నమ్మి సతమా యవ్యక్తునిన్ గొల్చినన్
    పరినిర్వృత్తి లభింపజేయుననుచున్ పద్మాక్షిచే చంద్రశే
    ఖరగానమ్ము సభాంగణమ్మున వినన్ గల్గించె నానందమున్.

    రిప్లయితొలగించండి
  10. విరజాజుల్ విర బోసినట్లు గను దాప్రీతిన్ జనాకర్ష శే
    ఖరగానమ్ము సభాంగణమ్మున వినన్ గల్గించె నానందమున్
    స్వరయుక్తంబుగ బాడుబాలునికి నాసాంతంబు దీటౌనుగా
    నురకల్ వేసిరి ప్రేక్షకుల్ దనరి వేయుప్పొంగ సంతోషముల్

    రిప్లయితొలగించండి
  11. సురలును గంధర్వులు కి
    న్నరులాదిగ దేవగణము నడుమన స్థితుడై
    నరవరుఁడగు సత్కవి శే
    ఖరగానము సభను వినఁగఁ గల్గె ముదంబే

    రిప్లయితొలగించండి
  12. సురరాగము వినిపించుచు
    పరమానందంబొసగుచు పాటే తానై
    ధరపై వెలిగిన స్వరశే
    ఖరగానము సభను వినఁగఁ గల్గె ముదంబే

    రిప్లయితొలగించండి
  13. అరెరే!యుష్ట్రవివాహముంగని మహా హ్లాదంబుతో గాడిదల్
    వరరూపంబులటంచు మెచ్చుకొనుచున్ పాడంగ వాద్యాలతో
    *ఖరగానమ్ము సభాంగణమ్మున వినన్ గల్గించె నానందమున్
    వెఱగుంజెందుచు మెచ్చె గానమునహో!వేమాఱ్లునుష్ట్రంబులున్.

    రిప్లయితొలగించండి
  14. సురలోకంబుననొక్కనాడు సభలోసుస్వాంతులై యెల్లరున్
    సురభోగంబులఁ దేలియాడుచును హాసోద్భాస సంతుష్టులై
    కరముల్లాసమునందునుండుతరి సాక్షాత్తింద్రుడే చేయు శే
    ఖరగానమ్ము సభాంగణమ్మున వినన్గల్గించె నానందమున్

    రిప్లయితొలగించండి
  15. కందం
    సురటి, ధనాసరి, బేగడ
    వరాళి, కల్యాణి ,మాళవశ్రీ రాగా
    ల రవళి, పాటల గుణశే
    ఖరగానము సభను వినగ గల్గె ముదంబే.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  16. తరమా! వలదన తరమా!
    మరులొలుకగ మదిని సరిగమల సుస్వర సుం
    దర భరితము యినకుల శే
    ఖరగానము సభను వినఁగఁ గల్గె ముదంబే

    రిప్లయితొలగించండి
  17. పరమోత్సాహముతో న
    య్యరవిందాక్షులు స భక్తి నచ్చటఁ బాడన్
    వర తాళ యుక్త వాద్య ము
    ఖర గానము సభను వినఁగఁ గల్గె ముదంబే

    పర మాశ్చర్య గళ స్వరమ్ము లడరం బాడంగ నా గాయకుల్
    వర వీణా మరళీ మృదంగ సుమహా వాద్యాది నాదమ్ములన్
    హర నామావలి సత్కథా కలిత విఖ్యాతంపు ఖండేందు శే
    ఖర గానమ్ము సభాంగణమ్మున వినన్ గల్గించె నానందమున్

    రిప్లయితొలగించండి


  18. వర వీణా మృదు పాణీ
    ధరనేలెడి దానవనుచు స్తవమును జేయన్
    హరువిడ నాద సుధా శే
    ఖర గానము సభను వినగ గల్గె ముదంబే!

    రిప్లయితొలగించండి
  19. వర గంధర్వ గళంబనంగదగునా వాగ్గేయకారుండహా
    స్వరరాగంబుల మేళవంబలర ప్రస్తారంబొనర్పన్ తధా
    ఖరగానమ్ము సభాంగణమ్మున వినన్ గల్గించె నానందమున్
    పరమోత్కృష్టమటంచు బాలమురళిన్ వందింపగానెల్లరున్

    రిప్లయితొలగించండి