4, జూన్ 2022, శనివారం

సమస్య - 4100

5-6-2022 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్”
(లేదా...)
“శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్”

38 కామెంట్‌లు:

  1. పరమాత్మునిలీలలలో
    పరమార్థమ్మును గ్రహింప వశమా మనకున్
    విరివిగవరములనొసగెడు
    వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  2. సిరిగల వాఁడే యైనన్
    ధర మూడడుగుల నడిగెను దానవ పతినే
    హరి,విధిలిఖితము తప్పునె
    *వరకోటీశ్వరుఁడు యాయవారముఁజేసెన్.*

    రిప్లయితొలగించండి
  3. అరయగనధ్యాత్మంబగు
    సిరితోడనుశోభిలుచునుసిద్ధుడుతానై
    పురిలోకాశీయందున
    వరకోటీశ్వరుఁడుయాయవారముఁజేసెన్

    రిప్లయితొలగించండి
  4. సిరి యెంత యుండి కూడను
    వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్
    విరతిని బొందక ; తదుపరి
    తరతరముల వారికొరకు దాచగ
    నెంచన్

    రిప్లయితొలగించండి
  5. సీమాంతఃపురవాసమున్గనకశోషిల్లుగాదేహమున్
    ధీమంతుండునునాయెబుద్ధుడునుతాఁదీర్చెన్జనాక్రందనల్
    వామాక్షిన్గనకామెవీడెగదభవ్యంబౌపథంబందుగా
    శ్రీమంతుండగువాఁడుసిగ్గువీడిజేసెన్యాయవారమ్మునన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. క్షమించండిచూసుకోలేదు
      సీమాంతఃపురవాసమున్న్గనకతాశోషిల్లగాదేహమున్

      తొలగించండి
  6. కందం
    సిరిగల భావప్రౌఢుడు
    వరుసన దుర్వ్యసనములకు వశుడై కరిగిం
    చె, రయమున సంపదలను, చి
    వర ,కోటీశ్వరుడు యాయ వారము జేసెన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు

    రిప్లయితొలగించండి
  7. ధరణీ శురంతి దేవుడు
    నిరవుగ దాదానమిచ్చి యిత్వరు డగుటన్
    నరసితె కాలపుగతి భూ
    వర! కోటీశ్వరుడు యాయవారము జేసెన్

    రిప్లయితొలగించండి
  8. అరయఁగ నాటక మందున
    ధరి యించెను పాత్ర నొకటి దని కుండ య్యున్
    హరిదాసు వేష మందున
    వర కోటీ శ్వ రుడు యాయ వారము జేసెన్

    రిప్లయితొలగించండి

  9. ధర భారతి వెలసిన వా
    సరలో నాచారమదియె స్థానక మందున్
    తిరుపము నెత్తుట గాంచిన
    వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్



    భామున్ బుత్రుడు కర్ణుడా కలనులో ప్రావీణ్యమున్ జూపినన్

    క్షేమంబయ్యది కాదు క్రీడి కనుచున్ చింతించుచున్ వేగ సూ

    త్రాముండంతట విప్ర వేషమునతా దానంబునే కోరగన్

    శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్.

    రిప్లయితొలగించండి
  10. కందం
    సిరులందించిన ప్రజకై
    వరదల దివిసీమఁ గాంచి పట్టుచు జోలెన్
    పురముల తారకరాముడు
    వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్!

    శార్దూలవిక్రీడితము
    గ్రామాలున్ దివిసీమ వానలకు సంద్రమ్మట్లుగా నిండగన్
    సీమన్జుట్టుచు జోలెపట్టి ప్రజలన్ సేవించు సంకల్పమై
    హోమమ్మట్లుగ నందమూరి నటుడై యూర్లన్నిటిన్ దిర్గుచున్
    శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్!

    రిప్లయితొలగించండి
  11. ధీమంతుల్ మఱి ధైర్యవంతులు సురల్,దేవేంద్ర బ్రహ్మాదులున్
    స్వామీ!యంచును మ్రొక్క శ్రీహరి బలిన్ జంపంగ మూడడ్గులన్
    భూమింగోరగ వామనుండునయి,సమ్మోదంబుతో నిచ్చెగా
    *శ్రీమంతుండగువాఁడు సిగ్గువిడి చేసెన్ యాయవారమ్మునున్.*

    రిప్లయితొలగించండి
  12. అమ్మా శాంభవి! నీదు శక్తిని గనన్ నయ్యారెశక్యంబునే
    నీమా హాత్మ్యము మాకు లభ్యమె యికన్ నీవేగ మారక్ష సూ
    శ్రీమాతా హిమ పుత్రికా!సతి!వెసన్ శ్రేయంబు లీడేరునా
    శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్

    రిప్లయితొలగించండి
  13. సరగున నెవరేమడిగిన
    నరమరికలు లేకనిచ్చి యప్పుగ ధనమున్
    కరుగగ నాస్తులు చివరకు
    వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  14. శ్రీమంతుండను నాకు సాటియగు వారే లేరటంచున్ సదా
    నీమంబుల్ విడనాడి విచ్చలవిడిన్ నేస్తాలతో క్లబ్బులన్
    ధీమంతంబుగ ఖర్చుజేసి ధనమున్ తీర్థంబు వోలెన్ తుదన్
    శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్

    రిప్లయితొలగించండి
  15. గ్రామమ్మందున వాన లేని కతనన్ క్షామమ్ము తోరమ్ముగాన్
    సామాన్యుల్ కడు వ్యాకులమ్ముగొనగా స్పందించి వేగమ్ము సం
    క్షేమమ్మున్ బొనరింప నెంచి మదిలో కీనాశులన్ కావగా
    శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్

    రిప్లయితొలగించండి
  16. శ్రీమంతంబగు నాకలోక మిడగా శ్రీ విష్ణు వాదిత్యుడై
    శ్రీమాతా హృదయారవిందుడరిగెన్ చిత్రంబు పెంపెక్కగన్,
    ప్రేమంబొప్ప విరోచనున్ ప్రియసుతున్ భేదింప గర్వోన్నతిన్
    శ్రీమంతుండగువాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్.

    రిప్లయితొలగించండి
  17. పరహితమే విహితంబిల
    పరమోత్కృష్టంబటంచు బంచెను సర్వం
    బరయఁగ ధర్మాత్ముండా
    వరకోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్

    రిప్లయితొలగించండి
  18. పరఁగంగ వింత రోగము
    ధరఁ దన తల్లికి గురుండు తనతో ననఁగాఁ
    గర ముంచి నమ్మకమ్మును
    వర కోటీశ్వరుఁడు యాయవారముఁ జేసెన్


    ఏమీ వింత విభుండు దృశ్యుఁ డయి యైదేండ్లేఁగ నింటింటికిన్
    సామాన్యుం డన వచ్చి కొల్చుచును వాక్చాతుర్య మేపారఁగన్
    నే మీ కిత్తును సర్వ సౌఖ్య తతులన్ నిండారఁ దన్నెన్నఁగన్
    శ్రీమంతుం డగు వాఁడు సిగ్గు విడి చేసెన్ యాయవారమ్మునున్

    రిప్లయితొలగించండి
  19. ఏమో చెప్పగలేము కాల గమనమ్మేరీతి
    గాసాగునో!
    శ్రీ మాన్యుండొకనాడు గౌరవముతో చెన్నొంది
    సంఘంబునన్
    భూమమ్మంతయుబోయిపేదయయి తా
    భోజ్యంబుకే దూరమై
    శ్రీమంతుండగువాడు సిగ్గు విడి చేసెన్
    యాయవారమ్మునున్


    రిప్లయితొలగించండి
  20. సురపతికొసగగ నాకము
    సిరిపతివచ్చెబలికడకు శీఘ్రముగా తా
    నరెరే గనుమా హరియే
    వరకోటీశ్వరుడు యాయువారము జేసెన్

    రిప్లయితొలగించండి