28, జూన్ 2022, మంగళవారం

సమస్య - 4120

29-6-2022 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“జీవితమున గొప్ప సుఖము చిక్కు మడిసినన్”
(లేదా...)
“జీవితమందు సౌఖ్యము విశేషముగా లభియించుఁ జచ్చినన్”

21 కామెంట్‌లు:

  1. ఆవరదు సేవ జేయగ
    జీవితమున గొప్ప సుఖము చిక్కు, మడిసినన్
    శవమని మోయుచు గాటికి
    యవలీలగ గాల్చి చితిని నరిగెద రటగా

    రిప్లయితొలగించండి
  2. కందం
    జీవులకు 'కోరికల' వే
    కావించును దుఃఖములను కారకమగుచున్
    గావున వాటి 'నడచుడ'య!
    జీవితమున గొప్ప సుఖము చిక్కు, 'మడిసినన్'

    ఉత్పలమాల
    జీవుల దఃఖకారకము సెల్గెడు 'కోరిక' లంచు బుద్ధుడున్
    బావనమైన బోధనలఁ బంచెను బౌద్ధమతంపు మూలమై
    కావున వాటి 'మీరడచఁ' ,గమ్ముచు శాంతియె మానవాలికిన్
    జీవితమందు సౌఖ్యము విశేషముగా లభియించుఁ, 'జచ్చినన్'

    రిప్లయితొలగించండి
  3. తావనిజొచ్చియుతపసున
    యావలువిడిచియుపరమునినాత్మనుదలపన్
    పోవగకోరికజన్మల
    జీవితమునగొప్పసుఖముచిక్కుమడిసినన్

    రిప్లయితొలగించండి
  4. పావనవిష్ణునామమునుబాయకచిత్తమునందునిల్పుచున్
    తావనిబోవకేనరుడుతామరపాకుననీటిబొట్టుగా
    భావనసాగగామనసుపార్థునివోలెనుయుద్ధమందునన్
    జీవితమందుసౌఖ్యమువిశేషముగాలభియించుఁజచ్చినన్

    రిప్లయితొలగించండి
  5. జీవులు నాత్మ నిజమెరిగి
    సేవ జప ధ్యానమేను చేయగ వలయున్
    పోవే జనన మరణములు
    జీవితమున గొప్ప సుఖము చిక్కు మడిసినన్

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    పూర్వజన్మఫలంబున భువినిఁబుట్టి
    చదువు,నుద్యోగముం,బెండ్లి ,సంతు కలుగ
    సుదతి!*జీవితమున గొప్ప సుఖము చిక్కు;
    మడిసినన్*బూడిదేయగు మనుజుఁడకట!

    ఉత్పలమాల
    శ్రీవిలసిల్ల విద్యలు వశీకృతమై పదవుల్ వరించగా
    భావజుబోటి వంటి సతి భార్యగ రాగ,జనించఁబిల్లలున్
    *జీవితమందు సౌఖ్యము విశేషముగా లభియించు; జచ్చినన్*
    జీవుని వెంట వచ్చునవి చేసిన కర్మలె యంచుఁబల్కరే!

    రిప్లయితొలగించండి
  7. పావన మూర్తి యాశివుని బార్వతి తోడుత బూజ జేయుచో
    జీవిత మందు సౌఖ్యము విశేషముగా లభియించు, జచ్చినన్
    జీవికి జన్మ లే నటుల జేయును నిక్కము , మానసంబునన్
    భూవర ! చింతమాను మిక పూర్తిగ ,వేడుము పార్వతీ పతిన్

    రిప్లయితొలగించండి
  8. జీవనమొక వరమనుకొను
    జీవితమున గొప్ప సుఖము చిక్కు, మడిసినన్
    జీవుండర్థాంతరముగ
    దేవుని యతులితమగు వరధిక్కారమగున్

    రిప్లయితొలగించండి
  9. జీవితమే చిక్కులబడ
    జీవికి మానసిక శాంతి చేకూరదుగా
    జీవికి సుఖమెప్పుడనిన
    జీవితమున గొప్ప సుఖము చిక్కు మడిసినన్

    రిప్లయితొలగించండి
  10. ఓ విజయా! సుధీర! విడుఁ! మూహ కలంగగ వెఱ్ఱి పల్కులన్
    జీవిత మెప్డు శాశ్వతమె? చే గొను గాండివ మింక ప్రజ్ఞతో,
    జీవితమందు సౌఖ్యము విశేషముగా లభియించుఁ; జచ్చినన్
    కావరు లెల్ల యుద్ధమున, కాదన బోకుము దుష్టశిక్షణన్.

    రిప్లయితొలగించండి
  11. కావవి శాశ్వత బాధలు ,
    “జీవితమున గొప్ప సుఖము చిక్కు మడిసినన్”
    ఆవిధముగ దలచకెపుడు
    చేవగ వెతల నెదిరించ చేకురు సుఖముల్

    రిప్లయితొలగించండి
  12. భావనచేయ నీశ్వరుని పావన నామము నెల్ల వేళలన్
    జీవితమందు సౌఖ్యము విశేషముగా లభియించుఁ, జచ్చినన్
    జీవికి ముక్తి లభ్యమగు చిన్మయ ధామము జేర వీలగున్
    కావున నంబరాంబరుని కామితదాయిని భక్తిఁ గొల్వరే.

    రిప్లయితొలగించండి
  13. దేవుని దయ సరి తూగగ
    జీవితమున గొప్ప సుఖము జిక్కు : మడిసినన్
    జీవుల కర్మ ఫలం బుగ
    పోవును స్వర్గనరక ము కు పొల్పగు రీతిన్

    రిప్లయితొలగించండి
  14. పావనతాసుగంధములు భావననుండి తొలంగిపోవు నే
    జీవిని లోభమోహములు చేరి వసించి కలంచుచుండునో,
    దైవకృపావిశేషమున దామవి హెచ్చక యుండబూనినన్
    జీవితమందు సౌఖ్యము విశేషముగా లభియించుఁ జచ్చినన్”

    రిప్లయితొలగించండి
  15. పావనుడైన శ్రీహరిని ప్రార్థన జేయుచు చిత్తశుద్ధితో
    కావర మొందకుండనిల కాంచి ధనమ్ము మెలంగు చుండినన్
    జీవితమందు సౌఖ్యము విశేషముగా లభియించుఁ, జచ్చినన్
    దేవనికాయమున్ గలుగు తీరగు సౌఖ్యము నిశ్చయమ్ముగా

    రిప్లయితొలగించండి
  16. కావుమనుచుకొలువ హరిని
    జీవితమున గొప్ప సుఖము చిక్కు;మడిసినన్;
    సేవించుచు హరిపదములు
    జీవులకెల్లను దొరుకును శ్రీపతిపొందున్


    రిప్లయితొలగించండి
  17. కందం
    దేవుని సేవలు జేసిన
    జీవితమున గొప్ప సుఖము చిక్కు, మడిసినన్
    జీవి మరల జనియించును
    కావించెడి కర్మఫలిత కారణ రీతిన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  18. కావే చిక్కులు నరులకు
    జీవితమును వే కృశింపఁ జేయున వకటా
    యే వలను గనినఁ గలుగును
    జీవితమున గొప్ప సుఖము చిక్కు మడిసినన్


    ఏ వగ పుండ నేర దిఁక నెన్నఁడు గాంచవె యీతి బాధలన్
    భావిని నాఁక లుండ దిఁకఁ బన్నుగ దప్పిక మాయ మౌనులే
    నీ వగ వాఁడు వొందు నిల నెమ్మిని నిమ్ముగ వాని కెంచఁగా
    జీవిత మందు సౌఖ్యము విశేషముగా లభియించుఁ జచ్చినన్

    రిప్లయితొలగించండి