4-2-2023 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా”(లేదా...)“పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే”(ఆముదాల మురళి గారి విజయవాడ అష్టావధానంలో నేనిచ్చిన సమస్య)
కందంసద్యశమందిన కవులునువిద్యావిషయాల మెరయు విజ్ఞుల కొలువైహృద్యమనిపించనివనన్బద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా! ఉత్పలమాలవిద్య విభూషణంబనెడు విజ్ఞులకెల్లను నాలవాలమైసద్యశమంది భాసిలెడు సత్కవి వర్యులు నేర్చి కూర్చెడున్హృద్య సుభావరంజితమె యిష్టము గాగ కవిత్వహీనమౌపద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే!
వేద్యులు విజ్ఞులు దండిగవిద్యార్జన చేసినట్టి విబుధులు గదరా గద్యములను చూపుచు నవిపద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా. విద్యలవెన్నియో చదివి విజ్ఞులుగా వెలుగొందు వారలౌ వేద్యులు జ్ఞానపూర్ణులట పెక్కురులుండిన ప్రాంత మేకదా గద్యము జూపి దానిని సుగాత్రము తోడపఠించి వాటినేపద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే.
హృద్యముగాపద్యములనుసద్యస్ఫూర్తిగ బలికెడు సత్కవివర్యుల్సద్యశ మందుదు రన్యులపద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా
*సద్యస్స్ఫూర్తి
ఉ.సేద్యపు కట్టఁ దెల్లదొర చేయగఁ గర్షకులైరి శ్రీకరుల్విద్యకు విశ్వనాథ కవి పేరునుఁ దెచ్చినవాడు లేడిటన్గద్యములే నవోదయము, గర్వులు నాస్తిక ముఖ్యులుండగా *పద్యములన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే*!
సద్య స్ఫూర్తి గ నుండకవిద్యా వంతుల కు మరియు విజ్ఞుల కెల్లన్హృద్యము గా నుండ ని వి యగుపద్యములన విజయ వాడ ప్రజ లొప్పరు గా!
ఆద్యంతము దినమందునమద్యము సేవించి దాని మత్తున మునుగన్చోద్యము నొందకు నీవికపద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా
పద్యము హృద్యమై దనర పండిత పామర రంజకమ్ముగాసద్యశమున్గడించుఁగవి సత్కవివర్యునిగా జనావళిన్ చోద్యముగాదె పద్యమును శుష్కపదంబులఁ బేర్చి చెప్ప నాపద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
పద్యము హృద్యంగమమైయాద్యంతము రసమయమ్ము నానందముతోనుద్యోగింపని నీరసపద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగాపద్యము హృద్యమే ననుచు పండితులెల్లరు మెచ్చు రీతినిన్పద్యము మద్యమే ననుచు పామరులెల్లరు నొప్పు రీతినిన్పద్యము చెప్పగాదగును, వాస్తవమే రసహీనమైనవౌపద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
ఖాద్యములు గావలెఁ దినఁగ హృద్యమ్ములు గావలె విన నేరికి నైనన్ హృద్యమ్ములు గానివి నీ పద్యము లన విజయవాడ ప్రజ లొప్పరుగాఆద్యము భాష పద్యమున కైనను నయ్యది గద్య మైననున్ విద్యయె నేర్పు వ్యాకరణ బృందము ఛందము నేరి కైననుం జోద్యము సెప్ప నెల్లరును సుంత గణింపక వాని నంచు నా పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
కందంవిద్యోపాసన పురియిదిహృద్యంగా పద్యగద్య కృతులు వెలయగన్మద్యప్రియుల పలుకు లివిపద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా.ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
హృద్యపదమ్ములన్ బొదిగి హేల రచించిన పద్యమైన నేగద్యము నైన రసజ్ఞులయి కైకొను చుందురు చిత్తశుద్ధితోచోద్యముగా స్వభావమును సుంతయు చూపక పల్కినట్టివౌపద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
పద్యమదెట్టులుండవలె పండిత పామర రంజకంబుగావిద్యలరాణి కద్భుత నివేదనమౌ గతి నొప్పుటన్ గదాసద్యశమీయనట్టి రస సార విహీనములైన వ్యర్థమౌపద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
పద్యములెట్టులుండవలె బాల రసాల కిసాల సామ్యమై సద్య రసోద్భవానుభవ సంభృత సంతసకారకంబులై;సద్యశమీయనట్టి రస సార విహీన పదోచ్చయంబులౌపద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
మద్యముఁగొనువా రగుటనుపద్యపు సారమ్ము నెఱుగవారలు లేమిన్ హృద్యము గానుం డగ, నాపద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా
సద్యఃస్ఫూర్తియుగల్గినపద్యములను మెత్తురెల్ల పండితులిలలోహృద్యముకానట్టితెలుగుపద్యములన విజయవాడ ప్రజలొప్పరుగా
కందం
రిప్లయితొలగించండిసద్యశమందిన కవులును
విద్యావిషయాల మెరయు విజ్ఞుల కొలువై
హృద్యమనిపించనివనన్
బద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా!
ఉత్పలమాల
విద్య విభూషణంబనెడు విజ్ఞులకెల్లను నాలవాలమై
సద్యశమంది భాసిలెడు సత్కవి వర్యులు నేర్చి కూర్చెడున్
హృద్య సుభావరంజితమె యిష్టము గాగ కవిత్వహీనమౌ
పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే!
రిప్లయితొలగించండివేద్యులు విజ్ఞులు దండిగ
విద్యార్జన చేసినట్టి విబుధులు గదరా
గద్యములను చూపుచు నవి
పద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా.
విద్యలవెన్నియో చదివి విజ్ఞులుగా వెలుగొందు వారలౌ
వేద్యులు జ్ఞానపూర్ణులట పెక్కురులుండిన ప్రాంత మేకదా
గద్యము జూపి దానిని సుగాత్రము తోడపఠించి వాటినే
పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే.
హృద్యముగాపద్యములను
రిప్లయితొలగించండిసద్యస్ఫూర్తిగ బలికెడు సత్కవివర్యుల్
సద్యశ మందుదు రన్యుల
పద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా
*సద్యస్స్ఫూర్తి
తొలగించండిఉ.
రిప్లయితొలగించండిసేద్యపు కట్టఁ దెల్లదొర చేయగఁ గర్షకులైరి శ్రీకరుల్
విద్యకు విశ్వనాథ కవి పేరునుఁ దెచ్చినవాడు లేడిటన్
గద్యములే నవోదయము, గర్వులు నాస్తిక ముఖ్యులుండగా
*పద్యములన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే*!
సద్య స్ఫూర్తి గ నుండక
రిప్లయితొలగించండివిద్యా వంతుల కు మరియు విజ్ఞుల కెల్లన్
హృద్యము గా నుండ ని వి యగు
పద్యములన విజయ వాడ ప్రజ లొప్పరు గా!
ఆద్యంతము దినమందున
రిప్లయితొలగించండిమద్యము సేవించి దాని మత్తున మునుగన్
చోద్యము నొందకు నీవిక
పద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా
పద్యము హృద్యమై దనర పండిత పామర రంజకమ్ముగా
రిప్లయితొలగించండిసద్యశమున్గడించుఁగవి సత్కవివర్యునిగా జనావళిన్
చోద్యముగాదె పద్యమును శుష్కపదంబులఁ బేర్చి చెప్ప నా
పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
పద్యము హృద్యంగమమై
రిప్లయితొలగించండియాద్యంతము రసమయమ్ము నానందముతో
నుద్యోగింపని నీరస
పద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా
పద్యము హృద్యమే ననుచు పండితులెల్లరు మెచ్చు రీతినిన్
పద్యము మద్యమే ననుచు పామరులెల్లరు నొప్పు రీతినిన్
పద్యము చెప్పగాదగును, వాస్తవమే రసహీనమైనవౌ
పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
ఖాద్యములు గావలెఁ దినఁగ
రిప్లయితొలగించండిహృద్యమ్ములు గావలె విన నేరికి నైనన్
హృద్యమ్ములు గానివి నీ
పద్యము లన విజయవాడ ప్రజ లొప్పరుగా
ఆద్యము భాష పద్యమున కైనను నయ్యది గద్య మైననున్
విద్యయె నేర్పు వ్యాకరణ బృందము ఛందము నేరి కైననుం
జోద్యము సెప్ప నెల్లరును సుంత గణింపక వాని నంచు నా
పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
కందం
రిప్లయితొలగించండివిద్యోపాసన పురియిది
హృద్యంగా పద్యగద్య కృతులు వెలయగన్
మద్యప్రియుల పలుకు లివి
పద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా.
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
హృద్యపదమ్ములన్ బొదిగి హేల రచించిన పద్యమైన నే
రిప్లయితొలగించండిగద్యము నైన రసజ్ఞులయి కైకొను చుందురు చిత్తశుద్ధితో
చోద్యముగా స్వభావమును సుంతయు చూపక పల్కినట్టివౌ
పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
పద్యమదెట్టులుండవలె పండిత పామర రంజకంబుగా
రిప్లయితొలగించండివిద్యలరాణి కద్భుత నివేదనమౌ గతి నొప్పుటన్ గదా
సద్యశమీయనట్టి రస సార విహీనములైన వ్యర్థమౌ
పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
పద్యములెట్టులుండవలె బాల రసాల కిసాల సామ్యమై
రిప్లయితొలగించండిసద్య రసోద్భవానుభవ సంభృత సంతసకారకంబులై;
సద్యశమీయనట్టి రస సార విహీన పదోచ్చయంబులౌ
పద్యము లన్నచో విజయవాడ ప్రజల్ విన నిచ్చగింపరే
మద్యముఁగొనువా రగుటను
రిప్లయితొలగించండిపద్యపు సారమ్ము నెఱుగవారలు లేమిన్
హృద్యము గానుం డగ, నా
పద్యములన విజయవాడ ప్రజ లొప్పరుగా
సద్యఃస్ఫూర్తియుగల్గిన
రిప్లయితొలగించండిపద్యములను మెత్తురెల్ల పండితులిలలో
హృద్యముకానట్టితెలుగు
పద్యములన విజయవాడ ప్రజలొప్పరుగా