14, ఫిబ్రవరి 2023, మంగళవారం

సమస్య - 4338

15-2-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పువ్వు దినాంతమునఁ బెద్ద భూతం బయ్యెన్”
(లేదా...)
“పువ్వు దినాంతమందుఁ బెను భూతముగాఁ గనుపించె వింతగన్”

20 కామెంట్‌లు:


 1. క్రొవ్విరి జేరె మధువుకై
  మువ్వన్నియవేల్పు క్రుంగ ముకుళింపగ నా
  పువ్వున చిక్కిన తేటికి
  పువ్వు దినాంతమునఁ బెద్ద భూతం బయ్యెన్.

  రిప్లయితొలగించండి
 2. దవ్వుననుంతురువృద్ధుని
  చివ్వకుతలపడితనయులుచేతనుమాటన్
  నివ్వెఱబోవునుమేధయ
  పువ్వుదినాంతమునఁబెద్దభూతంబయ్యెన్

  రిప్లయితొలగించండి
 3. క్రొవ్విరి గాంచి మాక్షికము గ్రోలగ నెంచుచు భూరి కాంక్షతో
  సవ్వడి సేయుచున్ సరసిజమ్మును వ్రాలెను, ఖాద్యనీనుడే
  చవ్వున జారిపొగ వనజమ్మున బంధిగ చిక్కె తేటికిన్
  పువ్వు దినాంతమందుఁ బెను భూతముగాఁ గనుపించె వింతగన్.

  రిప్లయితొలగించండి
 4. నొవ్వగనీయక తననొక
  పువ్వుగ భావించి పెంచి పోషణఁ జేయన్
  నవ్వులపాల్గాఁగ మనికి
  పువ్వు దినాంతమునఁ బెద్ద భూతం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 5. నవ్వుచు పాడుచున్ మధుర నాదము
  సేయుచు పూలదోటలో
  బువ్వులలో మరంధమును మోదము
  దోడను గ్రోలుచున్ సదా
  రివ్వుమటంచుచున్ బగలు ప్రీతివహించుచు
  దిర్గు తేటికిన్
  పువ్వు దినాంతమందు పెను భూతముగా గనిపించె వింతగన్

  రిప్లయితొలగించండి
 6. దివ్వెల పండుగ రేతిరి
  బువ్వను దిని చిచ్చుబుడ్డి ముట్టిం చగనే
  చివ్వున గుంపుగ నెగసిన
  పువ్వు దినాంతమునఁ బెద్ద భూతం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 7. అవ్వన మందున దొరకొను
  జివ్వున నాకట్టుకొనెడు సేమంతికలే
  జవ్వని సిగలో తురిమిన
  పువ్వు దినాంతమునఁ బెద్ద భూతం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 8. ఎవ్వడని యెంచ కుండనె
  పువ్వును జూచిన విధముగ ముద్దుగ బెంచన్
  నివ్వెర నొందితి నిపుడా
  పువ్వు దినాంతమునఁ బెద్ద భూతం బయ్యెన్

  రిప్లయితొలగించండి
 9. రవ్వలు పొదిగిన నగలను
  జవ్వని ధరి యించి వెడలె సంతకు నచట న్
  కెవ్వని పించిరి దొంగలు
  పువ్వు దినాంతమున బెద్ద భూతం బయ్యె న్!

  రిప్లయితొలగించండి
 10. పువ్వులలోననుంచి యొక పువ్వుగనెంచి కుమార రత్నమున్
  దవ్వులఁ జేరనీక పరితాపముఁ, బెంచిన తల్లిదండ్రులన్
  నవ్వులపాలొనర్చి శరణాలయమందునఁ జేర్చె నక్కటా
  పువ్వు దినాంతమందుఁ బెను భూతముగాఁ గనుపించె వింతగన్

  రిప్లయితొలగించండి
 11. కందం
  మువ్వల సవ్వడి జేయుచు
  జవ్వని చేమంతి బిళ్ళ జడన ధరించన్
  రివ్వున దొంగలు జేరగ
  పువ్వు దినాంతమునఁ బెద్ద భూతం బయ్యెన్

  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 12. ఎవ్వని శాపమొ తగ్గక
  రవ్వం తైనను గడింది రసి కాఱంగన్
  నొవ్వునఁ గంటిం గాచిన
  పువ్వు దినాంతమునఁ బెద్ద భూతం బయ్యెన్

  నవ్వుల కన్న దంచును మనమ్మున నెంచకు మయ్య దీనినిన్
  దవ్వుల కాదు దగ్గఱనె తత్తరు రాజము జూడ నేఁగుమా
  త్రవ్వఁగ భీకరాకృతి సెలంగ భువిం బడె నొక్క గండు ఱా
  పువ్వు దినాంత మందుఁ బెను భూతముగాఁ గనిపించె వింతగన్

  [ఱా పువ్వు = ఒకానొక చెట్టు]

  రిప్లయితొలగించండి
 13. రువ్వుచు తావిని విరిసిన
  *“పువ్వు ,దినాంతమునఁ బెద్ద భూతం బయ్యెన్”*
  చివ్వున నందున సర్పము
  సవ్వడిలేకకనిపించజనముల కచటన్

  రిప్లయితొలగించండి
 14. కందం
  అవ్వలఁ బోకిరి ననుఁగని
  చివ్వున నా జడను తురిమె సిరిమల్లియనే
  నొవ్వగ నామదిఁ జొరబడి
  పువ్వు దినాంతమునఁ బెద్ద భూతం బయ్యెన్

  ఉత్పలమాల
  అవ్వలఁ బోకిరీడు నను నార్తిని వెన్గొని పర్వులెత్తినన్
  చివ్వున పెట్టెనే జడను చిక్కగ బట్టి ప్రసూనమొక్కటిన్
  నొవ్వగ మానసమ్మునొగి నోటిని విప్పని చింత రేగుచున్
  బువ్వు దినాంతమందుఁ బెను భూతముగాఁ గనుపించె వింతగన్

  రిప్లయితొలగించండి
 15. ఉ.

  పువ్వును మూర్తిపై నిడగ భూషణమయ్యె శుభోదయంబునన్
  రివ్వున సేవకుండు నొక రీతి విచిత్రపుటద్దమున్ గుడిన్
  సవ్వడి జేయుచున్ జనులు చక్కని బింబము జూడ భ్రాంతియే
  *పువ్వు దినాంతమందుఁ బెను భూతముగాఁ గనుపించె వింతగన్.*

  రిప్లయితొలగించండి