24, ఫిబ్రవరి 2023, శుక్రవారం

సమస్య - 4348

25-2-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రాఙ్నగమధ్యమునఁ గ్రుంకె భానుండయ్యో”
(లేదా...)
“ప్రాఙ్నగ మధ్యభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో”

11 కామెంట్‌లు:

 1. దిఙ్నాగుడునభిమన్యుడు
  ప్రాఙ్నియపువృద్ధిగనకపడెగాననిలో
  స్రఙ్నియతిదప్పెననగా
  ప్రఙ్నగమధ్యమునగ్రుంకెభానుండయ్యో

  రిప్లయితొలగించండి

 2. ప్రాఙ్నగమందు వెలసి ప్ర
  త్యఙ్నగమున వ్రాలు దృశ్యమద్దము లోనన్
  ప్రాఙ్నిపుణుడు గని పల్కెను
  ప్రాఙ్నగమధ్యమునఁ గ్రుంకె భానుండయ్యో.


  ప్రాఙ్నగ మందు తా వెలసి పర్వులు తీయుచు సందె వేళ ప్ర
  త్యఙ్నగమందు వ్రాలిన వియన్మణి బ్రాగ్దిశ నద్దమందునన్
  ప్రాఙ్నిపుణత్వమున్న నొక పండిత వర్యుడు గాంచి వాడనెన్
  బ్రాఙ్నగ మధ్యభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో.

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. ప్రాఙ్నగ మార్గమందుచని పర్వత పంక్తులు దాటినంతటన్
   ప్రాఙ్నగ మొప్పువీక్షణకు పశ్చిమ దిక్కున నెట్టకేలకున్
   దిఙ్నియమమ్ములే నిలిచి దృష్టిపథమ్మున గోచరించులే
   ప్రాఙ్నగ మధ్యభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో

   తొలగించండి
  2. ప్రాఙ్నగమునుదాటివెడలి
   ప్రాఙ్నగమునరయగఁ దోచు పశ్చిమదిక్కే
   దిఙ్నియమమ్ముల మేరకు
   ప్రాఙ్నగమధ్యమునఁ గ్రుంకె భానుండయ్యో

   తొలగించండి
 4. ప్రాఙ్నగమేగి నిలచితిని
  ప్రాఙ్నగమధ్యమునఁ ; గ్రుంకె
  భానుండయ్యో
  ప్రాఙ్నగమునకెదుటి దిశన
  ప్రాఙ్నగ.మనగనె నతండు భయపడె నేమో

  రిప్లయితొలగించండి
 5. ప్రా జ్నగమున సంభవ మై
  ప్రా జ్నగ వ్యతిరేకదిశ భానుడు గ్రు o కున్
  ప్రా జ్నగ మున మబ్బు లతో
  ప్రా జ్నగ మధ్య మున గ్రు o కె భానుం డయ్యో!

  రిప్లయితొలగించండి
 6. కందం
  దిఙ్నగ రవి శంకరులన
  వాఙ్నిధి హిందుత్వమెసఁగ వాసిఁగొని చనెన్
  దృఙ్నైపుణి యౌవనమున
  ప్రాఙ్నగమధ్యమునఁ గ్రుంకె భానుండయ్యో!

  ఉత్పలమాల
  దిఙ్నగమందుఁ దేజమునఁ దీరిన సూర్యుఁడె యాదిశంకరుల్
  వాఙ్నిధి హైందవమ్మెగయ వాజ్ఞ్మయమెంతయొ యేర్చి కూర్చియున్
  దృఙ్నిపుణుండునై తరలె దివ్యపదమ్మున యౌవనమ్మునన్
  ప్రాఙ్నగ మధ్యభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో

  రిప్లయితొలగించండి
 7. దృఙ్నిచయ విస్మయమ్మునఁ
  బ్రాఙ్నగ పర శైల మందు రథికుండు వ రా
  సృఙ్నిభ వర్ణుఁడు వఱలుచుఁ
  బ్రాఙ్నగ మధ్యమునఁ గ్రుంకె భానుం డయ్యో

  వాఙ్నుతులన్ ముదం బెడఁద వర్ధిల బొంగుచు మిక్కుటమ్ము తి
  ర్యఙ్నర భంగిఁ గాక చన రమ్య తరమ్ముగ వేగ వంతుఁడై
  భాఙ్నిచయమ్ము నెల్లను గబంధుఁడు కోపము తోడ మ్రింగఁగాఁ
  బ్రాఙ్నగ మధ్యభాగమున భానుఁడు గ్రుంకె నదేమి చిత్రమో

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మగ్నంబై క్రోధమ్మునఁ
   బ్రాఙ్నగముం దాఁటఁ గాంచి రాహువు రవినిన్
   భగ్నంబొనర్పఁ బట్టఁగ
   బ్రాఙ్నగ మధ్యమునఁ గ్రుంకె భానుం డయ్యో

   తొలగించండి
 8. ప్రాఙ్నగమందేపుట్టుచు
  *“ప్రాఙ్నగమధ్యమునఁ గ్రుంకె భానుండయ్యో”*
  ప్రాజ్ఞత వీడుచు కేతువు
  నజ్ఞుండైపట్టినంత నంధమునిండన్

  రిప్లయితొలగించండి