11-2-2023 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మూగ వినిపించె షట్శాస్త్రములను జదివి”(లేదా...)“చవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్”
శాస్త్ర కోవిదులుండిన సభను జేరిపూజ్యులే మెచ్చు విధము హార్మోనియము పయిమూగ వినిపించె షట్శాస్త్రములను, జదివి రెల్లరును దానితోపాటు నింపుగాను.
కవులున్ గాయకులున్న యట్టి సభకున్ కైమోడ్చి యచ్చోట పాటవమున్ జూపగ నిశ్చయించుకొని కష్టంబైన లెక్కింపకన్ ధవళాంగిన్ స్మరియించి ఘోషవతినాదంబందు శ్రావ్యమ్ముగా చవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్.
కవిని జూడగ నాసక్తి కలిగి నంతనతని మేధో శక్తి ని గాంచనాద రమునవెడలి జను లెల్ల విచ్ఛే య పెక్కు మందిమూగ వినిపించె ష ట్శా స్త్ర ములను జదివి
తేటగీతిబంధుమిత్రుల గురువులఁ బట్టి చంపలేనటంచు వైరాగ్యము క్రీడిఁ బూనవిశ్వరూపాన కృష్ణయ్య వేడ్క గీతమూగ, వినిపించె షట్శాస్త్రములను జదివిమత్తేభవిక్రీడితముజవమున్ గల్గిన పార్థుడున్ రణమునే సాగించలేనంచు బంధువులన్ మిత్రుల విద్యగూర్చు గురులన్ దున్మంగ లేనన్న యాదవవేంద్రుండట విశ్వరూపమున సంధానించె! 'సద్గీతయే'చవులూరన్ వినిపించె 'మూఁగ' యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్
శాస్త్రములగురించి యడిగె సయిగలిడుచుమూగ ; వినిపించె షట్శాస్త్రములను జదివిచెలిమరికి , గూర్మి జూపుచు జెవిటి వాడుసరియగు సహవసతికిది సాక్ష్య మగును
పుట్టు మూఁగగ జన్మించి పుడమి మీదగట్టురాచూలి భక్తుడై గణుతికెక్కెమాత కరుణించి వరమీయ మాట వచ్చిమూగ వినిపించె షట్శాస్త్రములను జదివి
యామునాచార్యులు -- విద్వజ్జన కోలాహలుడుఅల్పుడనుచెంచి యామునాచార్య వరునిశాస్త్ర ములను కోలాహలు చర్చ చేసెకాని యామునముని "సభలోని వారు మూగ" , వినిపించె షట్శాస్త్రములను జదివి
సకల శాస్త్రములెరిగిన సంస్కృతుండురోగమొదవగ తనగొంతు మూగవోయెగొంతు మూగవోకమునుపు కోవిదుడగుమూగ వినిపించె షట్శాస్త్రములను జదివి
భువిలో మూగగ జన్మమొంది నగజన్ పూజించి సద్భక్తితోనవిరామంబుగ వేదశాస్త్రముల తానభ్యాసమున్ జేసె భైరవి యా భక్తుని వీక్షఁజేసి కృపతో రప్పింపగా బల్కులన్ చవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్
కవి వరుం డొకండు ననర్గల విధ మచటఁ జెవుల పండువు నొనరింపఁ జెప్పుఁ డనుచు నింకఁ దనచుట్టు నెల్లరు నెలమి తోడ మూఁగ వినిపించె షట్శాస్త్రములను జదివి [మూఁగు = కవియు] చెవి కింపారఁగఁ జెప్పఁ గోరఁగఁ బరీక్షిత్తుండు మోక్షార్థియైసవిశేషంబు రమా మనోహరు కథల్ సంతోష మేపారఁగన్ భువిలోనం బరమంపు హంస శుక నాముం డాఁత డవ్వానికిం జవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్ [మూఁగ = పక్షి విశేషము, ఇక్కడ చిలుక యని / మూఁగ = మూఁగయే]
వీణ తోడ్పాటు మూలాన జాణఁ గలుగు మూగ వినిపించె షట్శాస్త్రములను జదివి మాట లేకున్న నేమియా మానవునకు బుద్ధి కుశలత నిచ్చెను బోధకుండు
అవురా యేమని జెప్పనొప్పుదును మాయాజాలమే చూడగన్ చవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్యవలీలంగను వేణువా తడట యాయారీతిఁదాకంగనౌగవులుం గాయకు లందఱున్ దనిరి యాగానంబు నాఘ్రాణికిన్
రిప్లయితొలగించండిశాస్త్ర కోవిదులుండిన సభను జేరి
పూజ్యులే మెచ్చు విధము హార్మోనియము పయి
మూగ వినిపించె షట్శాస్త్రములను, జదివి
రెల్లరును దానితోపాటు నింపుగాను.
రిప్లయితొలగించండికవులున్ గాయకులున్న యట్టి సభకున్ కైమోడ్చి యచ్చోట పా
టవమున్ జూపగ నిశ్చయించుకొని కష్టంబైన లెక్కింపకన్
ధవళాంగిన్ స్మరియించి ఘోషవతినాదంబందు శ్రావ్యమ్ముగా
చవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్.
కవిని జూడగ నాసక్తి కలిగి నంత
రిప్లయితొలగించండినతని మేధో శక్తి ని గాంచనాద రమున
వెడలి జను లెల్ల విచ్ఛే య పెక్కు మంది
మూగ వినిపించె ష ట్శా స్త్ర ములను జదివి
తేటగీతి
రిప్లయితొలగించండిబంధుమిత్రుల గురువులఁ బట్టి చంప
లేనటంచు వైరాగ్యము క్రీడిఁ బూన
విశ్వరూపాన కృష్ణయ్య వేడ్క గీత
మూగ, వినిపించె షట్శాస్త్రములను జదివి
మత్తేభవిక్రీడితము
జవమున్ గల్గిన పార్థుడున్ రణమునే సాగించలేనంచు బం
ధువులన్ మిత్రుల విద్యగూర్చు గురులన్ దున్మంగ లేనన్న యా
దవవేంద్రుండట విశ్వరూపమున సంధానించె! 'సద్గీతయే'
చవులూరన్ వినిపించె 'మూఁగ' యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్
శాస్త్రములగురించి యడిగె సయిగలిడుచు
రిప్లయితొలగించండిమూగ ; వినిపించె షట్శాస్త్రములను జదివి
చెలిమరికి , గూర్మి జూపుచు జెవిటి వాడు
సరియగు సహవసతికిది సాక్ష్య మగును
పుట్టు మూఁగగ జన్మించి పుడమి మీద
రిప్లయితొలగించండిగట్టురాచూలి భక్తుడై గణుతికెక్కె
మాత కరుణించి వరమీయ మాట వచ్చి
మూగ వినిపించె షట్శాస్త్రములను జదివి
యామునాచార్యులు -- విద్వజ్జన కోలాహలుడు
రిప్లయితొలగించండిఅల్పుడనుచెంచి యామునాచార్య వరుని
శాస్త్ర ములను కోలాహలు చర్చ చేసె
కాని యామునముని "సభలోని వారు
మూగ" , వినిపించె షట్శాస్త్రములను జదివి
సకల శాస్త్రములెరిగిన సంస్కృతుండు
రిప్లయితొలగించండిరోగమొదవగ తనగొంతు మూగవోయె
గొంతు మూగవోకమునుపు కోవిదుడగు
మూగ వినిపించె షట్శాస్త్రములను జదివి
భువిలో మూగగ జన్మమొంది నగజన్ పూజించి సద్భక్తితో
రిప్లయితొలగించండినవిరామంబుగ వేదశాస్త్రముల తానభ్యాసమున్ జేసె భై
రవి యా భక్తుని వీక్షఁజేసి కృపతో రప్పింపగా బల్కులన్
చవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్
కవి వరుం డొకండు ననర్గల విధ మచటఁ
రిప్లయితొలగించండిజెవుల పండువు నొనరింపఁ జెప్పుఁ డనుచు
నింకఁ దనచుట్టు నెల్లరు నెలమి తోడ
మూఁగ వినిపించె షట్శాస్త్రములను జదివి
[మూఁగు = కవియు]
చెవి కింపారఁగఁ జెప్పఁ గోరఁగఁ బరీక్షిత్తుండు మోక్షార్థియై
సవిశేషంబు రమా మనోహరు కథల్ సంతోష మేపారఁగన్
భువిలోనం బరమంపు హంస శుక నాముం డాఁత డవ్వానికిం
జవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్
[మూఁగ = పక్షి విశేషము, ఇక్కడ చిలుక యని / మూఁగ = మూఁగయే]
వీణ తోడ్పాటు మూలాన జాణఁ గలుగు
రిప్లయితొలగించండిమూగ వినిపించె షట్శాస్త్రములను జదివి
మాట లేకున్న నేమియా మానవునకు
బుద్ధి కుశలత నిచ్చెను బోధకుండు
అవురా యేమని జెప్పనొప్పుదును మాయాజాలమే చూడగన్
రిప్లయితొలగించండిచవులూరన్ వినిపించె మూఁగ యొకఁడున్ షట్శాస్త్రముల్ వింతగన్
యవలీలంగను వేణువా తడట యాయారీతిఁదాకంగనౌ
గవులుం గాయకు లందఱున్ దనిరి యాగానంబు నాఘ్రాణికిన్