27, ఫిబ్రవరి 2023, సోమవారం

సమస్య - 4351

28-2-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బంతి తగిలి గొనియెఁ బ్రాణములను”
(లేదా...)
“బంతి రయమ్మునన్ దగిలి ప్రాణములం గొనుటెంత వింతయో”

14 కామెంట్‌లు:

 1. ఆటవెలది
  ఇంపుఁ గొల్ప గాంచి యింతి సైరంధ్రిని
  కోరి కీచకుండు కూలెఁ గాదె
  పరసతిఁ దలపించు మరుని బాణమను పూ
  బంతి తగిలి గొనియెఁ బ్రాణములను!

  ఉత్పలమాల
  ఇంతలు కన్నులుండు కమలేక్షణమాలినిఁ గాంచి కీచకుం
  డెంతగఁ గోరెనో కుతుకమేర్పడ నంతగఁ గూలె మోహమై
  కంతుని బాణమౌచు పరకాంత సుఖంబును గూర్చబోయి పూ
  బంతి రయమ్మునన్ దగిలి ప్రాణములం గొనుటెంత వింతయో!

  రిప్లయితొలగించండి
 2. క్రొవ్విడి వెంకట రాజారావు:

  వైరివర్గమందు బలవంతుడైనట్టి
  వీరవరుడొకండు విక్రమించి
  రిపువుపై బలముగ త్రిప్పివేసినదైన
  బంతి తగిలి గొనియె ప్రాణములను.

  రిప్లయితొలగించండి
 3. ఆటవెలది
  ఆట యనుచు క్రికెటు యాట యాడిరి పిల్ల
  వాండ్రు, ఒకడు వేసె బంతి వేగ
  వంతముగను, యాడినంత వాని తలకు
  బంతి తగిలి గొనియె ప్రాణ ములను.
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 4. ఉ.

  ఇంతిడు పిండరూపమున నీ కలి లోపల వంట గుండ్రమౌ !
  గుంతను గప్ప జంతువులు గొయ్యిని రాల శిలామయంబగున్
  బంతిగ భీమహస్తమున బ్రాణము లొడ్డిన హత్తి ముద్దగున్
  *బంతి రయమ్మునన్ దగిలి ప్రాణములం గొనుటెంత వింతయో.*

  రిప్లయితొలగించండి
 5. ఆటలెన్నొగలవు హ్లాదనమందింప
  కీడు కలుగజేయు క్రీడ క్రికెటు
  దానినాడిచూడ తత్వమబ్బునుగద
  బంతి తగిలి గొనియెఁ బ్రాణములను

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చింతలు దూరమౌనటుల చిత్తము రంజిల జేయు క్రీడలే
   సుంతయునోర్పులేక తన సొంతము బంతని చిందులాటతో
   పంతము పట్టి తాను బిగబట్టిన బంతిని వేయగా క్రికెట్
   బంతి రయమ్మునన్ దగిలి ప్రాణములం గొనుటెంత వింతయో

   తొలగించండి

 6. చక్కెర విలుకాడు శరము సంధింపగ
  తపము భంగ పడిన తరుణ మందు
  నాగ్రహించె గాదె యంతకాంతకుడు పూ
  బంతి తగిలి, గొనియెఁ బ్రాణములను.


  వేసవి సెలవులని వేడ్కతో పిల్లలే
  యాట లాడ జేరి రచట, నొకడు
  వేగమందు వేయ బెట్టిదపు క్రికెట్టు
  బంతి తగిలి గొనియెఁ బ్రాణములను.


  అంతము కాక తప్పదిక యాయువు తీరిన కాలమందు నీ
  చెంతకె శీర్ణపాదుడట చేరుగ వచ్చిన పాళమందు నం
  దంతుడు యాటలాడుచు ముదమ్మున వేసిన స్తబ్ధియౌ క్రికె
  ట్బంతి రయమ్మునన్ దగిలి ప్రాణములం గొనుటెంత వింతయో

  రిప్లయితొలగించండి
 7. పందె మందు గెల్వ పట్టు దలను గల్గి
  యాడు చుండె జట్లు యద్భుత ముగ
  వేగ వంత ముగను విసరంగ శిరముకు
  బంతి తగిలి గొనియె బ్రాణ ములను

  రిప్లయితొలగించండి
 8. పాదకందుకమున బాలుడు దన్నిన
  బంతి తగిలి గొనియెఁ బ్రాణములను;
  వింతగొలుపు గాని విషయమ దియె జూడ
  ఆటలందు పదిలమవసరమగు

  రిప్లయితొలగించండి
 9. మౌనియర్జునకునుమాసుభద్రకుగన
  మనసుకుదిరెనయ్యమరునివలన
  రాజసమునఁజూడరాకన్యజడనుపూ
  బంతితగిలిగొనియెప్రాణములను

  రిప్లయితొలగించండి
 10. పంతమువీడకన్దపసిభాసురశక్తినిపారమంటగన్
  చెంతనుజేరిశంభుగనిచేతనయందువిరాగమున్గనన్
  వంతలదీర్చునీశ్వరుడువంచెనుకంతునిరూక్షవీక్షమే
  ల్బంతిరయమ్మునన్దగిలిప్రాణములన్గొనుటెంతవింతయో

  రిప్లయితొలగించండి
 11. ఎండ యచటఁ గాయు చుండ మండుచు నుండి
  కందుకంపు టాటగాఁ డొకండు
  కొండొక తఱి మున్ను మెండుగ నాడఁగ
  బంతి తగిలి గొనియెఁ బ్రాణములను

  చింత యొకింత లేక యెద శీఘ్రమ తాఁ జని వెండి కొండ కా
  యింతినిఁ గూర్ప శంకరున కింపుగ నంతక చిత్త సక్త గ
  ర్వాంతకు నుగ్ర రూపుఁ గని యంగజుఁ డత్తఱి మారుఁ డేయఁ బూ
  బంతి రయమ్మునన్ దగిలి ప్రాణములం గొను టెంత వింతయో

  రిప్లయితొలగించండి

 12. పిన్నక నాగేశ్వరరావు.

  బౌలరొకడు క్రికెటు బంతిని విసరగ
  బంతి స్థితి తెలియని బ్యాటరు తన
  నడక మార్చుకొనెడు నంతలో కణతకున్
  బంతి తగిలి గొనియెఁ బ్రాణములను.

  రిప్లయితొలగించండి
 13. కొత్త బంతినచట కూర్మితో చూచుచు
  విసిరినంత వెళ్ళి వేగముగను
  తగలరానిచోట తాకిన యంతనె
  బంతి తగిలి గొనియ ప్రాణములను

  రిప్లయితొలగించండి