11, ఫిబ్రవరి 2023, శనివారం

సమస్య - 4335

12-2-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సింగము కాల్ నక్క గఱచెఁ జిత్రముగ నహో”
(లేదా...)
“సింగము కాలు నక్క గఱచెన్ గడుఁ జిత్రముగాఁ గనుండదే”

12 కామెంట్‌లు:

 1. అంగడిన విక్రయించగ
  కంగారుగ కట్టెలకయి కాననమేగన్
  జంగలమందున మన నర
  సింగము కాల్ నక్క గఱచెఁ జిత్రముగ నహో

  రిప్లయితొలగించండి

 2. జంగలమందు చరించు కు
  రంగమును పొడవడగించి ప్రాల్మాలికచే
  చెంగట శయనింపగ నా
  సింగము, కాల్ నక్క గఱచెఁ జిత్రముగ నహో,


  జంగల మందునన్ జెలగు సర్వ మృగమ్ముల రాజు నంచు తా
  నెంగిలి మాంసమున్ దినెడి హీనుడ కానని పల్కి తాను సా
  రంగము నూచమట్టుగొని లంపట మంది శయించు వేళ నా
  సింగము, కాలు నక్క గఱచెన్ గడుఁ జిత్రముగాఁ గనుండదే.

  ( రెండు పద్యాలలోనూ నక్క సింహము నిదురించు వేళ జింక కాలును కరిచినదనే భావము)

  రిప్లయితొలగించండి
 3. జంగలమున రారాజగు
  సింగము వృద్ధాప్యమందు జీవచ్ఛవమై
  క్రుంగగ నిస్సత్తువతో
  సింగము కాల్ నక్క గఱచెఁ జిత్రముగ నహో

  రిప్లయితొలగించండి
 4. అంగదమధికంబై నీ
  లంగువు చింతించెనకట రాత్రిందివమున్
  చెంగట గల మృతినొందిన
  సింగము కాల్ నక్క గఱచెఁ జిత్రముగ నహో

  రిప్లయితొలగించండి
 5. అంగడి నందు కట్టియల నమ్మగ నెంచితి , వాటి కోసమై
  సంగడినందు నెక్కొనిన సానువు బోవగ నేను జూచితిన్
  జంగలమందు వేటకరి సాయము వేయగ చచ్చినట్టి యా
  సింగము కాలు నక్క గఱచెన్ గడుఁ జిత్రముగాఁ గనుండదే

  రిప్లయితొలగించండి
 6. జంగలమందు జంతుతతి సాగ్రము దుఃఖ సముద్ర మందునన్
  క్రుంగెను పెద్దదిక్కయిన కూరిమి సింగము కన్ను మూయగన్
  బెంగ దొరంగ జంతువులు పెల్లగు శోచనమందు నుండగా
  సింగము కాలు నక్క గఱచెన్ గడుఁ జిత్రముగాఁ గనుండదే

  రిప్లయితొలగించండి
 7. వంగడము లొక్క టైనను
  బొంగిన పంతమ్ముచేతఁ బోరుచు నంతం
  ద్రుంగంగ నక్కటా నూ
  ర్సింగము కాల్ నక్క గఱచెఁ జిత్రముగ నహో

  [ఊర్సింగము = ఊరు సింగము,కుక్క]

  బంగరు మాతృభూమిని నపార పరాక్రమ మొప్ప నిత్యమున్
  భంగ మొనర్ప కెన్నఁడును బన్నుగఁ గాచుచు నుండ నొక్కెడన్
  వంగిన సూడు నక్క పగ పట్టుచు సైన్యము నందు బంటు పె
  న్సింగము కాలు నక్క గఱచెన్ గడుఁ జిత్రముగాఁ గనుం డదే

  [సూడు నక్క = పగవాఁ డను నక్క; బంటు పెన్సింగము = భట మహా సింహుఁడు]

  రిప్లయితొలగించండి
 8. పొంగెడు నుత్సా హముతో
  సంగడి గాండ్రతొ కలసియు సరదా పడుచున్
  జంగల పు వేట లో నర
  సింగము కాల్ నక్క క ఱ చె చిత్రముగనహో!

  రిప్లయితొలగించండి
 9. సింగము చచ్చినదను కొని
  సింగము కాల్ నక్క గఱచెఁ జిత్రముగ నహో
  యంగన! వింటివె చిత్రము
  జంగలమున జరుగు చుండు సహజం బిదియే

  రిప్లయితొలగించండి
 10. భంగముజేయగగురువును
  రంగమునందునతలపడిరాజిలెదుష్టుం
  డంగనద్రౌపదియన్నయ
  సింగముకాల్నక్కగఱచెచిత్రముగనహో

  రిప్లయితొలగించండి
 11. సింగము గాలుఁజేరెనని జెప్పగ సంతస మొంది వెంటనే
  సింగము కాలు నక్క గఱచెన్ గడుఁ జిత్రముగాఁ గనుండదే
  యంగన! కల్గసంతసము నాయత రీతిని గాలు గఱ్చెనే
  జంగల మందు సాజమది జంతువు లందున చిత్ర మందువా?

  రిప్లయితొలగించండి
 12. కందం
  అంగనలఁ గావ నల పో
  రంగ విజయుఁడోడె కద కిరాతుల చేతన్
  భంగపడుటె గాండీవికి
  సింగము కాల్ నక్క గఱచెఁ జిత్రముగ నహో!

  ఉత్పలమాల
  సంగరయోధుడై చెలఁగి సద్విజయంబున సవ్యసాచియే
  యంగనలందరిన్ గొనియు హస్తినకేగ కిరాతులడ్డినన్
  భంగ పడెన్ జనార్ధనుని బాసటలేకయె కానికాలమై
  సింగము కాలు నక్క గఱచెన్ గడుఁ జిత్రముగాఁ గనుండదే!

  రిప్లయితొలగించండి