23, ఫిబ్రవరి 2023, గురువారం

సమస్య - 4347

24-2-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చనుపాలిడి సౌఖ్యమిచ్చె సతి తన పతికిన్”
(లేదా...)
“చనుపాలిచ్చి సుఖింపఁజేసెను గదా చంద్రాస్య ప్రాణేశునిన్”

23 కామెంట్‌లు:

 1. అనయముభర్తయెతనయుడు
  కనుమావేదమువచనముకాంతకునమరన్
  వినుమిదివేదముచెప్పెను
  చనుబాలిడిసౌఖ్యమిచ్చెసతితనపతికిన్

  రిప్లయితొలగించండి
 2. తన పాపడేడ్చు చుండగ
  చనుపాలిడి సౌఖ్యమిచ్చె సతి ; తన పతికిన్
  మనసుపడిన భోజనమిడి
  కనుమోడ్చునటుల నొనర్చె గాదిలి తోడన్

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. మత్తేభవిక్రీడితము
   మనువై మోదము నిండ దంపతులకున్ మాన్యుల్ శతాయుష్య దీ
   వనలన్ నిర్మల చిత్తులై యిడగ దైవాశీస్సులన్ బొంది తా
   ననురాగమ్ముల బంచ శోభనమునందాశీనుడై నార్తి వే
   చను, పాలిచ్చి సుఖింపఁజేసెను గదా చంద్రాస్య ప్రాణేశునిన్

   తొలగించండి
  2. కందం
   మనువాడఁగ పెద్దలు దీ
   వనలందింపంగ మ్రొక్కి భగవంతునికిన్
   తనువుల్ ముడివేయఁగ వే
   చను, పాలిడి సౌఖ్యమిచ్చె సతి తన పతికిన్

   తొలగించండి
 4. మత్తేభవిక్రీడితము:
  ననవిల్తుండు చెలంగి పూశరములన్ నాటెన్ హృదిన్ వాడిగా
  ననబోడీ! నినువీడి యొక్కఘడియైనన్ నిల్వగా జాలనే
  యను నాధుంగని యంతరంగమున నాహ్లాదంబు ప్రేమంబు హె
  చ్చనుబాలిచ్చి సుఖింపఁజేసెను గదా చంద్రాస్య ప్రాణేశునిన్

  రిప్లయితొలగించండి
 5. చినవాడైజనుచిన్నికృష్ణుడునుతాజేరంగతల్లిన్వడిన్
  పనటుల్వట్టినిబోయెనయ్యెడనులేవంచున్దధిక్షీరముల్
  చనుబాలిచ్చితరింపజేసెనుగదాచంద్రాస్య, ప్రాణేశునిన్
  కనగాహాసమునందుచున్మురిసెనేకాంచంగనారూపునే

  రిప్లయితొలగించండి
 6. అత్తను ఇంటినుంచి బయటకు వెళ్ళగొడుతున్న కోడలి గురించి జనులు

  వినుమా యిట్టిదురంతము
  కనలేముర కండ్లతోడ కలిదుశ్చర్యల్
  కనగా పసితన మందున
  చనుపాలిడి సౌఖ్యమిచ్చె సతి, తన పతికిన్

  సతి= అత్తగారి పేరు
  తనపతి కిన్= కోడలి పతికి

  రిప్లయితొలగించండి
 7. కందం:
  ననవిల్తుఁడు పూశరముల
  ననబోడీ హృదినినాట నయగారముగా
  తనువున విరహమతిశయిం
  చను పాలిడి సౌఖ్యమిచ్చె సతి తన పతికిన్

  రిప్లయితొలగించండి
 8. తనకోరిక వ్యక్తపరుచు
  పెనిమిటినాగమనుచు కడు విజ్ఞత తోడన్
  మునుముందుగ తనపాపకు
  చనుపాలిడి సౌఖ్యమిచ్చె సతి తన పతికిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అనునీతుండగు బిడ్డయాకలికి హాహాకారముల్ సల్పగా
   తనచిత్తేశుడుపొందగోరె రయమున్ తాంబూల శుశ్రూషలే
   యనురాగమ్మును పంచియిచ్చుమనసే యాపాపకున్ ముందుగన్
   చనుపాలిచ్చి సుఖింపఁజేసెను గదా చంద్రాస్య ప్రాణేశునిన్

   తొలగించండి

 9. ననవిలు కాని శరమ్ములు
  మనమును నాటిన తరుణము మధుకరు డగుచున్
  కనుగీట మురిపముల పం
  చను, పాలిడి సౌఖ్యమిచ్చె సతి తన పతికిన్.

  రిప్లయితొలగించండి

 10. ననసానాగడ పూశరమ్ములవియే నాగుండెలో గ్రుచ్చగన్
  నిను జేరంగను వచ్చితిన్ దడవికన్ నేతాళ, రారమ్మటం
  చని దీనుండగుచున్ బ్రియుండు పిలువన్ సంధ్యంచు నాకాంక్ష దీ
  ర్చను, పాలిచ్చి సుఖింపఁజేసెను గదా చంద్రాస్య ప్రాణేశునిన్.

  రిప్లయితొలగించండి
 11. చనువున లాలించె సుతను
  చను బాలిడి :: సౌఖ్య మిచ్చె సతి తన పతికిన్
  మునుకొని కోరిన విధముగ
  కను సన్న ల మెలగి తాను కమ్రపు రీతిన్

  రిప్లయితొలగించండి
 12. వినయమ్మొప్పెడి కన్నియన్ ప్రియముగా బెండ్లాడి, దీవించ నౌ
  ననుచున్ పెద్దలు, పత్నితో మదన విన్యాసమ్ములన్ మించుచున్
  దినమున్ రేతిరి స్వర్గసౌఖ్యములలో తేలించ, దాహమ్మడం
  చను, పాలిచ్చి సుఖింపఁజేసెను గదా చంద్రాస్య ప్రాణేశునిన్

  రిప్లయితొలగించండి
 13. వనజాయతాక్షి డెంద
  మ్మున సంత్రాసమ్ము కరము మూరఁగ నార్తిం
  బెనిమిటి కంటి కలఁకకుం
  జనుపాలిడి సౌఖ్య మిచ్చె సతి తన పతికిన్

  పనిలో నుంటిని నిల్వుఁ డంచనక తాపం బేల సంత్రాస మే
  లను మీ కివ్విధి నంచుఁ జేయకయె నిర్లక్ష్యమ్ము భక్షింప రం
  డని యాసీనునిఁ జేసి తత్క్షణమ యల్పాహారమున్ వెచ్చగాఁ
  జను పాలిచ్చి సుఖింపఁ జేసెను గదా చంద్రాస్య ప్రాణేశునిన్

  రిప్లయితొలగించండి

 14. పిన్నక నాగేశ్వరరావు.

  తన బిడ్డడి క్షుద్బాధకు
  ౘను పాలిడి సౌఖ్యమిచ్చె; సతి తన పతికిన్
  తినిపించెను భోజ్యమ్ముల
  ననురక్తిని మేళవించి యానందముతో.

  రిప్లయితొలగించండి
 15. మ.

  వినలేదంచుచు గార్యదర్శి పటుతా విశ్లేష దృక్కుల్ సభన్
  గునపమ్ముల్ గద ఖడ్గ ఘాతములచే గోపించి నేడ్పించగన్
  జనవాక్యంబులు సంపదల్ ఖలము, సౌజన్యమ్మునార్జించు,పిం
  *చను, పాలిచ్చి సుఖింపఁజేసెను గదా చంద్రాస్య ప్రాణేశునిన్.*

  రిప్లయితొలగించండి
 16. తనసుతుయాకలిబాపెను
  చనుపాలిడి; సౌఖ్యమిచ్చె సతి తన పతికిన్”*
  ననురాగముతో వడిగా
  చనితాచిరుయలుకబాపి సంతోషముతో.

  మరొక పూరణ

  తన సుతుని యేడుపాపగ
  చనుపాలిడి సౌఖ్యమిచ్చె: సతి తన పతికిన్
  ననయము తోడుగ నిలుచుచు
  నెనలేనిముదమును కూర్చు నిమ్ముగ నెపుడున్

  రిప్లయితొలగించండి