17, ఫిబ్రవరి 2023, శుక్రవారం

సమస్య - 4241

18-2-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్”
(లేదా...)
“పిల్లికిఁ బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్”

13 కామెంట్‌లు:


  1. అల్లరి చేసెడి పిల్లల
    యల్లరి మాన్పంగనెంచి యాండ్రైడనెడిన్
    సెల్లును తెచ్చితి నందున
    పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్.

    రిప్లయితొలగించండి
  2. కల్లకపటమెరుగని దన
    చెల్లిని బిలచి యొక కథను జెప్పగ గోరన్
    నల్లినకథలో నొక పరి
    పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్

    రిప్లయితొలగించండి
  3. పెల్లుగ కల్లలు బలుకుచు
    చెల్లని మాటలను దెలిపె చిత్రము గాగన్
    మెల్లగ బాలుని తో ననె
    "పిల్లికి జనియించి కోతి పికమును మ్రింగె న్ "

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. చిల్లర పైకము కోరుచు
      నల్లరితో పిట్టలదొర హాస్యోక్తులతో
      నల్లిన వృత్తాంతమిదియె
      పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్

      తొలగించండి
    2. కల్లలు కొల్లలాడు విధి కల్పన జేయును నవ్వులాటకై
      చిల్లర పైకమున్ గొనుచు చెప్పును పిట్టల రాయుడే కతల్
      బల్లెము పట్టగా తనకు పట్టము కట్టిరి భారతీయులే
      పిల్లికిఁ బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్

      తొలగించండి

  5. ఎల్లెడల తిరుగు, గాంచిన
    పిల్లలు భీతిల్లునట్టి భీకరమౌ యా
    నల్లని ప్రాణియె బావురు
    పిల్లికి జనియించి , కోఁతి, పికమును మ్రింగెన్.


    పిల్లలు గాంచి భీతిలెడు భీకర రూపము గల్గినట్టి యా
    నల్లని ప్రాణి యొక్క విపినమ్మున తా దిరుగాడు వేళలో
    నల్లన గానవచ్చెనని యాకలి తాళగ లేనటంచదే
    పిల్లికిఁ బుట్టి , కోఁతి, గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్.

    రిప్లయితొలగించండి
  6. కల్లాకపటంబెఱుగని
    పెల్లుగవెఱ్ఱినుతులనివేదనజేసెన్
    పిల్లడుకాళికిదాసుడు
    పిల్లికిజనియించికోతిపికమునుమ్రింగెన్

    రిప్లయితొలగించండి
  7. మెల్లగ బిల్చియు మిక్కిలి
    యల్లరి మనుమనుని బిల్చియడిగెన్
    బ్రశ్నన్
    అల్లన నుడు మేతీరున
    పిల్లికి జనియించి కోతి పికమును
    మ్రింగెన్


    రిప్లయితొలగించండి
  8. పిల్లల యల్లరిమాన్పగ
    కల్లల కథ జెప్పె తల్లి  కడు చోద్యముగా
    నల్లిన కథలో వనమున
    “పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్”

    రిప్లయితొలగించండి
  9. అల్లరిచేయు బాలకుల నందర నొక్కటఁ జేరబిల్చి యా
    పిల్లలయందునుత్సుకతఁ బెంచుచు నాయమ గల్పితమ్ముగా
    నల్లిన కల్లబొల్లి కథయందలి చిత్రపు సన్నివేశమే
    పిల్లికిఁ బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్

    రిప్లయితొలగించండి
  10. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో...

    కందం
    కల్లలు వల్కను గురువర!
    యిల్లిదె మీరిడు సమస్యలెంచుచుఁ బండన్
    త్రుళ్లింతల స్వప్నంబున
    పిల్లికి జనియించి కోఁతి పికమును మ్రింగెన్!

    ఉత్పలమాల
    కల్లలు వల్కజాలనయ! గౌరవ కందికులాబ్ధి చంద్రమా!
    యిల్లిదె మీ సమస్యలకు నెంచుచు పూరణ పండినంతటన్
    ద్రుళ్లితి దిగ్గునన్ మదికి ద్యోతకమైనను స్వప్నమందునన్
    బిల్లికిఁ బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్!

    రిప్లయితొలగించండి
  11. కల్లయె శాఖాహారులె
    యెల్ల ప్లవంగము లనంగ నిద్ధరలో వ
    ర్ధిల్లి, భయంపడ కింతయుఁ
    బిల్లికి, జనియించి కోఁతి పికమును మ్రింగెన్

    ఉల్లము నందు నెంచి తన కొప్పెడు పండని యుత్సహించుచుం
    దల్లడిలంగఁ బక్షి కని దారుణ కర్మము నొక్క గ్రుడ్డునుం
    జల్లని వేళ నొక్క కపి సత్తము భార్యకు మున్ను, కాక యే
    పిల్లికిఁ, బుట్టి కోఁతి గడు వింతగ మ్రింగిన దొక్క కోకిలన్

    రిప్లయితొలగించండి