20, ఫిబ్రవరి 2023, సోమవారం

సమస్య - 4344

21-2-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుచములు పురుషునకు వచ్చెఁ గోమలికి వలెన్”
(లేదా...)
“కుచములు వచ్చెఁ బూరుషునకున్ గొమరాలునకున్ సమంబుగన్”

15 కామెంట్‌లు:

  1. రిప్లయిలు

    1. కందం
      ఉచితమ్మన వాణిజ్యము
      ప్రచలితముగఁ బూని నిమ్మపచ్చడులమ్మన్
      బచనమునకుఁ జేకొనఁగ లి
      కుచములు పురుషునకు వచ్చెఁ గోమలికి వలెన్

      చంపకమాల
      ఉచితము వర్తకమ్మనుచు నొప్పు పదార్థములన్ని వాడియున్
      బ్రచలితమైన స్ఫూర్తిఁగొని రంజిలనమ్మెడు నిమ్మ పచ్చడుల్
      పచనము సేయ హస్తముల పట్టఁగ వారు 'లి' పూర్వకమ్మునౌ
      కుచములు వచ్చెఁ బూరుషునకున్ గొమరాలునకున్ సమంబుగన్

      తొలగించండి

  2. విచలిత ఫలములు గాంచుచు
    నచటకు విచ్చేసినట్టి యన్నా చెల్లెం
    డ్రు చకితు లయి పంచుకొన ల
    కుచములు పురుషునకు వచ్చెఁ గోమలికి వలెన్.

    రిప్లయితొలగించండి
  3. చం.

    ప్రచలితమంబ శంభు గన ప్రాప్తి శిఖండిగ నాడబొట్టియై
    రచన కుబేర శాపమున రమ్యపు కొమ్మగు స్థూలకర్ణునిన్
    నిచితము మార్పిడిన్ గొనెను నెమ్మిక తోడుత గుహ్యకుండటన్
    *గుచములు వచ్చెఁ బూరుషునకున్ గొమరాలునకున్ సమంబుగన్.*

    రిప్లయితొలగించండి

  4. సచివుని మెప్పువొందగను స్థానిక నాటక బృందమొక్కటిన్
    సుచరిత గాథయొక్కటిని చూపఱు లెల్లరు గోరిరంచు వా
    రుచితము గాను వేయనట నుగ్మలి పాత్రలు వేయు వారికిన్
    కుచములు వచ్చెఁ బూరుషునకున్ గొమరాలునకున్ సమంబుగన్.

    రిప్లయితొలగించండి
  5. మచిలీపట్నమునందున
    విచిత్ర నాటకములోని వేషము గాంచన్
    విచికిత్సను రేపునటుల
    కుచములు పురుషునకు వచ్చెఁ గోమలికి వలెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కచునకుదేవయానియెడ గల్గిన భావము చూపునాటకం
      బు చకితులైరి ప్రేక్షకులు ముచ్చటగొల్పెడు పాత్రధారికిన్
      సుచతుర నైపుణీ భరిత సుందర పేశల కంఠముండినన్
      కుచములు వచ్చెఁ బూరుషునకున్ గొమరాలునకున్ సమంబుగన్

      తొలగించండి
  6. సచివుడు పంపిన రెండు లి
    కుచములు పురుషునకు వచ్చెఁ ; గోమలికి వలెన్
    ప్రచురముగ మిస మిస మెరయ
    రచనలు జేయగ మొదలిడె లాహిరి తోడన్

    రిప్లయితొలగించండి
  7. ప్రచురపు నాటక మందున
    రచ యిత్రి గ వేష మూని రాణింప వెసన్
    ముచి కుందుడు ధరి యింపగ
    కుచములు పురుషున కు వ చ్చె కో మలికి వలెన్

    రిప్లయితొలగించండి
  8. పచనము చేయుచున్ మనుచు బాసనమందున, భీము చిత్తమం
    దు చలనమౌ యమర్షమది తొందర పెట్టగ భ్రాత సూచనన్
    రచనము చేయ కీచకుని ప్రాణము దీయగ నాట్యశాలలో,
    కుచములు వచ్చెఁ బూరుషునకున్ గొమరాలునకున్ సమంబుగన్.

    రిప్లయితొలగించండి
  9. ప్రచురపు టిక్ష్వాకుఁడు రా
    జు చనఁ గుమార వనమునకుఁ జోద్యం బయ్యెన్
    సుచరిత! సుద్యుమ్నున కల
    కుచములు పురుషునకు వచ్చెఁ గోమలికి వలెన్

    అచటను గాంచ మాఁడు మగ యన్నవిభేదము పంచ సైన్యమున్
    విచలిత చిత్త మింతయును వీరుల వీరల యందుఁ గాంచ రా
    దచల నిభంపు ధైర్యమున నద్భుత రీతిని నంక మందుఁ దాఁ
    కు చములు వచ్చెఁ బూరుషునకున్ గొమరాలునకున్ సమంబుగన్

    [చమువు = సేనా విశేషము]

    రిప్లయితొలగించండి
  10. విచలితమాయె మానసము విన్నఁదనమ్మున క్రుంగిపోయె తా
    నెచటికి నేగినన్ జనులు నెక్కుడుగా పరియాచకంపు దు
    ర్వచనములాడ యవ్వనపు ప్రాయమునందున పాపమయ్యరే
    కుచములు వచ్చెఁ బూరుషునకున్ గొమరాలునకున్ సమంబుగన్

    రిప్లయితొలగించండి
  11. విచలితమొందగ నాతం
    డెచటికి నేగినను వానినెకసక్కెముగా
    వచియింత్రు జనులు చాటుగ
    కుచములు పురుషునకు వచ్చెఁ గోమలికి వలెన్

    రిప్లయితొలగించండి
  12. రుచియగునోటికనితినలి
    *“కుచములు పురుషునకు వచ్చెఁ గోమలికి వలెన్”*
    పచనముచేయగజాలని
    విచిత్రమగుపులుపదియునువెగటునుగూర్చెన్

    రిప్లయితొలగించండి