8, ఫిబ్రవరి 2023, బుధవారం

సమస్య - 4332

9-2-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సూర్యోదయమైన పిదప చుక్కలు వొడిచెన్”
(లేదా...)
“సూర్యుం డా యుదయాద్రి నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్”

17 కామెంట్‌లు:

 1. కందం
  ఆర్యా! యోట్లనిడి మరో
  పర్యాయమ్మిడక నుండ ప్రజ వారింపన్
  కార్యమన వ్రేళ్లను సిరా
  సూర్యోదయమైన పిదప చుక్కలు వొడిచెన్

  శార్దూలవిక్రీడితము
  ఆర్యా! వింతయనంగలేదు కద! రాజ్యానన్ బ్రజాస్వామ్యమన్
  గార్యంబందున నేతలన్ బ్రజలునెన్నన్నోటు వైచన్ మరో
  పర్యాయమ్మునువేయకుండగనునేర్పాటై సిరా గుర్తుతో
  సూర్యుం డా యుదయాద్రి నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్

  రిప్లయితొలగించండి


 2. సూర్యుడు ద్రుంచె నిరులనని
  ధైర్యము తో పడతులెల్ల ధరుణముకై ప్రా
  చుర్యముగా జనుట గనగ
  సూర్యోదయమైన పిదప చుక్కలు వొడిచెన్.

  రిప్లయితొలగించండి
 3. కార్యోన్ముఖులైరి జనులు
  సూర్యోదయమైన పిదప, చుక్కలు వొడిచెన్
  సూర్యాస్తమయము పిమ్మట
  కార్యకలాపములు ముగిసె కర్షక తతికిన్

  రిప్లయితొలగించండి


 4. హర్యక్షమ్మువలెన్ సుషీమమది తిష్యమ్మందు బాధింపగా
  పర్యంకమ్ముల వీడలేమనుచు శంపాంగుల్ ప్రతుష్టి వేయగా
  నిర్యూహమ్మున ముగ్గులన్ నిలిచిరే నేత్తమ్మి చుట్టానికై
  సూర్యుం డా యుదయాద్రి నెక్కఁ , బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్.

  రిప్లయితొలగించండి
 5. కార్యోన్ముఖుడగు నతడు
  సూర్యోదయమైన పిదప ; చుక్కలు వొడిచెన్
  మర్యాదగ శయనించగ ,
  నార్యులకిది నిరవధికపు యలవాటెగదా

  రిప్లయితొలగించండి
 6. ఆర్యులు నిర్దేశించిన
  మర్యాదను లక్ష్యపెట్టి మరి మెహెన్దీ
  వర్యులు శుభముగ వధువుకు
  సూర్యోదయమైన పిదప చుక్కలు వొడిచెన్

  రిప్లయితొలగించండి
 7. కార్యేషు దాసు లగుచున్
  భార్యలు దారలు కరణిగ భాసిలుచు సదా
  యార్యో క్తి నిజము గాగా
  సూ ర్యో దయ మైన పిదప చుక్కలు వొడిచెన్

  రిప్లయితొలగించండి
 8. సూర్యుని కాంతులు వొడమెను
  సూర్యోదయమైన పిదప, చుక్కలు వొడిచెన్
  సూర్యాస్తమానమందు న
  వార్యములెపుఁడీ పుడమిని పగలును రాత్రుల్

  రిప్లయితొలగించండి
 9. మర్యాద నేమఱక యని
  వార్యమ్ముగఁ జిత్ర వసన భామా మణులే
  కార్యాలయములు సేరఁగ
  సూర్యోదయ మైన పిదప చుక్కలు వొడిచెన్

  పర్యావర్తము సేయుఁ బూర్వ గిరికిం బాశ్చాత్యపుం గొండకున్
  సూర్యుం డెప్పుడు మానకుండగను నస్తోకంపు ధైర్యమ్ముతో
  నార్యావర్తము దాఁటి సంభ్రమముతో నస్తాద్రినిన్, వీడి వే
  సూర్యుం డా యుదయాద్రి, నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్

  రిప్లయితొలగించండి
 10. ఆర్యాతెల్పెద విస్తరంబుగ వినుండాపార్శ్వమం దీభువిన్
  పర్యావర్తనమందుచున్ వితతమౌ ప్రద్యోతముల్ జిమ్ముచున్
  సూర్యుండా యుదయాద్రి నెక్కఁ ,బొడిచెన్జుక్కల్ మనోజ్ఞంబుగన్
  ఆర్యావర్తమునందు భాస్కరుడు తానస్తాద్రిలో గ్రుంకగన్

  రిప్లయితొలగించండి
 11. శౌర్యమ్మున్ ఘన వాయుసేన సలుపన్ సౌందర్య విన్యాసముల్
  చేరన్ జూడ ప్రజాళి సంతసమ్మున గడున్ జెన్నైన రూపున్ సినీ
  తారల్ రాగ కనుంగొనంగనల ప్రాతఃకాలమున్ వింతగా
  సూర్యుండా యుదయాద్రి నెక్కఁ బొడిచెన్ జుక్కల్ మనోజ్ఞంబుగన్

  రిప్లయితొలగించండి