13-2-2023 (సోమవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“బంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్”(లేదా...)“బంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్”
సింగారింతుననుచు పలురంగులతోడ పలు చిత్రరాజమ్ములనేరంగా జీవుడు వేయగ బంగరు మేడ, నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్(వేయగ బంగరు మేడన్ ఒక కాంత)
అంగనమండోదరితాసింగారించినమహలునసేమమెకాగాక్రుంగెనురావణునడతనుబంగరుమేడపైననొకకాంతవ్య్రాఘ్రముగాంచెన్
రంగుల తోడవేసినవి రాజభవంతిని రంగజీవుడాసింగని బొమ్మలన్ గన విచిత్రము, నేటికి వీటి వోవకన్ జంగముఁ జంగలించునని జవ్వను లేగిరి సోద్యమున్ గనన్ బంగరు మేడ , పైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్.
కందంసింగారి హరిణనేత్రనుభంగపరుచ కీచకుండు పథకము వేయన్గంగారున మదిర కరిగిబంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్ఉత్పలమాలఅంగన పూవుబోడి హరిణాక్షిని సుందరి మత్స్యరాజహోభంగము సేయ, సోదరికి వాంఛను దెల్పుచుఁ బంపగోరినన్క్రుంగిన శోకమై మదిర రోయుచు నంతిపురంబునేగియున్బంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
చెంగట నిర్మాణ మయినకొంగ్రొత్త భవనముజూడ కోమలి వెడలెన్రంగుల బొమ్మల యందునబంగరు మేడ నొక కాంత వ్యాఘ్ర ము గాంచెన్
అంగనలు నిదురలో కనెబంగరు మేడ నొక కాంత ; వ్యాఘ్రముఁ గాంచెన్సంగడి ననున్న మరొకతెఇంగము నొందిరదియెరిగి యిరువురు కాంతల్
చెంగున దూకెడు భంగినిబంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్రంగులు వైచిన శిల్పమునంగన గమనించి కడకు నవరతి నొందెన్
పొంగులు వారుచున్న నది ముందు మనోహర సౌధమందునన్వింగడమైనవై కనిన విస్మయ మొందెడు చిత్ర రాజముల్రంగుల పూతతోడ గడు రమ్యముగా కనిపించు శిల్పముల్బంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
సింగార మొలుకు రీతిగరంగుల చిత్రములతోడ రమణీయమ్మౌహంగుల కయిసేతలుగలబంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్
హంగులు గూర్చిరా భవనమందున నెల్లెరు మెచ్చు రీతిగన్రంగుల కుడ్యముల్, మనసు రంజిల జేసెడి వర్ణచిత్రముల్,చెంగట పుష్పవాటికయు చేయగ కన్నులవిందు నట్టియాబంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
అంగుళ మేనియు నందుఁ గనంగ నశక్యంబు నూతన రహితము మహోత్తుంగంపుఁ గుడ్య తలమున బంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్అంగన కుండదే భయ మనంతము డెందము నందుఁ జూడ నబ్భంగిని నన్య పూరుషుని వ్రయ్యలు కాదె హృదండ మత్తఱిన్ దొంగను వ్యాఘ్ర సన్నిభునిఁ దొల్లి యెఱుంగని వానిఁ దూఱఁగా బంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
సంగడికాడొక యుదయమురంగులతో భవన మెక్కి రంజిలు నట్లున్భంగిమ లొలుకఁగ గీయగబంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్
ఉ.ముంగురులన్ గుతూహలము మోహన రూపము చక్కదిద్దుచున్భంగిమ మార్చి మార్చి కటి వస్త్రము గట్టిగ కట్టుబుద్ధితోవంగుచు మేలువాని బిలువంగ నినాదమధోముఖంబునన్*బంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్*
సంగడికాడు సౌధమున జక్కగ వేయగ వ్యాఘ్ర రూపునున్ బంగరు మేడపైన ,నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్ రంగులు మేళవించుటను రంజిలు భావన లేక యుంటచే యంగన భీతిఁజెందెనట యార్యులు సెప్పగాఁదెల్సె నాకహో
సింగారింతుననుచు పలు
రిప్లయితొలగించండిరంగులతోడ పలు చిత్రరాజమ్ములనే
రంగా జీవుడు వేయగ
బంగరు మేడ, నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్
(వేయగ బంగరు మేడన్ ఒక కాంత)
అంగనమండోదరితా
రిప్లయితొలగించండిసింగారించినమహలునసేమమెకాగా
క్రుంగెనురావణునడతను
బంగరుమేడపైననొకకాంతవ్య్రాఘ్రముగాంచెన్
రిప్లయితొలగించండిరంగుల తోడవేసినవి రాజభవంతిని రంగజీవుడా
సింగని బొమ్మలన్ గన విచిత్రము, నేటికి వీటి వోవకన్
జంగముఁ జంగలించునని జవ్వను లేగిరి సోద్యమున్ గనన్
బంగరు మేడ , పైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్.
కందం
రిప్లయితొలగించండిసింగారి హరిణనేత్రను
భంగపరుచ కీచకుండు పథకము వేయన్
గంగారున మదిర కరిగి
బంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్
ఉత్పలమాల
అంగన పూవుబోడి హరిణాక్షిని సుందరి మత్స్యరాజహో
భంగము సేయ, సోదరికి వాంఛను దెల్పుచుఁ బంపగోరినన్
క్రుంగిన శోకమై మదిర రోయుచు నంతిపురంబునేగియున్
బంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
చెంగట నిర్మాణ మయిన
రిప్లయితొలగించండికొంగ్రొత్త భవనముజూడ కోమలి వెడలెన్
రంగుల బొమ్మల యందున
బంగరు మేడ నొక కాంత వ్యాఘ్ర ము గాంచెన్
అంగనలు నిదురలో కనె
రిప్లయితొలగించండిబంగరు మేడ నొక కాంత ; వ్యాఘ్రముఁ గాంచెన్
సంగడి ననున్న మరొకతె
ఇంగము నొందిరదియెరిగి యిరువురు కాంతల్
చెంగున దూకెడు భంగిని
రిప్లయితొలగించండిబంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్
రంగులు వైచిన శిల్పము
నంగన గమనించి కడకు నవరతి నొందెన్
పొంగులు వారుచున్న నది ముందు మనోహర సౌధమందునన్
తొలగించండివింగడమైనవై కనిన విస్మయ మొందెడు చిత్ర రాజముల్
రంగుల పూతతోడ గడు రమ్యముగా కనిపించు శిల్పముల్
బంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
సింగార మొలుకు రీతిగ
రిప్లయితొలగించండిరంగుల చిత్రములతోడ రమణీయమ్మౌ
హంగుల కయిసేతలుగల
బంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్
హంగులు గూర్చిరా భవనమందున నెల్లెరు మెచ్చు రీతిగన్
రిప్లయితొలగించండిరంగుల కుడ్యముల్, మనసు రంజిల జేసెడి వర్ణచిత్రముల్,
చెంగట పుష్పవాటికయు చేయగ కన్నులవిందు నట్టియా
బంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
అంగుళ మేనియు నందుఁ గ
రిప్లయితొలగించండినంగ నశక్యంబు నూతన రహితము మహో
త్తుంగంపుఁ గుడ్య తలమున
బంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్
అంగన కుండదే భయ మనంతము డెందము నందుఁ జూడ న
బ్భంగిని నన్య పూరుషుని వ్రయ్యలు కాదె హృదండ మత్తఱిన్
దొంగను వ్యాఘ్ర సన్నిభునిఁ దొల్లి యెఱుంగని వానిఁ దూఱఁగా
బంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసంగడికాడొక యుదయము
రిప్లయితొలగించండిరంగులతో భవన మెక్కి రంజిలు నట్లున్
భంగిమ లొలుకఁగ గీయగ
బంగరు మేడ నొక కాంత వ్యాఘ్రముఁ గాంచెన్
ఉ.
రిప్లయితొలగించండిముంగురులన్ గుతూహలము మోహన రూపము చక్కదిద్దుచున్
భంగిమ మార్చి మార్చి కటి వస్త్రము గట్టిగ కట్టుబుద్ధితో
వంగుచు మేలువాని బిలువంగ నినాదమధోముఖంబునన్
*బంగరు మేడపైన నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్*
సంగడికాడు సౌధమున జక్కగ వేయగ వ్యాఘ్ర రూపునున్
రిప్లయితొలగించండిబంగరు మేడపైన ,నొక భామిని వ్యాఘ్రముఁ గాంచి భీతిలెన్
రంగులు మేళవించుటను రంజిలు భావన లేక యుంటచే
యంగన భీతిఁజెందెనట యార్యులు సెప్పగాఁదెల్సె నాకహో