19, ఫిబ్రవరి 2023, ఆదివారం

సమస్య - 4343

20-2-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నలుగురి యంగవిభవమన నచ్చిరి సర్వుల్”
(లేదా...)
“నలుగురి యంగవైభవమనన్ దలలూఁచిరి సంతసమ్మునన్”

15 కామెంట్‌లు:


  1. హలికులు దుఃఖించిరపుడు
    పలునాళ్ళుగ కరువుచేరి పంటలు లేకన్
    జలదాగమమందున వా
    నలు గురియంగ విభవమన నచ్చిరి సర్వుల్.

    రిప్లయితొలగించండి

  2. విలవిల లాడిరే జనులు వృష్టియె లేదని క్షామమందునన్
    హలములు మూలజేరెనని హాలికు లెల్లరు దైత్య దేవునిన్
    గొలువగ నిశ్చయించుకుని కోవెల జేరిరి యంతలోనె వా
    నలు గురియంగ వైభవమనన్ దలలూఁచిరి సంతసమ్మునన్.

    రిప్లయితొలగించండి
  3. జలదము లేర్పడి నింగిని
    జల జల రాలంగ దొడగె జల్లులు మెండై
    యిలలో నిండె ముదము వా
    నలు గురి యంగ విభవ మన నచ్చిరి సర్వుల్

    రిప్లయితొలగించండి
  4. కాలము గాకను రైతులు
    చాలా దు:ఖించుచుండ సత్యము గనియున్
    జాలివడి జలధరము వా
    నలు గురియంగ విభవమన నచ్చిరి సర్వుల్.

    రిప్లయితొలగించండి
  5. కందం
    అలజానకికి ననుజలకుఁ
    దలఁపగ దశరథ సుతులను దన్మనువుననా
    కొలువున నినకుల వీరుల
    నలుగురి యంగవిభవమన నచ్చిరి సర్వుల్

    చంపకమాల
    విలుగొని ద్రుంచగన్ మెరసి వేడ్కను జానకియెంచె రామునిన్
    బలులని వారిసోదరుల భాగ్యమటంచును సీత చెల్లియల్
    దలచఁగ తండ్రులాననతి, దాశరథుల్ విలసిల్ల పెద్దలున్
    నలురురి యంగవైభవమనన్ దలలూఁచిరి సంతసమ్మునన్

    రిప్లయితొలగించండి
  6. చం.

    పలువురు నింద్రలోకమునఁ బాటలు నాట్యము జూడగోరెడిన్
    మెలుసున రంభ యూర్వశియు మేనక తోడ ఘృతాచి రేగగన్
    వలువలఁ బట్టి కన్నుల విభావము సౌఖ్యమె జొల్లు కారగా
    *నలుగురి యంగవైభవమనన్ దలలూఁచిరి సంతసమ్మునన్.*

    రిప్లయితొలగించండి
  7. పొలములు బీడువారినవి బుక్కెఁడు నీటికి దిక్కులేక మా
    హలికుల కంటినీరమును యావిరియయ్యె నిరాశ నిస్పృహల్
    మెలిగొన నింతలోన పలు మేఘచయమ్ములు నింగిఁజేరి వా
    నలు గురియంగ వైభవమనన్ దలలూఁచిరి సంతసమ్మునన్

    రిప్లయితొలగించండి
  8. పొలములు బీడులు వారెను
    హలికుల కన్నీరుగూడ యావిరియయ్యెన్
    ఫలియించగ పూజలు వా
    నలు గురియంగ విభవమన నచ్చిరి సర్వుల్

    రిప్లయితొలగించండి
  9. పలువిధముల పోటిలలో
    తలమానికములుగ నిల్చె , దగవరి చింతన్
    తలమును తెలుసుకొనగ నా
    నలుగురి యంగవిభవమన నచ్చిరి సర్వుల్

    రిప్లయితొలగించండి
  10. పలుదినములు కురియని వా
    నలు గురియంగ విభవమన నచ్చిరి సర్వుల్
    కళకళలాడుచు పల్లియ
    వెలిగెన్ పండుగ సలుపగ వేడుకతోడన్


    కళకళలాడె పుష్కరము కన్నుల విందులు సేయ సిద్ధమై
    నలుగురు యప్సరాంగనలు నాట్యవి నోదము పంచు కోర్కెతో
    మిలమిలతో తిలోత్తమయు మేనక యూర్వశి రంభ యాడగన్
    నలుగురి యంగవైభవమనన్ దలలూఁచిరి సంతసమ్మునన్

    రిప్లయితొలగించండి
  11. పలు వెతలొందు రైతుతతి పంటలు వండక
    దీర్ఘ కాలమున్
    దలచుచునుండ్రి జంబుకుని దర్శన భాగ్యము నిమ్మటంచు వా
    రల మొర నాలకించియు కరమ్ముగ ,పంపెను
    నీరదంబు, వా
    నలు గురియంగ వైభవమనన్ దలలూచిరి సంతసంబునన్ 20/2/23

    రిప్లయితొలగించండి
  12. నలుగురు మన్మథ తుల్యులు
    నలుగురు శాంతస్వరూప నరవరు లెంచం
    దొలఁగదు వేఁడిమి వలనను
    నలుగురి యంగ విభవ మన నచ్చిరి సర్వుల్

    వెలుఁగఁగఁ జేయు సూర్యకుల వీరుల విక్రమ మెల్ల దిక్కులం
    దొలఁగఁగఁ జేయు సత్వరము దుఃఖము రాఘవ దర్శనం బెదం
    గలుగు నెడంద సంత సము గాంచిన రాఘవు లైన యట్టి యా
    నలుగురి యంగ వైభవ మనన్ దల లూఁచిరి సంతసమ్మునన్

    రిప్లయితొలగించండి
  13. చెలగి పొలమ్ములందునను చేయుచు కర్షక వృత్తి నుండు రై
    తులు కొనుచుంద్రు చిత్తమున తోషము, పంటలు పండ దండిగా
    తొలకరి లోన దున్నుకొని దుక్కులు చూచుచు నుండ వారు వా
    నలు గురియంగ వైభవమనన్ దలలూఁచిరి సంతసమ్మునన్

    రిప్లయితొలగించండి
  14. విలవిల లాడుచు రైతులు
    పలువిధములప్రార్థనమ్మువడిగాచేయన్
    జలజల మనితొలకరివా
    నలు గురియంగ విభవమున వచ్చిరి సర్వుల్

    రిప్లయితొలగించండి