28, ఫిబ్రవరి 2023, మంగళవారం

సమస్య - 4352

1-3-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“హరిని హరియె వేడె హరిని హరియింపంగన్”
(లేదా...)
“హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్”

16 కామెంట్‌లు:

  1. కందం
    హరి శ్రీరాముడె! సఖునిగ
    హరి సుగ్రీవుఁడు జతపడి యనుజుడు వాలిన్
    పరిమార్చమనఁగ సతికై
    హరిని హరియె వేడె హరిని హరియింపంగన్

    సమస్యాపాదములో మొదటి హరి : సుగ్రీవుడు
    రెండవ హరి : హరి అవతారమైన శ్రీరామచంద్రుఁడు
    మూడవ హరి : వాలి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      హరి రఘురాముఁడై భువిని నార్తులఁ గావగ ధర్మమూర్తియై
      ధరణిజ సీతకై వెదుక దన్నుగ భాను సుతుండు వానరుం
      డిరువున జేరి వాలి తననింతిని చేకొనె నంచు దెల్పుచున్
      హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్

      సమస్యాపాదములో మొదటి హరి : వాలి
      రెండవ హరి : సుగ్రీవుఁడు
      మూడవ హరి : హరి అవతారమైన శ్రీరామచంద్రుఁడు

      తొలగించండి
  2. అరినాసుగ్రీవుండును
    దరిజేరినమిత్రునిగనితరుణమునెంచిన్
    వరమడిగెనువాలినణచ
    హరినిహరియెవేడెహరినిహరియింపంగన్

    రిప్లయితొలగించండి
  3. హరిలోరంగహరియనుచు
    హరిదాసుడుచెప్పతొడగె హరికథనొకటిన్
    హరికథ సారంబేదన
    హరిని హరియె వేడె హరిని హరియింపంగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరియవతారమై వెలయు నారఘు రాముని భార్యసీతయే
      హరిణపుమాయలో పడగ నాదశకంఠుడు తస్కరించగా
      ధరణిజ జాడశోధనకు తక్కొను రాముని యొక్కమిత్రుడై
      హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్

      తొలగించండి

  4. తరుణిని వెదుకుచు వచ్చిన
    నరుడే నారాయణుడని నమ్మిన దేవా
    కరి తనబాధ తెలిపి శ్రీ
    హరిని హరియె వేడె హరిని హరియింపంగన్.

    శ్రీహరి....రాముడు
    హరియె....సుగ్రీవుడు(వానరుడు)
    హరిని.....వాలిని (వానరుని)
    హరియింపంగ...చంపుటకై

    రిప్లయితొలగించండి
  5. హరి సుగ్రీవుడు రాముని
    హరియంశగ తానెరింగి యరియౌ వాలిన్
    బరిమార్చుడనియె గాంచితె
    హరిని హరియె వేడె హరిని హరియింపంగన్

    రిప్లయితొలగించండి
  6. హరి యన వానరు డగుచున్
    హరి రఘు రాముo డు గాగ నవనిని వెలయన్
    హరి యగు వాలిని జంపగ
    హరిని హరియె వేడె హరిని హరియింపంగన్

    రిప్లయితొలగించండి

  7. అరయగ నగ్రజుండయిన యక్రమ మార్గము నందు రాజ్యమున్
    దరుణిని పొందుచుండె నిల ధర్మము నిల్పెడు దీక్షతోడ నీ
    ధరణిని బుట్టినట్టి తరిదాల్పువు నీవని కావుమంచు నా
    హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్.

    రిప్లయితొలగించండి
  8. ఝరి దాపున నొకదినమున
    నురగము బుస గొట్టుచు తన యొద్దకు రాగా
    దరిని గల కప్ప భయపడి
    హరిని హరియె వేడె హరిని హరియింపంగన్

    హరి = విష్ణువు , కప్ప , పాము

    రిప్లయితొలగించండి
  9. హరియనమర్కటమ్ము హరియన్నను శ్రీహరి విష్ణుమూర్తియే
    హరియవతారమౌ యినకులాంబుధి సోముడు రామచంద్రునిన్
    వరముగ కోరె వానరుడు వాలిని గూల్చగ వాని తమ్ముడే
    హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్

    రిప్లయితొలగించండి
  10. కం:మురిపించి పాడగా బిల
    హరిని ,హరియె వేడె హరిని హరియింపంగన్
    దిరముగ హృదిలో దాచగ
    వరమన సంగీతమె యని భార్యా మణినిన్.
    (హరి అనే అతను భార్యను బిలహరి రాగం లో పాట పాడ మన్నాడు.హరిని హరించి హృదయం లో నిలిపేది సంగీతమే అన్నాడు.)

    రిప్లయితొలగించండి
  11. చం:కరుణను వీడి వాలి తన కాంతను జేకొని,తన్ను గూడ సం
    గరమున జంప రాగ దన కష్టము దీర్పగ నన్నయైన యా
    హరిని హరింపగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్
    హరి యగు రాము డా మనవి నందెను ,కాచెను సూర్య నందనున్.

    రిప్లయితొలగించండి
  12. అరవింద నయనుఁ డారసి
    యరవిందాక్షిని వరించి యాడఁగఁ బెండ్లిన్
    సురుచిరముగ నప్పును బే
    హరిని హరియె వేడె హరిని హరియింపంగన్

    [బేహరి = వ్యాపారి యిక్కడ కుబేరుఁడు, హరి = విష్ణు విక్కడ శ్రీనివాసుఁడు, హరిని = పచ్చవర్ణము గలది యిక్కడ పద్మావతీకన్య, హరించు = సంగ్రహించు]

    పరుషము లైన నంశువులు పాటున కోర్వక యుష్ణరశ్మి యా
    దరమున నేఁగి సంభ్రమము తద్ద సెలంగ నెడంద మ్రొక్కుచున్
    గురుతర మిచ్చు చుండ వగఁ గ్రూరత వత్సర వత్సరమ్ములన్
    హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్

    [హరి = పాము (రాహువు) , సూర్యుఁడు, శ్రీ హరి]

    రిప్లయితొలగించండి
  13. చం.

    హరి యవతారమై దనుజ హాని వహించగ లంకలో మొనన్
    వరముగ ప్రోక్తమై స్తవము భాస్కరు గొల్చుటగస్త్యమౌనిచే
    చురుకుగ రామభద్రుడట జొచ్చెను వైరిగ రావణాఖ్యు *గో*
    *హరిని హరింపఁగన్ హరియె యా హరినిన్ గని వేడె నయ్యెడన్.*

    రిప్లయితొలగించండి
  14. మరుతాత్మజుడేవేడగ
    హరిసుతుకావంగనొప్పెహర్షము తోడన్
    సురుచిరసుందరుడచ్చో
    హరిని హరియె వేడె హరిని హరియింపంగన్

    రిప్లయితొలగించండి