25, ఫిబ్రవరి 2023, శనివారం

సమస్య - 4349

26-2-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాక్షసేంద్రునిఁ గొల్చుటె రక్ష నీకు”
(లేదా...)
“రాక్షసరాజుఁ గొల్చిననె రక్షణ నీకు లభించు నిచ్చలున్”

14 కామెంట్‌లు:


 1. అక్షధరుని నామమదేల యర్భకుండ
  పరమ శత్రువు గాదె యసురుల కతడు
  మాను మికయట్టి నామమ్ము మరచి పొమ్ము
  రాక్షసేంద్రునిఁ గొల్చుటె రక్ష నీకు.

  (ప్రహ్లాదునితో చండామార్కులవారు)

  రిప్లయితొలగించండి
 2. బాహ్యమంతరమందునబాధతోడ
  రక్షలేకనులోకంబురగులుచుండ
  కరుణలేకనుకట్టడికానవలయు
  రాక్షసేంద్రునిగొల్చుటెరక్షనీకు

  రిప్లయితొలగించండి
 3. అశోకవనములో సీతతో రాక్షసాంగనలు:

  తేటగీతి
  రావణాధిపుడే నిను రాణిఁజేసి
  వేడ్కనేలుకొందుననుచున్ వెంటనంట
  గడ్డిపోచగ జానకీ! కాంతువేల?
  రాక్షసేంద్రునిఁ గొల్చుటె రక్ష నీకు

  ఉత్పలమాల
  ప్రేక్షక రావణాధిపుని వేదనఁబొందగఁ గాదనందువే!
  దక్షత నిన్ను రాణిగను దాల్చెదనన్నను గడ్డిపోచగన్
  వీక్షణ జేతువేల? కడువేడ్కను జేరవె మెచ్చి, జానకీ!
  రాక్షసరాజుఁ గొల్చిననె రక్షణ నీకు లభించు నిచ్చలున్

  రిప్లయితొలగించండి
 4. హిరణ్య కశ్య పుడు చండా మార్కు ని
  తో -----
  బాలు నకు విద్య నేర్పు టే బాగు బాగు
  మే మొసంగిన నాజ్ఞ లన్ మీర కుండ
  రాక్ష సేంద్రుని గొల్చు టే రక్ష నీకు
  తెలిసి పాటించి మెలగంగ వలయు సతము

  రిప్లయితొలగించండి
 5. హరిని కీర్తించుచున్న ప్రహ్లాదుని గని
  “రాక్షసేంద్రునిఁ గొల్చుటె రక్ష నీకు”
  ననుచు హితవు నొసంగిన యసుర గణపు
  వలుకు వినని గరిమ విష్ణు భక్తుడతడు

  రిప్లయితొలగించండి

 6. శిక్షకుడుగ్గడించె నిక శ్రీహరి నామజపమ్ము మాను మా
  యక్షధరుండె ద్వేషణుడటంచు దలంచెడు జన్మకారుడే
  శిక్షను వేయబూను హరి చింతన తెచ్చు మృతమ్మె నీ వికన్
  రాక్షసరాజుఁ గొల్చిననె రక్షణ నీకు లభించు నిచ్చలున్.

  రిప్లయితొలగించండి
 7. ఉ.

  మోక్షముఁ గోరు రాక్షసులు ముచ్చటకైనను కానజాలరే
  వీక్షణ మూడులోకముల విస్తృత పాలన కామవాంఛయున్
  బిక్షగ నస్త్రశస్త్రములఁ బెంపున భండుడు కాశ్యపేయులున్
  *రాక్షసరాజుఁ గొల్చిననె రక్షణ నీకు లభించు నిచ్చలున్.*

  రిప్లయితొలగించండి
 8. అక్షయంబగు జ్ఞాన సంరక్షణమున
  దక్షత బెడంగు గురువుల శిక్షణమున
  మోక్ష తర్షణ శ్రీహరి దీక్షయేల
  రాక్షసేంద్రునిఁ గొల్చుటె రక్ష నీకు


  దక్షతతోడ శిక్షకులు తామిట నేర్పినవేలచెప్పవో
  శిక్షణనిచ్చుకాలమున చెప్పని సంగతులెట్లు నేర్తువో
  మోక్షము నిచ్చువిష్ణువను మూర్ఖపు వాదన నేల మానవో
  రాక్షసరాజుఁ గొల్చిననె రక్షణ నీకు లభించు నిచ్చలున్

  రిప్లయితొలగించండి
 9. వినుమునామాట వైదేహివీనులలర
  కానలందువసించుట కన్నఘనము
  గానుబ్రతుకునీ విచ్చోట గడుపవచ్చు
  రాక్షసేంద్రునిగొల్చుటె రక్షనీకు!


  మరొక పూరణ


  ప్రహ్లాదుని తల్లి ప్రహ్లాదునితో


  కంటికికనరాని హరిపై కాంక్ష బూని
  భాధలననుబవించుట పాడి యౌనె
  వినుము ప్రహ్లాద నామాటవేగమీవు
  రాక్షసేంద్రునిగొల్చుటె రక్షనీకు!

  మరొక పూరణ


  మోక్షము నిచ్చువాడనగ మూడుజ గంబుల యందుజూడ గా
  నక్షర సత్యమియ్యదియె నంచును పల్కుచు నుండనీవిటన్
  రాక్షసరాజు గొల్చిననె రక్షణ నీకు లభించు నిచ్చలున్
  కక్షను బూనినట్టుపలు కంగను పాడియె చెప్పుడిప్పుడే


  రిప్లయితొలగించండి
 10. ధర్మ రక్షణ మందుంచి తద్ద రక్తి
  నిర్మలమ్ముగ డెందమ్ము నిల్పు చుండి
  నిత్య మిల రామ భద్రుని నిర్జిత ఘన
  రాక్ష సేంద్రునిఁ గొల్చుటె రక్ష నీకు

  రక్షిత సంయమివ్రజుని రాఘవ వంశ పయోధి చంద్రునిన్
  శిక్షిత తాటకాసురిని సేవిత పన్నగ భూషణున్ జగ
  ద్రక్షకు దీన వత్సలుని రామ వరాఖ్యుని, వేగ వీడి యా
  రాక్షస రాజుఁ, గొల్చిననె రక్షణ నీకు లభించు నిచ్చలున్

  రిప్లయితొలగించండి
 11. అక్షయ శక్తితోననిమిషాధిపుపై విజయమ్మునొంది యా
  శిక్షితుడైన కుమారుడు, చేయుచు నుండగ దేశరక్షనన్
  దక్షుడు రావణాసురుడు తప్పక కాచును నిన్నుప్రీతి నా
  రాక్షస రాజుఁ, గొల్చిననె రక్షణ నీకు లభించు నిచ్చలున్

  రిప్లయితొలగించండి

 12. పిన్నక నాగేశ్వరరావు.

  (ప్రహ్లాదునికి గురువుగారి ఉద్బోధ)

  పితయె బద్ధశత్రువుగ భావించినట్టి
  హరిని తలచకుమయ్య ప్రహ్లాద నీవు
  మేము నేర్పు పాఠములను మెండు వినుచు
  రాక్షసేంద్రుని గొల్చుటే రక్ష నీకు.

  రిప్లయితొలగించండి
 13. తే.గీ.||
  రాక్షసకుల తిలకుఁడను రావణుండ
  రాముఁ డల్పుఁడు నాసాటి రాడతండు
  వదలు మాశను ననుగూఁడి ముదముఁగనుము
  రాక్షసేంద్రునిఁ గొల్చుటె రక్ష నీకు

  ఉత్పలమాల:
  రక్షణకైన తానె మదిరాక్షిరొ శిక్షకునైనతానె నీ
  వీక్షణమే వివేకివయి పేరిమి గూడుము రావణాసురున్
  దక్షుఁడు రక్షకుండతఁడె తద్దయు శక్తియుతుం డతండెపో
  రాక్షసరాజుఁ గొల్చిననె రక్షణ నీకు లభించు నిచ్చలున్

  రిప్లయితొలగించండి