4, ఫిబ్రవరి 2023, శనివారం

సమస్య - 4228

5-2-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము”
(లేదా...)
“కావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్”

28 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. తేటగీతి
   కపిని జంపిన రాముని కర్మఫలము
   నంటె కృష్ణావతారాన హరికి గనఁగ
   వెనక జన్మ పాపాలు దప్పింప గావు
   కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము

   ఉత్పలమాల
   పావన రామచంద్రుడల వాలిని జంపిన కర్మ వీడకే
   యావల కృష్ణుఁడై వెలయ నంటెను దప్పక దుష్ఫలంబునై
   జీవుల జన్మమేదయిన చేసిన పాప ఫలాలు వీడగన్
   గావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్

   తొలగించండి
  2. బాగా చెప్పారు గురువుగారూ 🙏👍

   తొలగించండి
  3. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
  4. గురుదేవులకు మరియు యగ్నేశ్ గారికి ధన్యవాదములు. 🙏

   తొలగించండి

 2. కావు కావనుచు నరచు కాకులెల్ల
  తెలుపు సత్యంబు లివియేను తెలుసు కొనుము
  సంపదలు, సుఖ భోగముల్ శాశ్వతములు
  కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము.


  దేవుని మ్రొక్కినన్ గలక తీరునటంచుదలంచి స్వార్థమున్
  గోవెలకేగి వానినట గొల్చుచు పిమ్మట పాప కార్యముల్
  నీవిట సల్పుచుండుటది నీచము లానుడులెల్ల సత్యముల్
  కావని, కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్.

  రిప్లయితొలగించండి
 3. కావు తనువులు చిరములు కావుకావు
  కావు సంపదల్ స్థిరములు కావుకావు
  నీవు నీవనుకున్నవి నీవి కావు
  కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము

  రిప్లయితొలగించండి
 4. జీవన కాలమందు గడు చింతిలు , సంపద
  భోగభాగ్యముల్
  లేవని జీవితాంతమును లెక్కలు వేసెడు
  వాని గాంచియున్
  జీవుడ యేవి యీభువిని చెందవు నీకు
  సదా తిరంబుగా
  కావని కావుకావని కాకులు కర్మ ఫలంబు దెల్పెడిన్

  రిప్లయితొలగించండి
 5. ఈ దివసమందున గడియలేమియు నలి
  కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ ; గర్మఫలము
  బావుకొనకుండుటనునది వలను గాదు
  తెలిసు కొనుచ మసలుటయే తిన్న యౌను

  రిప్లయితొలగించండి
 6. కలిమి లేములు స్థిరములు కావు కావు
  కష్థ నష్ఠము లనిశము కావు కావు
  అనుభవించు పదవు లక్షయములు కావు
  కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము

  దైవకటాక్షమే మరల దక్కొన జేయును జన్మ మిచ్చటన్
  చావుని విస్మరించి తమ సంపద నెన్నడు చాలదందురే
  కావరమే సదా బలుపు కారణ మౌనని పాపపుణ్యముల్
  కావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్

  రిప్లయితొలగించండి
 7. భావనచేయ పుణ్యమును పాపములబ్బును సంచితమ్ముగా
  యీవొనరించు కర్మఫల మెన్నఁడు నీవెనువెంట వచ్చునిం
  కేవియు నీవికావనుచు హెచ్చరికన్ వినిపించ గూయుచున్
  కావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్

  రిప్లయితొలగించండి
 8. ఈ వసుధన్ ఘటిల్లుసిరి యింపును గూర్చునటంచు మత్తులై
  జీవితకాలమందునను శ్రీకరునిన్ మది నెంచి యెట్టి సం
  భావన చేయకున్నభువి వైభవముల్ కన శాశ్వతమ్ములే
  కావని కావుకావనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్

  రిప్లయితొలగించండి
 9. జీవి త మ శాశ్వ త మటంచు చెప్పు కొఱకు
  సంపద లు మొద లైనవి సమసి పోవు
  వెంట రావేవి యను సత్య విషయ మనుచు
  కావనుచు గాకు లెరిగించు కర్మ ఫలము

  రిప్లయితొలగించండి
 10. కాకి యెప్పుడు వల్కును కా వని యిల
  మేఁక సంతత మఱవదె మే యని విని
  పింప నేరి కైనను విశ్వసింప కిట్లు
  కా వనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మ ఫలము

  కా వనుటం ద్యజించి మఱి కాకులు నేర్చునె పల్క నన్యమున్
  నీ వన యెద్ది యైనను సునిశ్చిత మద్ది వచించు నట్టులే
  కావున నెట్లు సెప్ప నగుఁ గాకుల కూతల కర్థ మివ్విధిం
  గావని కావు కా వనుచుఁ గాకులు కర్మఫలంబుఁ దెల్పెడిన్

  రిప్లయితొలగించండి
 11. కావు కావు మనుచుఁ బెద్దగా నఱచుచు
  నందఁజేయును బిండము నాదరమున
  పాప పుణ్యపు ఫలితముఁబఱగఁ జెప్పు
  కావనుచుఁ గాకు లెఱిఁగించుఁ గర్మఫలము

  రిప్లయితొలగించండి

 12. పిన్నక నాగేశ్వరరావు.

  కూడబెట్టిన దేదియు తోడు రాదు
  జీవితమ్ములు బంధముల్ స్థిరము కావు
  తనువు సంపదల్ భువి శాశ్వతము కావు
  కావనుచుఁ గాకు లెఱిగించుఁ గర్మఫలము.

  రిప్లయితొలగించండి