1, ఫిబ్రవరి 2023, బుధవారం

సమస్య - 4225

2-2-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భుజబలమున సతుల మించు పురుషుఁడు గలఁడా”
(లేదా...)
“భుజబలమందుఁ గాంతలనుఁ బూరుషుఁ డెన్నఁడు మించలేఁడులే”

30 కామెంట్‌లు:


 1. నిజమిది భువిలో గాంచగ
  భుజబలమున సతుల మించు పురుషుఁడు, గలఁడా
  సుజఘనలపై సహనమున
  విజయము సాధించువాడు విశ్వము నందున్?

  రిప్లయితొలగించండి
 2. శివుడు పార్వతికి కృష్ణుని లీలలు చెబుతూ..

  వ్రజమున యశోద కట్టిన
  నిజమెరిగియు గట్టదలిచె నీచులు సభలో
  రజమున నిష్ఫలమయె "దశ
  భుజ"!బలమునసతులమించుపురుషుఁడు గలఁడా

  దశభుజ=పార్వతి

  రిప్లయితొలగించండి

 3. నిజము గ్రహింపు మంటినిల నెమ్మిక యందు తితిక్ష యందునన్
  విజయము పొందువారెవరు? భీరువులేను, మనోబలమ్మునన్
  సుజఘనలే కదా ఘనులు, శూరులెయౌ మగవారు మించినన్
  భుజబలమందుఁ గాంతలనుఁ , బూరుషుఁ డెన్నఁడు మించలేఁడులే.

  రిప్లయితొలగించండి
 4. ప్రజలను బ్రశ్నించె నొకఁడు
  భుజ బలమున సతుల మించు పురుషుడు గలడా?
  నిజమును బల్కు చు నొకడనె
  భుజ బలమున సాటి రారు పొలతులు మాకున్

  రిప్లయితొలగించండి
 5. రిప్లయిలు
  1. కందం
   నిజమనఁగ వంట గదినిన్
   ధ్వజమెత్తకుడు సతిపైన వడిగన్ గరిటెల్
   ఋజుమార్గమ్మున విసరెడు
   భుజబలమున సతుల మించు పురుషుఁడు గలఁడా?

   చంపకమాల
   నిజమన మీరు వంట గది నీరజనేత్రను నాలిఁ గాంచియున్
   ధ్వజమది యెత్తఁబోకుడయ! వంటగదిన్ గన నట్లకాడలన్
   ఋజు గతిఁ దాకగన్ గురిని నెంచుచు వేగమె చాచి వైచెడున్
   భుజబలమందుఁ గాంతలనుఁ బూరుషుఁ డెన్నఁడు మించలేఁడులే!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

   తొలగించండి
 6. చం.

  సుజనుల రక్షకై లలిత చొచ్చె విశుక్ర విషంగ మారణం
  బు, జరిగె మంత్రిణీ సహిత, పోరున రెచ్చిన శక్తిరూపిణిన్
  భజనలు సేయ దేవతలు, భండునిఁ బుత్రుల సంహరించుటన్
  *భుజబలమందుఁ గాంతలనుఁ బూరుషుఁ డెన్నఁడు మించలేఁడులే!*

  రిప్లయితొలగించండి
 7. నిజ సతిని మీఱు పురుషుడు
  భుజబలమున ; సతుల మించు పురుషుఁడు గలఁడా
  ఈ జగమెల్లను వెదుకగ ,
  సజావుగ కుటుంబము గొన సాగించుటలో

  రిప్లయితొలగించండి
 8. విజయము చేకూరునెపుడు
  గజగమనలు ముందుకురుకు కలహము నందున్
  నిజమును గ్రహింప నేర్చిన
  భుజబలమున సతుల మించు పురుషుఁడు గలఁడా

  గజగజలాడడా మగడు కాంత చిరాకును గాంచినంతనన్
  విజయము తథ్యమౌనుగద విచ్చిన కన్నుల నింతి చూచినన్
  నిజముగ పూరుషుండు తన నేర్పును చూపక మిన్నకుండినన్
  భుజబలమందుఁ గాంతలనుఁ బూరుషుఁ డెన్నఁడు మించలేఁడులే

  రిప్లయితొలగించండి
 9. నిజబలమెంచిఁజూడగనునిత్యముసత్యము బుట్టినిల్లు వే
  రుజలనురూపుమాపగను రూపము వారలునన్నదమ్ము లై
  గజిబిజినల్లుకొన్నఁబలుగండము లన్నియు దాటవేయగా
  భుజబలమందుఁ గాంతలను పూరుషు లెన్నఁడు మించఁబోరు పో
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 10. నిజమగు శక్తి కార్యముల నిర్వహణమ్మున తేటతెల్లమౌ
  విజితులఁజేయు శత్రువుల విక్రముడై పురుషుండు మేటి తా
  భుజబలమందుఁ, గాంతలనుఁ బూరుషుఁ డెన్నఁడు మించలేఁడులే
  స్వజనులు బాములంబడిన వారికి నండగనిల్చి గాఁవగన్

  రిప్లయితొలగించండి
 11. నిజముం గాంచి పరీక్షిం
  ప జగము నందెన్నఁ డేని పన్నుగ నెదలన్
  నిజ ధీ బలమునఁ గా దా
  భుజబలమున సతుల మించు పురుషుఁడు గలఁడా

  నిజ బల దర్ప మోహితులు నిక్కము నేరక తల్తు రెల్లఁ దో
  యజ ముఖు లల్ప జీవులని యాత్మల వారికిఁ దోడు దైవమే
  ఋజు వగు భక్తి తోడ మది నీశ్వరు వేడఁగఁ బుట్టి నట్టి శం
  భుజ బల మందుఁ గాంతలనుఁ బూరుషుఁ డెన్నఁడు మించలేఁడులే

  [శంభుజ బలము = శంభుని చేతఁ బుట్టిన బలము]

  రిప్లయితొలగించండి
 12. స్వజనుల కెల్ల వారలకు చక్కని సేవల తృప్తి నిచ్చుచున్
  నిజమగు ప్రేమ జూపుచును నిర్మల చిత్తముతోడ మించి యం
  గజు డెసరేగ మానసమునందున భర్తను లొంగఁ దీయుచో
  భుజబలమందుఁ గాంతలనుఁ బూరుషుఁ డెన్నఁడు మించలేఁడులే

  రిప్లయితొలగించండి
 13. నిజమగు బలమేదియనన్
  స్వజనుల నాదరణజేయు సతి ధర్మమ్మే
  ఋజువిది బలహీనులయిన
  భుజబలమున, సతుల మించు పురుషుఁడు గలఁడా

  రిప్లయితొలగించండి
 14. నిజమిది యనుచును తలచుచు
  కుజనుండానరకుడు గనికోమలి పోరున్.
  గజగజవణకుచుతలచెను
  భుజబలమున సతుల మించు పురుషుడు

  రిప్లయితొలగించండి