18, ఫిబ్రవరి 2023, శనివారం

సమస్య - 4342

19-2-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మామ యల్లుఁడయ్యె నేమి వింత”
(లేదా...)
“మామయె యల్లుడయ్యెను కుమారియె యత్తగ మారె వింతగన్”
(కన్నేపల్లి వరలక్ష్మి గారికి ధన్యవాదాలతో...)

13 కామెంట్‌లు:

 1. ఆటవెలది
  విష్ణు పాదయుగలి వేడ్క జననమొంద
  గంగను సతిగఁ గొనియ జంగమయ్య
  మాధవి తనయుడను మన్మథునకతండు
  మామ, యల్లుడయ్యె నేమి వింత?

  ఉత్పలమాల
  శ్రీమగఁడైన శౌరివగు శ్రీపద సన్నిధి బుట్టి గంగయే
  సోముని బొందగన్ బతిగ, జూడగ నిట్లగు వావినెంచఁగన్
  గామునికౌను శంకరుడు, కాముని తండ్రికి, విష్ణు, పట్టికిన్
  మామయె, యల్లుడయ్యెను, కుమారియె, యత్తగ మారె వింతగన్!

  రిప్లయితొలగించండి
 2. అస్థిమాలి మామయగు దక్షునికి చంద
  మామ యల్లుఁడయ్యె నేమి వింత
  రోహిణి గృహమండు రోజులు గడుపుచు
  చందమామ శాపమొందె నకట

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తామరకంటి పాదముల తానుజనించి త్రివేణియౌగదా
   తా మరునయ్యకున్ దనయ తత్పరమొప్పు సముద్రుడల్లుడై
   గోముగ తోయరాట్టు తన కూతురు నిచ్చి యనంతుని మామయౌ
   మామయె యల్లుడయ్యెను కుమారియె యత్తగ మారె వింతగన్

   తొలగించండి
 3. జగతి కెల్ల తాను చంద మామ గ నుండ
  తగిన మగడు నయ్యె దక్ష సుతకు
  పలికె నొక్క డిట్లు పరి హాస మాడుచు
  మామ యల్లు డయ్యె నేమి వింత!

  రిప్లయితొలగించండి
 4. కొమిరెలనిడిన జనకుడు దక్షునికి జంద
  మామ యల్లుఁడయ్యె ; నేమి వింత
  శంభుని తలపైకి షడ్డకుడెక్కెను
  వియ్యమును దలచరు వేల్పు లెపుడు

  రిప్లయితొలగించండి
 5. అజుని పదములందు నావిర్భవించిన
  గంగ కడలియందు సంగమించె
  అబ్ధిజ పతిహరియె యంబుధి యల్లుడు
  మామ యల్లుఁడయ్యె నేమి వింత

  రిప్లయితొలగించండి
 6. అక్క బిడ్డ పెండ్లియాడెనుసరసుడై
  కూతునిచ్చెమఱదికొంగుముడిని
  ఇంటికల్లుడపుడువియ్యమునందెగా
  మామయల్లుడయ్యెనేమివింత

  రిప్లయితొలగించండి
 7. ఆ మహనీయమూర్తి హరి యంఘ్రియుగంబున నుద్భవించియున్
  వ్యోమపథంబునున్ విడచి యుద్ధతి సాగరుఁ గూడు గంగ, తా
  నేమగు చక్రి సాగరునకేర్పడ నబ్ధిజఁగన్న తండ్రికిన్?
  మామయె యల్లుడయ్యెను కుమారియె యత్తగ మారె వింతగన్

  రిప్లయితొలగించండి
 8. వేమఱుజిల్కగాజలథినిందిరబుట్టెనువిష్ణుపత్నిగా
  నీమమునెంచిగంగయటనేరుపుమీరగసంగమింపగా
  తామరసాక్షువిష్ణునకుధర్మముతోడుప్రకాశమందుచున్
  మామయెయల్లుడయ్యెనుకుమారియెయత్తగమారెవింతగన్

  రిప్లయితొలగించండి
 9. భూ జనులకు నెల్ల ముద్దుల మామయై
  తనరు చుండు నట్టి ఘనుఁడు ప్రీతిఁ
  దనయలను గ్రహించి దక్షున కా చంద
  మామ యల్లుఁ డయ్యె నేమి వింత

  మామకు మామ యయ్యె హరి మాతకు కూతురహో సపత్ని యై
  గోముగ వెల్గె వింతగను గుంభిని వింతల నెన్న శక్యమే
  భామిని సీత కాంచ సుత వర్యుల భూమికి రాముఁ డబ్ధికిన్
  మామయె యల్లుడయ్యెను గుమారియె యత్తగ మారె వింతగన్

  రిప్లయితొలగించండి
 10. ఆ సముద్రసుభగ హరియాత్మ సంభవ
  యగుచు సంద్రుడజుని యల్లుడవగ
  వాని సుత జలధిజ పద్మాక్షు వరియింప
  మామ యల్లుఁడయ్యె నేమి వింత.  ఆ మధుసూదనున్ బదము లందున పుట్టినట్టి యా
  వ్యోమతరంగిణిన్ గొన మహోదధికిన్ హరి యౌను మామగా
  నా మకరాంకు బుత్రి కమలాలయ జేకొన తోయరాట్టు కున్
  మామయె యల్లుడయ్యెను కుమారియె యత్తగ మారె వింతగన్.

  రిప్లయితొలగించండి
 11. సిరికితండ్రియైన సింధురాట్పతికిని
  నాలిగానుచేయనాదరమున
  తనయనుహరియయ్యెతానుమోదముతోఢ
  మామ మామ యయ్యె నేమివింత

  రిప్లయితొలగించండి