16, ఫిబ్రవరి 2023, గురువారం

సమస్య - 4340

17-2-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాతిరి యుత్తరమునందు రవి యుదయించెన్”
(లేదా...)
“రాతిరి యుత్తరంబునను రమ్యముగా నుదయించె భానుఁడే”

16 కామెంట్‌లు:

  1. కందం
    యాతన పడ వత్సరములు
    త్రేతాయుగ రామమూర్తి దేవళమునకై
    ప్రీతిగలుఁగు తీర్పు వెలయ
    రాతిరి యుత్తరమునందు రవి యుదయించెన్

    ఉత్పలమాల
    యాతన నొంద న్యాయమున కార్తిని రాముని జన్మభూమినిన్
    త్రేత యుగాధిపుండనెడు శ్రీరఘరాముని యాలయానికై
    ప్రీతి గలుంగు తీర్పువిని వేడుక జేయఁగ భక్తితోడ నా
    రాతిరి యుత్తరంబునను రమ్యముగా నుదయించె భానుఁడే

    రిప్లయితొలగించండి


  2. దైతేయ మేదజను ఖ
    ద్యోతుడు విడినంత వేగ యుర్విని ముసిరెన్
    భీతిలజేసెడు చీకటి
    రాతిరి , యుత్తరమునందు రవి యుదయించెన్.

    రిప్లయితొలగించండి

  3. భూత పిశాచముల్ చెలగి ముక్కలుగా నను కోసినట్లుగా
    భీతిల జేయు స్వప్నమున భీకర దృశ్యము గాంచినంతనే
    యాతన చెందిమేల్కొనగనారట మందున సాగిపోయెనా
    రాతిరి , యుత్తరంబునను రమ్యముగా నుదయించె భానుఁడే.

    ఉత్తరమునను =తరువాత

    రిప్లయితొలగించండి
  4. ఉ.

    నాతి మనోహరంబు సిరి నచ్చిన రీతినిఁ గ్రీడనంబుచే
    *రాతిరి యుత్తరంబు నను, రమ్యముగా నుదయించె భానుఁడే*
    చేతుల జోడ్చి భక్తిఁ గను సేవలు తూరుపుకొండ కర్మముల్
    మూతిని క్షాళనంబు సరి ముచ్చటఁ గొల్చుచు నర్ఘ్యమిచ్చుటన్.

    రిప్లయితొలగించండి
  5. కూతురు బిడ్డనుగనె నీ
    రాతిరి యుత్తరమునందు ; రవి యుదయించెన్
    రీతిగ మరుసటి దినమున
    పీతువు కంటెను తొలుతనె బిడ్డను పుట్టెన్

    రిప్లయితొలగించండి
  6. ఆతని జన్మగాథ విని యాతని బోధనలంది శ్రద్ధతో
    నాతని మార్గమున్ దొడరి హాయిని బొందగ నిచ్చగింతురే
    భూతల మందు పున్నమిన బుట్టెను బుద్ధుడు మాయ గర్భమున్
    రాతిరి యుత్తరంబునను రమ్యముగా నుదయించె భానుఁడే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జాతికి స్వరాజ్య మొచ్చిన
      రాతిరి యుత్తరము నందు 'రవి యుదయించెన్
      చైతన్య భారతము' నని
      వ్రాతలు వ్రాసిరి సుదూర వాసుల కెల్లన్

      [ఉత్తరము - లేఖ]

      తొలగించండి
  7. శీత సమీరము వీచెను
    రాతిరి యుత్తరము నందు ::రవి యుద యించె న్
    జాతి సమ స్త ము మేల్కొని
    ప్రీతి గ సలు పంగ బూను విధులయ్యె డ లన్

    రిప్లయితొలగించండి
  8. శీతల పవనము వీచెను
    రాతిరి యుత్తరమునందు, రవి యుదయించెన్
    ప్రీతిగ తూరుపు దిక్కున
    భూతలమున జీవకోటి మోదమునొందన్

    రిప్లయితొలగించండి
  9. బ్రాతిగ శీతశైల శిఖరాగ్రమునుండి స్రవించు మంచుతో
    శీతల వాయువుల్ భువిని జీవులు తల్లడమంద వీచగా
    రాతిరి యుత్తరంబునను, రమ్యముగా నుదయించె భానుఁడే
    భూతలమందు జీవులకు మోదము గూర్చుచు తూర్పు దిక్కునన్

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. ప్రీతిని వ్రాయఁగ నిజ సం
      జాతుఁడు రవి యన నొకండ సంహర్షణ సం
      జాతము సన్నిధి సేరఁగ
      రాతిరి యుత్తరము నందు రవి యుదయించెన్

      [ఉత్తరము = జాబు]

      భూత వితాన మంద రహి భూతల వాస చ రాచ రాలి ప్రా
      భాతిక మందుఁ గాక మఱి భాస్కరుఁ డెం దుదయించు నెన్నఁడే
      నాతత కాంతు లీనుచు సమంచిత రీతినిఁ దూర్పు దిక్కునన్
      రాతిరి యుత్తరంబునను రమ్యముగా నుదయించె భానుఁడే

      [ఉత్తరము = మీఁదిది, రాత్రి కుత్తరము పగలు]

      తొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.

    భీతిలగ జేసె నురుములు
    రాతిరి యుత్తరమునందు;రవి యుదయించెన్
    ప్రాతఃకాలము నందున
    ప్రీతిగ విశ్వమ్మునంత వెలుగులు పంచన్.

    రిప్లయితొలగించండి
  12. జాతరఁజేసితి వారమ!
    రాతిరి?, యుత్తరమునందు రవి యుదయించెన్
    జేతము సరిగా గలదే?
    యాతపముంగా ననగును హరిదిశ యందున్

    రిప్లయితొలగించండి
  13. కూతురు కోరుకున్నయొక గొప్ప ధనాఢ్యు
    కుమారుతోడ సం
    ప్రీతిగ దండ్రి యొప్పకొనె పెండిలి సేయగ
    కాని యాతడున్
    శీతక డంతకుండనియు తెల్సి వివాహము
    రద్దు జేయ నా
    రాతిరి యుత్తరంబునను రమ్యముగా
    నుదయించె భానుడున్

    రిప్లయితొలగించండి
  14. ఆతతశక్తినిగూడుచు
    సాతమునటననుశివుడునుశాంతుడుకాగా
    భాతినిసూర్యునికాంతిని
    రాతిరియుత్తరమునందురవియుదయించెన్

    రిప్లయితొలగించండి