15, ఫిబ్రవరి 2023, బుధవారం

సమస్య - 4339

16-2-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కంఠీరవ కంఠమందుఁ గరి యుదయించెన్”
(లేదా...)
“కంఠంబందున దిగ్గజమ్ము వొడమన్ గంఠీరవం బొప్పెనే”

14 కామెంట్‌లు:


 1. శుంఠయన బోకు కాంస్యపు
  కంఠీరవుడన్న బిరుదు కలిగిన వాడే
  కంఠధ్వని మార్చగ నా
  కంఠీరవ కంఠమందుఁ గరి యుదయించెన్.

  (మిమిక్రీ కాళాకారుడు ఏనుగు ఘీంకారాన్ని అనుకరించాడని...)

  రిప్లయితొలగించండి
 2. కందం
  శుంఠలు యిర్వురు పాఠము
  కంఠస్థము సలుపక తిరుగాడగ యదియున్
  కంఠశ్రమనగ, సద్గురు
  కంఠీరవ కంఠమందుఁ గరి యుదయించెన్
  ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  ఉండవల్లి సెంటరు.

  రిప్లయితొలగించండి
 3. శుంఠాయనితిట్టెగురుఁడు
  వెంటన్శిష్యుఁడుతడబడివిద్యలునేర్చెన్
  శొంఠినిశోధనసేయగ
  కంఠీరవకంఠమందుకరియుదయించెన్

  రిప్లయితొలగించండి

 4. శంఠుండంచు దలంపబోకుడు సంస్కారమ్ము కాదందునే
  కంఠంబున్ దగురీతి మల్చుచు బురస్కారమ్ములే పొందె, నే
  గంటిన్ జ్ఞాపిక లెన్నొ, తెల్పెనె కళాకారుం డతం డంచు నా
  కంఠంబందున దిగ్గజమ్ము వొడమన్ , గంఠీరవం బొప్పెనే.

  రిప్లయితొలగించండి
 5. కందం
  కంఠమునన్ సింహమతఁడు
  గంఠము ధ్వన్యనుకరణను గమకమొలుక సలహా ట ను
  త్కంఠను రేపుచు వేదికఁ
  గంఠీరవ కంఠమందుఁ గరి యుదయించెన్!

  శార్దూలవిక్రీడితము
  కంఠంబున్ వినినంత సింహమతడై కన్పించు నూహింపగన్
  గంఠంబున్ దగ మార్చగల్గు పటిమన్ గల్పింప దైవమ్ము ను
  త్కంఠన్ రేపు ప్రదర్శనంబమర సంధానింప పల్జీవులన్
  గంఠంబందున దిగ్గజమ్ము వొడమన్ గంఠీరవం బొప్పెనే!

  రిప్లయితొలగించండి
 6. శుంఠ గ నున్నట్టి మనుజు
  కం ఠ ము సరి జేయ దలచి కడు యత్న మునన్
  శొంఠి ని యుపయో గిం పగ
  కం ఠీ ర వ కంఠ మందు కరి యుద యించె న్

  రిప్లయితొలగించండి
 7. శుంఠలొకచోట గవితల
  గంఠస్థము జేయనెంచి గట్టిగ జదువన్
  కంఠము వినినంత మొఱకు
  కంఠీరవ కంఠమందుఁ గరి యుదయించెన్

  రిప్లయితొలగించండి
 8. గుంఠనమున కేమున్నది
  కంఠీరవమునకు రొంప కతమున మిగులన్
  కుంఠనమేర్పడి గొంతుకు
  కంఠీరవ కంఠమందుఁ గరి యుదయించెన్

  రిప్లయితొలగించండి
 9. కంఠము శోభిల్లునెపుడు
  కంఠీరవబిరుదము గొను కవికోకిలకున్
  కంఠము శోషించిన తఱి
  కంఠీరవ కంఠమందుఁ గరి యుదయించెన్

  రిప్లయితొలగించండి
 10. శుంఠల్ బల్కెడు రీతిఁ బల్కదగునా చోద్యంబుగా నెవ్విధిన్
  కంఠంబందున దిగ్గజమ్ము వొడమన్ గంఠీరవం బొప్పెనే?
  శుంఠిన్ చూర్ణముచేసి గైకొనగ నస్తోకంబుగా నున్న నీ
  కంఠంబందుకఫంబుపోనిడును వీఁకన్ గూర్చు స్వాస్థ్యంబికన్

  రిప్లయితొలగించండి
 11. రిప్లయిలు
  1. డుంఠి వినాయకు కరుణన్
   శుంఠుల నశియింపఁ జేయఁ జోద్యముగ మహా
   కుంఠిత విక్రమ రాక్షస
   కంఠీరవ కంఠ మందుఁ గరి యుదయించెన్

   [కంఠము = సమీపము; కరి = కోఁతి, ఇక్కడ మారుతి]

   కుంఠీ భూత పరాక్రముం డనుపమక్రూరుండు దైత్యుండు వై
   కుంఠద్వేషి హిరణ్య భోజనుఁడు నా ఘోరేభ తుల్యుండు నా
   కంఠాఘాబ్ధి మునుంగ మాధవ లసత్కంఠీర వోత్సుంగపుం
   గంఠం బందున దిగ్గజమ్ము వొడమన్ గంఠీరవం బొప్పెనే

   [కంఠము = సమీపము]

   తొలగించండి
 12. శా.

  కంఠంబున్ సవరించుచున్ గణపతిన్ గానామృతంబయ్యెడిన్
  కంఠంబున్ దొడగంగ మాల వినతిన్ గంభీరవేదిన్ మదిన్
  కంఠంబున్ దొలగంగ గర్జన రహిన్ గర్వంబు వెన్నుచ్చుడిన్
  *కంఠంబందున దిగ్గజమ్ము వొడమన్ గంఠీరవం బొప్పెనే.*

  రిప్లయితొలగించండి
 13. శుంఠగపాలకుడాయెను
  కంఠమునందలిసుజనుడుకానగరాకన్
  కంఠేరుడునయ్యెనుపతి
  కంఠీరవకంఠమందుకరియుదయించెన్

  రిప్లయితొలగించండి