30, ఆగస్టు 2023, బుధవారం

దత్తపది - 200

31-8-2023 (గురువారం)
కవిమిత్రులారా,
వేంకట - సుబ్బ - సహ - దేవుఁడు
పై పద్యాలతో వధూ వరులను ఆశీర్వదిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయండి.
(31-8-2023 రోజున గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారి కుమారుడు చి. శరత్ చంద్ర వివాహం 

చి.సౌ. సాయిసంధ్యతో గుంతకల్లులో జరుగుతున్న సందర్భంగా)


10 కామెంట్‌లు:

  1. పూనివేంకటనాథుడంతటభూరిసంపదలిచ్చుతన్
    వేనవేలికపుత్రపౌత్రులవేగయిచ్చుతసుబ్బడున్
    తానుగౌరితొశంభుడిచ్చుతతాల్మియున్సహధర్ముడై
    తోననుండుగదేవదేవుడుదోయిలించినభక్తితో

    రిప్లయితొలగించండి

  2. వేంకట రమణుఁ దీవెనలు పుష్కలముగ
    . నంద శరచ్ఛంద్ర యందు కొనియె

    సాయిసంధ్యకరము, శరవణ భవుడగు
    . సుబ్బనితో సహ శుభము గూర్చె

    డాది దేవుడు విఘ్నహారి కృపాకటా
    . క్షములతో నన్యోన్య జంపతులుగ

    పరిఢవిల్ల వలయు వసుధాతలమునందు
    . స్థిరకీర్తి నొందుచు సిరులు పొంగ


    ఆ.వె.

    సోమునంటియుండు కౌముది వోలెను
    క్షీర మందు డాగు వారి విధము
    పూవు మరియు దాని తావివోలెను వారు
    కలిసి సాగ వలయు కల్పమందు.

    రిప్లయితొలగించండి
  3. సుబ్బ సహదేవుడు మీకు శుభము బలికి
    ససిగ గాపురము సలుప సహక రించ,
    వేంకటగిరి నాథుడు మీకు పెరిమ నొసగి
    ఆది దేవుడు మిమ్ముల నరయుగాక

    రిప్లయితొలగించండి
  4. ప్రతిదినమ్మున వాసి పద్యాలనే వ్రాసి
    స్పూర్తిదాయకుడైన సుకవియతడు
    జటిలసమస్యలన్ పటుతర దీక్షతో
    చక్కబరచునట్టి సాధకుండు
    క్లిష్టమౌ ప్రాసలన్ స్పష్టతన్ దర్శించి
    శ్రేష్ఠమౌ పూరణల్ సేయగల్గి
    చాటు వేంకట సుబ్బ సహదేవుని సుతుడు
    పెండ్లికుమారుడై బెడగు వేళ

    వేంకటపతి కృప లభించి వెలయుగాక
    సుఖము సౌఖ్యము సుబ్బనచూఱుగాగ
    సహచరిత్వముతో జంట సాగు గాక
    తీపి మనుగడ దేవుఁడు చూపు గాక

    రిప్లయితొలగించండి
  5. సీ॥ వేంకటరమణుఁడు సంకట హరణముఁ
    జేయఁగ సుబ్బన్న శ్రేయముఁ గన
    సఖ్యత విరియఁగ సహజీవనమ్మొప్ప
    భవమున ముదముగ భవ్యతఁ గన
    సతతము శుభములు స్వాగతము పలుక
    దేవదేవుఁడు మీకు దీవెనలిడఁ
    బెండ్లి పందిరిలోన పెనవేసు కొనుచున్న
    బంధముఁ దనరఁగ బాగు బాగు

    తే॥ యనుచు నూత్నదంపతులకు హార్దిక శుభ
    కామనలనొసఁగెడి వాఁడ గరిమ తోడ
    బ్రదుకు పయనించ బంగరు బాటలోన
    మీకివే శుభాశీస్సులు మెండుగాను

    రాయలసీమలో సుబ్బన్న నామధేయము సుబ్రహ్మణ్యంకు బదులుగా గతంలో బహుళ ప్రాచుర్యంలో ఉండేదండి

    రిప్లయితొలగించండి
  6. దేవ దేవుడు జంటకు దీవెన లిడ
    వే o క టా చల వాసుండు బ్రీతి గూర్ప
    శర వణ భవ సుబ్బడొ సంగు శాంతి యనగ
    సహన సంసార శక టమ్ము సాగు గాక!

    రిప్లయితొలగించండి
  7. మత్తేభము (పంచపాది)
    ఇలలో *వేంకట*నాథుఁడేడుగడయై యింపార కాపాడగన్
    కలయో యా*సహ*దేవు లీలయొ యనన్ కళ్యాణ వైభోగమున్
    తిలకించన్ దివినుండి దేవగణముల్, దీవించగా *సుబ్బ*డున్
    పలురీతుల్ శుభకామనల్దెలుపగా పద్యాలతో *దేవుడు*న్
    కలకాలమ్ము వధూవరుల్ సుఖముగా గావింత్రు సంసారమున్

    రిప్లయితొలగించండి
  8. మా అబ్బాయి పెళ్లి నేడు గుంతకల్ పట్టణములో పెద్దల దీవెనలతో శుభప్రదంగా ముగిసినది.గురుదేవులు శ్రీకందిశంకరయ్య గారు, శ్రీ చిటితోటి విజయకుమార్ గారు, శ్రీమాచవోలు శ్రీధర్ర్ రావు గారు, శ్రీ ఈశ్వరప్పగారు మరియు శ్రీ ఎ. వి. రమణరాజు గారు హాజరై తమ దీవెనలందించారు. గురుదేవులకు పాద స్పర్శతో తనువు ఆనందబాష్పాలతో పులకించి నోటమాటకరువైనది. తక్కిన పండిత శ్రేష్టుల దీవెనలతో నవదంపతులు ధన్యులైనారు. నేటి కవిమిత్రుల పద్యాశీర్వాదములకు ధన్యవాదశతము.

    రిప్లయితొలగించండి