12, ఆగస్టు 2023, శనివారం

సమస్య - 4501

13-8-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“భత్యము లేనట్టి కొలువు వరసుఖము లిడున్”
(లేదా...)
“భత్యం బందని కొల్వుఁ జేసినపుడే ప్రాప్తించు సత్సౌఖ్యముల్”

18 కామెంట్‌లు:

  1. ముత్యము వలె మనసుండగ
    సత్యమె వ్రతమై నిరతము సంతోషముతో
    నత్యంత శ్రద్ధ గలిగిన
    భత్యము లేనట్టి కొలువు వరసుఖము లిడున్”

    రిప్లయితొలగించండి
  2. ప్రత్యేకముగా రాముని
    నిత్యము హృదయమ్ములోన నిల్పిన హనుమా
    సత్యము వచించు మెవ్విధి
    భత్యము లేనట్టి కొలువు వరసుఖము లిడున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిత్యంబీవిధి కొల్వుకై పయనమౌ నిర్భాగ్యులన్ జూడుమా
      ప్రత్యేకంబుగ నిల్పినావు హనుమా! లంకారినే గుండెలో
      సత్యంబేనని తెల్పుమా హృదయమున్ సంతోష ముప్పొంగగా
      భత్యం బందని కొల్వుఁ జేసినపుడే ప్రాప్తించు సత్సౌఖ్యముల్

      తొలగించండి
  3. పత్యనురాగముబొందుచు
    అత్యంతముధర్మనిరతినామెయుమెలగన్
    సత్యంబీమాటయెగా
    భత్యములేనట్టికొలువువరసుఖములిడున్

    రిప్లయితొలగించండి
  4. కందం
    అత్యంత వత్తిడులలమి
    నిత్యము బాధ్యతలు ముసర నెరవేర్చి కడన్
    భృత్యునివలె గుడులందున
    భత్యము లేనట్టి కొలువు వరసుఖము లిడున్

    శార్దూలవిక్రీడితము
    అత్యంతంబుగఁ జుట్టు వత్తిడుల మధ్యన్ దానవశ్యమ్ముగన్
    నిత్యంబెన్నియొ బాధ్యతల్ సలిపి పొందింపంగ సంపాదనల్
    భృత్యున్ బోలుచు నాలయాలఁ గడ సేవింపంగ భక్త్యాత్ములై
    భత్యం బందని కొల్వుఁ జేసినపుడే ప్రాప్తించు సత్సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  5. సత్యంబౌ నుడులన్ వచించెద మహోత్సాహంబు నన్ మిత్రమా
    నిత్యంబా రఘురామనామ మదియే నేమమ్ముగా దల్చుటే
    కృత్యంబంచు దలంచు వారలిల నిష్క్రియమ్ము నాశింతురే?
    భత్యం బందని కొల్వుఁ జేసినపుడే ప్రాప్తించు సత్సౌఖ్యముల్.

    రిప్లయితొలగించండి
  6. భృత్యుండై రఘు రాముని
    నిత్యము సేవించెడాంజ నేయుని గనుచున్
    సత్యంబెఱగితి నదియే
    భత్యము లేనట్టి కొలువు వరసుఖము లిడున్.

    రిప్లయితొలగించండి
  7. నిత్యము సత్యము బ లు కుచు
    ప్ర త్య ణు వును ధర్మ నిరతి పరగుచు సేవా
    కృత్యములు సలుపు వారికి
    భత్యము లేనట్టి కొలువు వర సుఖము లిడు న్

    రిప్లయితొలగించండి
  8. గత్యంతరమిక లేదుగ
    సత్యము జెప్పెద వినవలె సఖుడా నీతో
    నిత్యము వశ కడ జీతము
    భత్యము లేనట్టి కొలువు వరసుఖము లిడున్

    రిప్లయితొలగించండి
  9. నిత్యము సతి కనుసన్నల
    నత్యంతంబగునపేక్ష యాదరణముతో
    భృత్యునివలెపతి యమరగ
    భత్యము లేనట్టి కొలువు వరసుఖము లిడున్

    రిప్లయితొలగించండి
  10. కం॥ నిత్యము ధనయావ తగదు
    సత్యముఁ దెలుపఁగఁ బరులకు సాయమొసఁగెడిన్
    కృత్యములు ముక్తిని బడయు
    భత్యము లేనట్టి కొలువు వరసుఖములిడున్

    శా॥ నిత్యంబున్ ధనయావతో బ్రదుకఁగా నేరంబుఁ గాదా భువిన్
    భత్యంబేలను జీతముండగను నింపారంగ జీవించఁగన్
    సత్యంబేమన ముక్తిఁ బొందఁగ జనుల్ స్వార్థమ్ము వీడన్ దగున్
    భత్యంబందని కొల్వుఁ జేసినపుడే ప్రాప్తించు సత్సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  11. పెళ్ళి చేసుకోబోయే వరునకు వధువు విధిస్తున్న షరతులు:
    👇
    శార్దూలవిక్రీడితము:
    స్తుత్యంబౌవిధి నాకు నీవలపు నస్తోకంబుగా బంచుచున్
    భృత్యుం బోలికనెల్లవేళలనుసత్కృత్యంబులన్ సల్పుచున్
    నిత్యంబేమరుపాటులేక ననునీ నేస్తంబుగానెంచియే
    భత్యం బందని కొల్వుఁ జేసినపుడే ప్రాప్తించు సత్సౌఖ్యముల్

    రిప్లయితొలగించండి
  12. శా.

    కృత్యంబౌ భువనాల మేలు కలుగన్ గీర్తించ నాత్మజ్ఞులే
    ముత్యాలే, కలహాశనుండు తిరుగున్ ముల్లోక సంచారిగా
    నిత్యమ్మున్ ఘటయోని వింధ్య శిఖరిన్ నిల్పంగ హ్రస్వమ్ముగా
    *భత్యం బందని కొల్వుఁ జేసినపుడే ప్రాప్తించు సత్సౌఖ్యముల్.*

    రిప్లయితొలగించండి
  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    నిత్యము సేవలనెన్నో
    సత్యముగా చేయ దైవసన్నిధి యందున్
    భృత్యుని వలె తిరుమలలో
    భత్యము లేనట్టి కొలువు వర సుఖములిడున్.

    రిప్లయితొలగించండి
  14. సత్యము పలికెడి భర్తయు
    నిత్యము మురిపెము గుప్పెడి నేర్పగు సత్సాం
    గత్యము కల్గిన గృహిణికి
    భత్యము లేనట్టి కొలువు వరసుఖము లిడున్

    రిప్లయితొలగించండి