ఆంగ్ల పాలకుల్ నోటికి యనువుగాను పెట్టి నారిండియా యను పేరు నాడు వేద సంస్కృతి విరిసిన వేద భూమి హైందవమ్ము వేళ్లూనిన యాగ భూమి హిందుదేశమున్ బిలువ రాదిండియ యని.
ఆంగ్ల పాలకుల్ పలుకుట కనువుగాను పెట్టి నారిండియా యను పేరు నాడు వేద సంస్కృతి విరిసిన వేద భూమి హైందవమ్ము వేళ్లూనిన యాగ భూమి హిందుదేశమున్ బిలువ రాదిండియ యని.
పరుడు పాలించె, తప్పుగా బలికె, నిలచె
రిప్లయితొలగించండినిండియగపేరు మనకది యేల యిపుడు
మార్చు కోవలె మనదేశ మాత పేరు
హిందూ దేశమున్ బిలువరా దిండియ యని.
త్తెంచిసంకెల, ముక్తినిదెచ్చినంత
రిప్లయితొలగించండిదాస్యమనుమాటమనసునదరికిరాదు
భావదారిద్య్రమిచ్చోటబందయగును
హిందుదేశమున్బిలువరాదిండియయని,
నోరు తిరుగనందున వారు పలికిరటుల
రిప్లయితొలగించండిఆంగ్లదేశపు యధినేత లనువునొంది,
దేశపాలన నిప్పుడు దిగ్గనాడ
హిందుదేశమున్ బిలువ రా దిండియ యని
సింధు నాగరికతతోడ హిందువైన
రిప్లయితొలగించండివారు నడయాడు దేశపు పేరు నడుగ
తెల్పియుండిరి భారతదేశమనుచు
హిందుదేశమున్ బిలువ రా దిండియ యని
సందేశాత్మకమౌ ప్రసంగములతో సంపూర్ణమౌ కాంక్షతో
తొలగించండివందేమాతరమంచు విప్లవమునే వర్ణించిరే భక్తితో
నిందింపన్ దగువారు పేరు నిడినన్ నిస్సారమౌ తీరుగన్
హిందూదేశము నిండియా యనఁగ రా దింకేల దాస్యం బిటుల్
తేటగీతి
రిప్లయితొలగించండిబానిసలుగ మనలఁ జూచి బాధపెట్టి
సంపదల దోచి మ్లేచ్చులు దుంపఁదెంచ
వైరి పెట్టిన పేరనఁ బట్టుఁ బట్టి
హిందుదేశమున్ బిలువ రా దిండియ యని!
శార్దూలవిక్రీడితము
కుందన్ జేయుచు బానిసత్వమున సంక్షోభమ్మునన్ ముంచుచున్
బొందన్ వారలు కొల్లఁగొట్టి మనలన్ మూర్ఖాళిగన్ సంపదల్
నిందల్ జేయక స్వేచ్ఛనంది యిక పై నిస్సిగ్గుగన్ బౌరులున్
హిందూదేశము నిండియా యనఁగ రా దింకేల దాస్యం బిటుల్?
ఆంగ్ల భాషను వర్జించి యాంధ్ర మందు
రిప్లయితొలగించండిదేశ మాతను బిల్చుట దివ్య మనుచు
హిందు దేశమున్ బిలువ రా దిండి య యని
మేధ గల వారు బాలుకు ట మేలు గాదె
రిప్లయితొలగించండిభారతీయుల మార్చగా బానిసలుగ
పేరు మార్చిరి మనదేశ గౌరవమును
పిన్నజేయ నాంగ్లేయులె పిలిచిరట్లు
హిందుదేశమున్ బిలువ రా దిండియ యని.
సింధూ జర్ఝరి ప్రాంతవాసులను వంచింపన్ బ్రయత్నమ్ముతో
హైందత్వమ్మను స్వాభిమానము నాయాంగ్లేయు లే ద్రుంచచున్
హిందూజాతి బరాభవంచు నెపమందీరీతి గా పిల్
హిందూదేశము నిండియా యనఁగ రా దింకేల దాస్యం బిటుల్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితెలియనేర్వక నానాడు తెల్ల దొరలు
రిప్లయితొలగించండిహిందుదేశమున్ బిలిచినా రిండియయని
భిన్న సంస్కృతులున్నను మిన్నయైన
హిందుదేశమున్ బిలువ రా దిండియ యని
తే॥ దాస్య శృంఖలములఁ ద్రెంచి తనరుచుండ
రిప్లయితొలగించండిప్రగతి పథమున ఘనముగ భరత దేశ
మునకు నాంగ్లనామంబెట్లు మోదమగును
హిందుదేశమున్ బిలువ రా దిండియ యని
మ॥ హిందూదేశము కర్మ భూమి భువిలో హింసాదులన్ ద్రుంచఁగన్
సందేశంబు నొసంగు సర్వులకు, విశ్వాధార సంస్కారమున్
హిందూతత్వము బోధఁ జేయు, ఘనమే యీదేశ యాస్తిత్వమున్
హిందూదేశము నిండియా యనఁగ రాదింకేల దాస్యంబిటుల్
తేటగీతిలో యతిదోషము సవరించానండి
వందేమాతరమంచు భారతికి నవ్యాజంపు భక్తిన్ సదా
రిప్లయితొలగించండిహిందూదేశ ప్రజాళి మ్రొక్కెదరు జైహిందంచు తామర్మిలిన్
హిందూదేశము నిండియాయనిరి నాడింగ్లీషు వారీభువిన్
హిందూదేశము నిండియా యనఁగ రా దింకేల దాస్యం బిటుల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
ఆంగ్ల పాలకుల్ నోటికి యనువుగాను
పెట్టి నారిండియా యను పేరు నాడు
వేద సంస్కృతి విరిసిన వేద భూమి
హైందవమ్ము వేళ్లూనిన యాగ భూమి
హిందుదేశమున్ బిలువ రాదిండియ యని.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
ఆంగ్ల పాలకుల్ పలుకుట కనువుగాను
పెట్టి నారిండియా యను పేరు నాడు
వేద సంస్కృతి విరిసిన వేద భూమి
హైందవమ్ము వేళ్లూనిన యాగ భూమి
హిందుదేశమున్ బిలువ రాదిండియ యని.