10, ఆగస్టు 2023, గురువారం

సమస్య - 4499

11-8-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రతి వెగటాయెను పడుచుకు రాతిరిపూటన్”
(లేదా...)
“రతి వెగటాయె నేటి కవురా జవరాలికి రాత్రి వేళలో”

20 కామెంట్‌లు:

  1. అతిశ్రద్ధగ వినుచుండిన
    దతివ యెపుడును సినిమా లితరముల సంగీ
    తతతి,వినివిని వివిధ భా
    రతి వెగటాయెను పడుచుకు రాతిరిపూటన్

    రిప్లయితొలగించండి
  2. అతలాకుతలపుబ్రతుకది
    సతతముకంప్యూటరందుసాధనసేయన్
    సతిపతులిరువురువేరుగ
    రతివెగటాయెనుపడుచుకురాతిరిపూటన్

    రిప్లయితొలగించండి
  3. మితి మీరిన కుతుకముతో
    పతి కోర్కెనుదీర్చ వడిగ పానుపు నిలుపన్
    హితమును మరచి సలిపిన వి
    రతి వెగటాయెను పడుచుకు రాతిరిపూటన్

    రిప్లయితొలగించండి
  4. పతి రాక కెదురు జూచెడు
    సతి యింటను బెద్ద పూజ జరిగి యు నాపై
    వెతపడు నామె కొసగు హా
    రతి వెగ టాయెను పడుచుకు రాతిరి పూట న్

    రిప్లయితొలగించండి
  5. అతిశయమొప్పగదొరికిన
    పతిదేవునితో సరసము భామిని కోరెన్
    తతరతి కోరికతో నప
    రతి వెగటాయెను పడుచుకు రాతిరిపూటన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సతిపతులిద్దరొక్కటిగ చక్కని రీతి పురోగమించగా
      నతులితమైన మైమరపునన్ దమలోకము మేరుపృష్ఠమై
      తతరతికోర్కెతో సుదతి తన్మయమొందుచునుండ నుపా
      రతి వెగటాయె నేటి కవురా జవరాలికి రాత్రి వేళలో

      [ఉపారతి = చాలించుట]

      తొలగించండి

  6. సతితో మాటాడడనవ
    రతమ్ము ఖాతాలు వ్రాయు ప్రాణేశుండే
    సతము పనిలో మునుగు సం
    ప్రతి వెగటాయెను పడుచుకు రాతిరిపూటన్.


    అతిచురుకైన వాడనుచు నందరు మెచ్చెడి కార్యమందు నం
    కితమగు నుత్తమోత్తముడు కీలక బాధ్యత మోయు నట్టి యా
    పతినొక వ్రాతయంత్రమని వ్యాకుల మంది గణాంకుడైన సం
    ప్రతి వెగటాయె నేటి కవురా జవరాలికి రాత్రి వేళలో.

    రిప్లయితొలగించండి
  7. సతిపతు లిరువురు సంతస
    హితముగ రాత్రిని గడప సహించని వారే
    మొ తగని హాస్యము జేసెద
    రతి వెగటాయెను పడుచుకు రాతిరిపూటన్.

    రిప్లయితొలగించండి
  8. చం.

    మితముగ తిండి పెట్టెనని మెచ్చక ప్రబ్బెను కోపగించెడిన్
    పతి గన బారవశ్యమున బాడుచు భక్తిని నిద్రలేకయున్
    స్తుతులను తాళలేక తన శ్రోతము మూసికొనంగ సేవ య
    *ప్రతి వెగటాయె నేటి కవురా జవరాలికి రాత్రి వేళలో.*

    .........అప్రతి =
    ...........సాటిలేనిది, సరిరానిది.

    రిప్లయితొలగించండి
  9. కందము
    పతిఁగూడి సలుపగా రతి
    కతిపయ దినములకు నిండు గర్భిణి యయ్యెన్
    కుతుకము తగ్గగ నకటా!
    రతి వెగటాయెను పడుచుకు రాతిరి పూటన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      రతిసుఖ పారవశ్యమున రాగసుధాంబుధి నోలలాడగా
      సతి ధరియించె గర్భమును చక్కని దేహముఁజిక్కె,చిట్టుముల్
      సతతము హెచ్చె ,మట్టిఁదిన సారెకు కాంక్షయు కల్గె ,భర్తతో
      రతి వెగటాయె నేటికవురా!జవరాలికి రాత్రివేళలో.

      తొలగించండి
  10. పతి తన విధి నిర్వహణము
    నతి శ్రద్ధగ జే యుచుండె నవిరామముగన్;
    మితమెరుగని కర్తవ్య ని
    రతి వెగటాయెను పడుచుకు రాతిరిపూటన్.

    రిప్లయితొలగించండి
  11. పతితో తాననుదినము వి
    రతి చూపక తేలియాడి రతిసౌఖ్యమునన్
    మృత శిశువునుఁ గనినపిదప
    రతి వెగటాయెను పడుచుకు రాతిరిపూటన్

    రిప్లయితొలగించండి
  12. కం॥ సతిపతులిరువురుఁ జూడఁగ
    సతతము చరవాణిఁ బడసి సఖ్యతఁ గనకన్
    బ్రతుకున సరసము మరువఁగ
    రతి వెగటాయెను బడుచుకు రాతిరి పూటన్

    రిప్లయితొలగించండి
  13. కందం
    అతి సంపాదనపరుడని
    కుతుకమ్మున వరుని నచ్చి కోరి వరింపన్
    జతపడని పతి పని నుపా
    రతి వెగటాయెను పడుచుకు రాతిరిపూటన్

    చంపకమాల
    అతిగ ధనార్జనాపరుడు నందలమెక్కిన సుందరుండనన్
    గుతుకము మీరగన్ వధువు కోరి వరింప సుఖించు నూహలన్
    జతపడ నొప్పకే కొలువు జాగరణంబుగ జేయు నా యుపా
    రతి వెగటాయె నేటి కవురా! జవరాలికి రాత్రి వేళలో!

    రిప్లయితొలగించండి
  14. చంపకమాల:
    పతి యిలువీడకన్, విడచి బాధ్యతలన్నియు, నానవీడి, జీ
    వితమున స్వర్గమన్న సరవిన్ రతికేళియె యంచు నెంచనా
    సతి మదిలో పరాఙ్ముఖత సాజముగా పతియందు నెక్కొనన్
    రతి వెగటాయె నేటి కవురా జవరాలికి రాత్రి వేళలో

    రిప్లయితొలగించండి
  15. పతి రతి కేళిలోమునిగి భాద్యత
    భారము మర్చి నిత్యమున్
    మతి గతి దప్పి కార్యములు
    మానుటచేతనురోజురోజుకున్
    గుతిలము వెర్గుచుండగని కోమలి
    కిన్ మనమందు నిప్పుడున్
    రతి వెగటాయెనేటి కవురా జవ
    రాలికి రాత్రి వేళలన్

    రిప్లయితొలగించండి


  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    సతికిన్ ధూమము గిట్టదు
    పతి రాత్రికి పూజచేయు పనిలో దివ్వెల్
    అతిగా వెలిగించగ హా
    రతి వెగటాయెను పడుచుకు రాతిరి పూటన్.

    రిప్లయితొలగించండి
  17. పతి యిల దేవుడంచు కడు భక్తిని సేవలు చేయుచుండగా
    సతి యనునిత్యమున్ విభుడు సానులసంగడి లోన మున్గ నా
    పతితునిపైన కోపమది వర్ధిల, మానవిహీను తోడుతన్
    రతి వెగటాయె నేటి కవురా జవరాలికి రాత్రి వేళలో

    రిప్లయితొలగించండి