31, ఆగస్టు 2023, గురువారం

సమస్య - 4519

1-9-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మోస మొనరించు వారలే పూజ్యజనులు”
(లేదా...)
“మోస మొనర్చువారలనె పూజ్యులుగా నుతియింతు రెల్లరున్”

16 కామెంట్‌లు:

  1. కాల మహిమచేత నిజమె కల్ల వోలె
    దోచు కల్ల నిజముగ గన్పించు చుండు
    మంచి వారి మాటకు లేదు మన్నన మరి
    మోస మొనరించు వారలే పూజ్యజనులు”

    రిప్లయితొలగించండి
  2. అపరచితుడొక డు కలిసి యంద మైన
    బరిణినిడె దన గురుతుగ, వలచి నేను
    వీటి కేగి తెరచిజూడ విషమె, దాని
    మోస మొనరించు వారలే పూజ్యజనులు

    మోసము = దొంగతనము

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    పెద్ద వారలు చెప్పరే ముద్దుగాను
    ముల్లుతోఁదీయ శక్యమౌ ముల్లునంచు
    బుద్ధి చాతుర్యమొప్పగా మోసగాండ్ర
    మోసమొనరించు వారలే పూజ్య జనులు.

    రిప్లయితొలగించండి
  4. మధుర మైనట్టి పల్కు లన్ మాయ జేసి
    సమయ సందర్బ మెరిగి య సత్య మాడి
    మెప్పు బడయుచు లోకాన మిన్న యగుచు
    మోస మొనరించు వారలే పూజ్య జనులు

    రిప్లయితొలగించండి
  5. ఓటు వేయుట కొరకంచు నోటు పొంది
    సజ్జనుల విశ్వసింపని చవట లున్న
    స్వార్థ పరులె నేతలుగ జనుల నిలను
    మోస మొనరించు వారలే పూజ్యజనులు.



    బాసలు జేయనేమి పురవాసులె యోటును వేయు పాళమున్
    వాసిగ గోరుచుంద్రు పరిబర్హము మద్యము, బర్బకుండ్రకున్
    చే సిన బంధనమ్ములును చెప్పినమాటల విస్మరించుచున్
    మోస మొనర్చువారలనె పూజ్యులుగా నుతియింతు రెల్లరున్.

    రిప్లయితొలగించండి
  6. తే॥ కాలమహిమను గపటులు గౌరవమును
    సాధు జనులగౌరవమును సంతరించు
    కొనఁగ విలువ యధికమాయె కుత్సితులకు
    మోస మొనరించు వారలే పూజ్యజనులు

    ఉ॥ ఆసలఁ బెంచు కుత్సితుల నందరు నమ్ముచు గౌరవించినన్
    బాసలఁ జేయు నాయకుల పల్కుల మాయకు ముగ్ధులై చనన్
    వేసము బాసకున్ విలువ వేగిర మిచ్చు సమాజమందునన్
    మోస మొనర్చు వారలనె పూజ్యలుగా నుతియింతు రెల్లరున్

    రిప్లయితొలగించండి
  7. వంచన దృఢమై వర్ధిల్లు వసుధ పైన
    మోసమగుణముకాదని పురుషవరుడు
    తాను తెల్పె మోహిని యవతారమెత్తి
    మోస మొనరించు వారలే పూజ్యజనులు

    మోసముసేయనెంచి తను మోహినిగా నవతారమెత్తెగా
    మోసమవశ్యమేననుచు పుష్కర నాభుడు తెల్పకుండెనా
    మోసము సేయకుండినను మోక్షమనిశ్చయమేకదా సదా
    మోస మొనర్చువారలనె పూజ్యులుగా నుతియింతు రెల్లరున్

    రిప్లయితొలగించండి
  8. మంచితనమును నటియించు వంచకులను
    పూజనీయులుగఁ దలచు రోజులివియె
    గొర్రె సౌనికుఁ తగనమ్ముఁ గువలయమున
    మోస మొనరించు వారలే పూజ్యజనులు

    రిప్లయితొలగించండి
  9. వేసము జూచి కొందరవివేకముతో ఖలుఁ దొడ్డవానిగా
    జేసి గణింతురాతనిని శ్రేయముఁ గూర్చెడు సద్గుణుండుగా
    వాసిగ గొర్రె సౌనికుని బందువుగా నెర నమ్మినట్టులన్
    మోస మొనర్చువారలనె పూజ్యులుగా నుతియింతు రెల్లరున్

    రిప్లయితొలగించండి
  10. కాసులు బంచి యెన్నికల కాలము
    నందున వోట్లకోసమై
    చేసియు కేలుమోడ్పులును సేవ
    యొనర్చెదమంచుజెప్పియున్
    దాసులరీతి జూచుదురు తథ్యము
    గెల్చిన నేతలిద్ధరన్
    మోసమొనర్చు వారలనె పూజ్యులుగా
    నుతియింతురందరనున్.

    రిప్లయితొలగించండి
  11. అగ్రపూజ గైకొను శ్రీకృష్ణ పరమాత్మను నిందలాడుచు శిశుపాలుడు:

    తేటగీతి
    వేసములనెన్నొ వేసెడు విద్యలబ్బ
    నూసులన్ గోపికలఁ దేల్చు యుక్తిశాలి
    నాదు రుక్మిణిన్ దొంగిలి నటనమాడు
    మోస మొనరించు వారలే పూజ్యజనులు

    ఉత్పలమాల
    వేసములెన్నొ వేయఁగల విద్యలు దెల్సియు రాసలీలలం
    దూసుల గోపికల్ మురియ నుక్తులఁ బన్నెడు గోడె కాడు న
    న్నాసల ముంచి రుక్మిణిని నాదటవోవఁగ జేసినట్టి యీ
    మోస మొనర్చువారలనె పూజ్యులుగా నుతియింతు రెల్లరున్!

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఓటు కొఱకు నెన్నికలలో నోటు నిచ్చి
    గెలువగ పలు పురస్కారములిడె జనులు
    మునుపు నిచ్చిన వాగ్దానములను మరువ
    ప్రజలు నేతల ప్రాపుకై ప్రాకులాడె
    మోసమొనరించు వారలె పూజ్య జనులు!

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ఓటు కొఱకు నెన్నికలలో నోటు నిచ్చి
    గెలువగ పలు పురస్కారములిడె జనులు
    మునుపు నిచ్చిన వాగ్దానములను మరచి
    నను, ప్రజలు లబ్ధి పొందగ నాయకులను
    సత్కరించుచు ప్రాపుకై జతనపడిరి
    మోసమొనరించు వారలె పూజ్య జనులు!

    రిప్లయితొలగించండి