4, ఆగస్టు 2023, శుక్రవారం

సమస్య - 4494

5-8-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నరుఁడు దేరుఁ ద్రిప్పఁగనె యుత్తరుఁడు దిట్టె”
(లేదా...)
“తిట్టె విరాటరాట్సుతుఁడు దేరు మరల్చుటచే బృహన్నలన్”

11 కామెంట్‌లు:

  1. కరుడు గట్టిన సైన్యము గని బెదరెను
    పారిపోవ దొడగె దిగి పరుగు బెట్టె
    వెంటబడి రథమెక్కించె వీరుడపుడు
    నరుఁడు దేరుఁ ద్రిప్పఁగనె యుత్తరుఁడు దిట్టె”

    రిప్లయితొలగించండి
  2. కలనకెదురొడ్డినిలువగ కాని పనియ
    తనువుకాపాడుకొనుటయతప్పుగాదు
    ననియె భీరుండుతానయై నయముదప్పి
    నరుఁడుదేరుద్రిప్పగనె యుత్తరమును దిట్టె

    రిప్లయితొలగించండి
  3. సైన్యమును గాంచి నంతనె
    చకితు డ గుచు
    పరుగిడు చు నున్న వానిని పట్టి తెచ్చి
    రథము నందున నిడుకొని రయము గాగ
    నరుదు దేరు ద్రిప్ప గనె యుత్తరుడు దిట్టె

    రిప్లయితొలగించండి
  4. గోవులన్నిటి గాపాడు కొనుటకొరకు
    కలనుసలుప నాయుధములు గావలెగద
    పొరుగునగల వాటిని దాను పొందుటకయి
    నరుఁడు దేరుఁ ద్రిప్పఁగనె యుత్తరుఁడు దిట్టె

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    ఆద్యుడుగ నుత్తరకుమారుఁడనికి కదలి
    సారధిగ బృహన్నల కురు సైన్యమెంచ
    వడకఁగన్ సమయస్ఫూర్తిఁ బార్థుఁడగుచు
    నరుఁడు, దేరుఁ ద్రిప్పగనెయుత్తరుఁడు, దిట్టె!


    ఉత్పలమాల
    దిట్టలు ద్రోణ భీష్ముల ప్రతిష్టను దెల్పఁగ జూచి వైరులన్
    బట్టిన చెమ్మటల్ భయము వాటిగ జూపిన కౌరవాళితో
    బెట్టుగ యుద్ధమున్ సలుప వేగము ముందుకు సాగబోయునన్
    తిట్టె విరాటరాట్సుతుఁడు దేరు మరల్చుటచే బృహన్నలన్

    రిప్లయితొలగించండి
  6. బెట్టుగ మాటనైనవినవేల బృహన్నల తేరునాపుమా
    కట్టెదుటన్ గనంబడెడు కౌరవసేన మహార్ణవంబు వై
    పిట్టుల క్రమ్మఱించెదవ దేటికి తేరునటంచు గట్టిగా
    తిట్టె విరాటరాట్సుతుఁడు దేరు మరల్చుటచే బృహన్నలన్

    రిప్లయితొలగించండి

  7. శత్రు సేనల దునుమాడ సమర మందు
    తాను రథిగను మారక తప్పదనుచు
    నాయుధమ్ములు దాచిన యగము కడకు
    నరుఁడు దేరుఁ ద్రిప్పఁగనె యుత్తరుఁడు దిట్టె.


    బెట్టుగ పల్కి యుత్తరుడు వీరుల గాంచుచు భీతి చెందగా
    జెట్టిని తానటంచెఱుక సేయక గాండివ మున్నట్టి యా
    చెట్టును చేరగా దలచి జిష్ణువు దారిమరల్చు పాళమున్
    దిట్టె విరాటరాట్సుతుఁడు దేరు మరల్చుటచే బృహన్నలన్.

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    స్పృహను గోల్పోయి యున్నట్టి సేనఁజేరి
    కోసికొని వచ్చెతలపాగ కుచ్చులౌర!
    నరుఁడు దేరు ద్రిప్పఁగనె;యుత్తరుఁడు దిట్టె
    పేరు పేరున బేర్కొని కౌరవులను.

    రిప్లయితొలగించండి
  9. కౌరవ పటాలమునుగని కలతజెంది
    రథము విడనాడె రయమున రాకొమరుడు
    భయము నొందిన వానిని పట్టితెచ్చి
    నరుఁడు దేరుఁ ద్రిప్పఁగనె యుత్తరుఁడు దిట్టె

    పుట్టినకొంకుపాటు తనపోకడమార్చగ తొందరించుచున్
    బట్టినపట్టు పోవిడిచి వైరుల జూచిపరిక్రమించగా
    కట్టడిచేసి దందడికి కాలిడు సారథినిన్ విశంకతో
    తిట్టె విరాటరాట్సుతుఁడు దేరు మరల్చుటచే బృహన్నలన్

    రిప్లయితొలగించండి
  10. కనఁగ కౌరవ వీరులఁ గనుల ముందు
    వడఁకె నుత్తరునకు మేను భయము హెచ్చె
    యెంతవేడినను వినక సుంతయేని
    నరుఁడు దేరుఁ ద్రిప్పఁగనె యుత్తరుఁడు దిట్టె

    రిప్లయితొలగించండి
  11. తే॥ భయము తోడను రయమున పరుగు లిడఁగ
    నుత్తరుఁడు కౌరవులఁగని యుత్తమమని
    పట్టి తెచ్చి యతని త్రోల చెట్టు వరకు
    నరుఁడు దేరుఁ ద్రిప్పఁగనె యుత్తరుఁడు దిట్టె

    ఉ॥ గుట్టుగఁ దేరుఁ ద్రిప్పమని కోరినఁ ద్రిప్పడటంచు భీతితోఁ
    దిట్టె విరాటరాట్సుతుఁడు, దేరు మరల్చుటచే బృహన్నలన్
    బట్టె విరాటరాట్సుతుఁడు పార్థుఁడితండని చెట్టుఁ జేరఁగన్
    గట్టిగఁ బోరు వీరుఁడని కౌరవ సేనల గెల్చు వాఁడనిన్

    రిప్లయితొలగించండి