11, ఆగస్టు 2023, శుక్రవారం

సమస్య - 4500

12-8-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కనకదుర్గ! ఖలులఁ గాచుమమ్మ”
(లేదా...)
“ఖలులం గాచుము సత్కృపన్ గనకదుర్గా నీకు దండం బిదే”

13 కామెంట్‌లు:

  1. ఖడ్గమెత్తవమ్మ! కాళివైదండించు
    కనకదుర్గ! ఖలుల,, గాచుమమ్మ
    ధర్మపరులమదినిధైర్యంబునింపుచు
    తల్లి! కరుణజూడుతనయునెపుడు

    రిప్లయితొలగించండి
  2. విజయవాడ నందు వెలసిన యోయమ్మ
    పురమున గల జనులు మూర్ఖులమ్మ
    మంచి జెడుల గూర్చి మతిలేని వారమ్న
    కనకదుర్గ! ఖలులఁ గాచుమమ్మ

    రిప్లయితొలగించండి
  3. బ్రదుకు కర్థ మేమొ, ప్రాణము విలువేమొ
    యెరుగనట్టి దుష్ట నరులకు బుద్ధి గరిపి
    జ్ఞాన మొసగివారి జాతక ములమార్చి
    కనక దుర్గ ఖలుల గాచు మమ్మ!

    రిప్లయితొలగించండి
  4. ఆటవెలది
    అవని నసురులెగయ నవదుర్గలుగ మారి
    యంత మంద జేయ నాదిశక్తి!
    శిష్ట జనులు మ్రొక్క, శివమెత్తి దునుమాడి
    కనకదుర్గ! ఖలులఁ, గాచుమమ్మ!

    మత్తేభవిక్రీడితము
    ఇలలో దుష్టుల గూల్చెడున్ గతన నీవెన్నెన్ని రూపమ్ములన్
    గొలువై గాంచితె లోకమెల్ల శుభముల్ కొండంత దైవమ్మనన్
    శిలవై నిల్చితి వేల? శిష్టజన మర్చింపంగ రా!, ద్రుంచుచున్
    ఖలులం, గాచుము సత్కృపన్ గనకదుర్గా! నీకు దండం బిదే

    రిప్లయితొలగించండి
  5. రూపు మాపు మమ్మ రోషమ్ము తో నీవు
    కనక దుర్గ ఖలుల::గాచు మమ్మ
    భక్తి కలిగి నిన్ను భజియించు వారల
    కష్ట ములను బాపి కరుణ తోడ

    రిప్లయితొలగించండి
  6. ఆటవెలది
    దుష్ట శిక్షణంబు శిష్ట రక్షణమును
    చేయుటకును వచ్చి చేతనున్న
    కత్తి తోడ నరకి"కనకదుర్గ! ఖలులఁ;
    గాచుమమ్మ"మమ్ము కరుణతోడ .

    రిప్లయితొలగించండి

  7. నీచులైన నేమి నీదుబిడ్డలె గాదె
    జీవకోటి కిలను శ్రేయ మొసగ
    మమత తోడ సుతుల మన్నించి కరుణతో
    కనకదుర్గ! ఖలులఁ గాచుమమ్మ.


    అలనాడా మహిషాసురున్ దునుమ నీవారూప మున్ బొంది నీ
    విలలో ధర్మము నిల్పినావు నిజమే యీశాని నీవిప్పుడున్
    మలయమ్మా యని కొల్చు వారలగు సన్మార్గుండ్ర , శిక్షించుచున్
    ఖలులం, గాచుము సత్కృపన్ గనకదుర్గా నీకు దండం బిదే.

    రిప్లయితొలగించండి
  8. సర్వజనుల మేలు సర్వదాకాపాడ
    దుష్టజనులఁ దునుము దుర్గవమ్మ
    భక్తజనులనెల్ల భద్రతన్, నుగ్గాడి
    కనకదుర్గ! ఖలులఁ, గాచుమమ్మ

    అలనాడే తులువన్ వధించుటకునై యావిర్భమున్ జెందగా
    కలుషాత్మున్ దునుమంగ శాంతి నిలచెన్ గల్లోలమేబాయగా
    విలసత్కంకణమున్ ధరించి జనులన్, విచ్చిత్తి గావించుచున్
    ఖలులం, గాచుము సత్కృపన్ గనకదుర్గా నీకు దండం బిదే

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె.॥
    ఉత్తమగుణుఁడైన నులిపిగొట్టయినను
    నీదు బిడ్డలేను నిజముగాను
    కరుణజూపినంత ఖలుఁడు సద్గుణుఁడగు
    కనకదుర్గ! ఖలులఁ గాచుమమ్మ

    మత్తేభము:
    ఇలలో నెల్లరు నీదు బిడ్డలుగదా యీశాని! దాక్షాయణీ!
    కలిలో మాయకు లోనుకాబడుచు దుష్కర్మాను సారమ్మునన్
    ఖలులైరీ భువియందు నీ సుతులు, సత్కర్మంబులం ద్రిప్పి యా
    ఖలులం గాచుము సత్కృపన్ గనకదుర్గా నీకు దండం బిదే

    రిప్లయితొలగించండి
  10. ఇలపై స్వార్థముతో ప్రజాచయములన్ హించించుచున్ వారి యా
    స్తులఁ గాజేయుచు నిత్యమున్ నరకమున్ జూపించు నన్యాయకా
    రులు పేట్రేగుచు నుండ్రి, సాధువుల, నిర్మూలించి శీఘ్రమ్ముగా
    ఖలులం, గాచుము సత్కృపన్ గనకదుర్గా నీకు దండం బిదే

    రిప్లయితొలగించండి
  11. ఆ॥ సర్వులిలను నీదు సంతతి గద మాత
    ఖలుల బుద్ధి మార్చు కనకదుర్గ
    జగము వెలయ జనులు సన్మార్గముఁ బడసి
    కనకదుర్గ ఖలులఁ గాచుమమ్మ

    మ॥ కలికాలమ్మున దుష్టులే యధికులై కారుణ్యమే తక్కువై
    యిలలో ధర్మము దారిఁ దప్పఁగను నీవీరీతిగా మౌనివై
    నిలువంగా భవిలోన సజ్జనులు హానిన్ బొందరా త్రుంచుమా
    ఖలులం, గాచుము సత్కృపన్ గనక దుర్గా నీకు దండం బిదే!

    రిప్లయితొలగించండి
  12. ఇలలో క్రూరుల దుర్జనావళిని
    నీవే సంహరించీభువిన్
    కలకాలమ్మును గాచినట్లు జననీ
    సామాన్యులన్నెప్పుడున్
    వలనొప్పన్ కరుణించి
    యెల్లపుడు సద్భావంబుతో నేడు ని
    ష్ఖలులంగాంచుము సత్కృపన్
    కనకదుర్గా నీకు దండంబిదే .

    రిప్లయితొలగించండి