24-8-2023 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్”(లేదా...)“ముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో సమస్య)
-అనఘా! మధురము రామాయణగాధ! మది పులకించె నానందముతోడనురాగమొప్ప శ్రీరాముని కౌగిట సీత వ్రాలి పొందెను సుఖమున్జిలేబీయము
కం:మునివెంట మిథిల కేగెనుధనువును పైకెత్తి ద్రుంచె దశరథ సుతుడున్,మనువా డినదై శ్రీరాముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
తన పావనమెరుకపరచజనక కొమరి దూకె నగ్ని జ్వలనము నందున్ననలుడు విడ నినకుల సోముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
ముని వెంటన్ మిథి లకు జనిధనువును భంగమును జేసి దర్పము తోడన్మునువాడి నట్టి శ్రీరాముని కౌగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
వనిలో నున్నను వదలకననయము వెంబడి తిరుగుచు నానందముతోమనమునతమిహెచ్చగ రా*“ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్”*
జనవంద్యుడు కౌసల్యాయని దనుజాంతకుడు సద్గుణాంబుధి సోముండినకుల తిలకుడు రఘురాముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్.మునిగణ వంద్యుడౌ పరమ పూజ్యుడు సద్గుణ సాంద్రుడాతడే దనుజ వినాశకుండు భువి ధర్మము నిల్పగ నెంచు దీక్షతో జననము నెత్తినట్టి దనుజ ద్విషుడైన నరోత్త ముండు రాముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో.
ధనువును విరిచిన వీరుడుమనసును దోచిన పురుషుడు మానసమున కాముని తలపుకు తెచ్చెడి రాముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
ధనువును త్రుంచి రాఘవుడు తాగొనె జానకినగ్నిసాక్షిగాతనువున రేగుపుల్కలకు తన్మయమొందిన ధర్మపత్నిగామనసుకు చేరువైన పతి మన్మథ రూపుని చెంతజేరి రా ముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో
వనమున వెన్నెల రేయినితన మనమున పతినిఁ గూడ తహతహ హెచ్చన్మునిజన వందితుఁడగు రాముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
వనమున వెన్నెలల్ విరిసి పార్థివి కన్నుల వెల్గు నింపనెమ్మనమున వేయి వేణువులు మంగళ గీతము లాలపించగామునిజన వందితుండు నవమోహనరూప విరాజితుండు రాముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో
కందంమనలేవని కారడవులవనవాసమునకు వలదన పతి దేవుండున్వెనువెంటఁ జని విడక రాముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్చంపకమాలనన తనువంచు భామఁగని నాథుడు రావలదంచునన్న మిమ్మనయము వీడనంచు గహనాంతరవాసము సేయనొప్పి తాననుగమనమ్మునెంచి బుధులందరు మెచ్చుకొనంగ సాగి, రాముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో
కనికరమించుకలేకనువినగాయాగముసలుపుటవింతగఁదోచెన్అనుచునువాల్మీకియనగమునికౌగిటసీతవ్రాలిపొందెనుసుఖమున్
వనిలో నున్నను వదలకననయము వెంబడి తిరుగుచు నానందముతోమనమునతమిహెచ్చగ రా*“ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్”*[మునిగణ సేవితుండు నతిపూజ్యుడు మాన్య చరిత్రు చెంతతాననయముసంచరించుచునుహాయినిబొందుచునవ్వనిన్ సదామునిజనమానసుండయినభూరిగుణోన్నతుడౌమనోభిరామునిపరిరంభసౌఖ్యమునుబొందెనుజానకిపర్ణశాలలో.
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. వనవాసమైన తదుపరిమనుగడ సాగించ రాజమందిర మందున్ ఇనకుల వంశోద్భవ రాముని కౌగిట సీత వ్రాలి పొందెను సుఖమున్.
కం॥ వినఁగ రఘుపతి చరితమునుమనమున హాయినిఁ గనెదము మరిమరి భువిలోఘనముగఁ బెండ్లి జరుగ రా ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్ చం॥ అనిశముఁ దల్చు రామునిని యక్కున జేరి తరించు టొప్పుచున్ వినయముఁ జూపి సేవలను బ్రేమము మీరఁగ జేయు సర్వదాఘనముగ గౌరవించు తన కాంతుని రాఘవుఁ గొల్చు చుండు రాముని పరిభంగ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో
వనమున కేగమంచు నరపాలుడు పుత్రుని, కోర, వెంటనేచనియెను తమ్ముడున్ సతియు సాగగ కానకు రాము డిచ్చతోవినయముగా సహోదరుడు వేగ రచింపగ నొక్క పాక రాముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో
-
రిప్లయితొలగించండిఅనఘా! మధురము రామా
యణగాధ! మది పులకించె నానందముతో
డనురాగమొప్ప శ్రీరా
ముని కౌగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
జిలేబీయము
రిప్లయితొలగించండికం:
మునివెంట మిథిల కేగెను
ధనువును పైకెత్తి ద్రుంచె దశరథ సుతుడున్,
మనువా డినదై శ్రీరా
ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
తన పావనమెరుకపరచ
రిప్లయితొలగించండిజనక కొమరి దూకె నగ్ని జ్వలనము నందున్
ననలుడు విడ నినకుల సో
ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
ముని వెంటన్ మిథి లకు జని
రిప్లయితొలగించండిధనువును భంగమును జేసి దర్పము తోడన్
మునువాడి నట్టి శ్రీరా
ముని కౌగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
వనిలో నున్నను వదలక
రిప్లయితొలగించండిననయము వెంబడి తిరుగుచు నానందముతో
మనమునతమిహెచ్చగ రా
*“ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్”*
జనవంద్యుడు కౌసల్యా
రిప్లయితొలగించండియని దనుజాంతకుడు సద్గుణాంబుధి సోముం
డినకుల తిలకుడు రఘురా
ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్.
మునిగణ వంద్యుడౌ పరమ పూజ్యుడు సద్గుణ సాంద్రుడాతడే
దనుజ వినాశకుండు భువి ధర్మము నిల్పగ నెంచు దీక్షతో
జననము నెత్తినట్టి దనుజ ద్విషుడైన నరోత్త ముండు రా
ముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో.
ధనువును విరిచిన వీరుడు
రిప్లయితొలగించండిమనసును దోచిన పురుషుడు మానసమున కా
ముని తలపుకు తెచ్చెడి రా
ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
ధనువును త్రుంచి రాఘవుడు తాగొనె జానకినగ్నిసాక్షిగా
తొలగించండితనువున రేగుపుల్కలకు తన్మయమొందిన ధర్మపత్నిగా
మనసుకు చేరువైన పతి మన్మథ రూపుని చెంతజేరి రా
ముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో
వనమున వెన్నెల రేయిని
రిప్లయితొలగించండితన మనమున పతినిఁ గూడ తహతహ హెచ్చన్
మునిజన వందితుఁడగు రా
ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
వనమున వెన్నెలల్ విరిసి పార్థివి కన్నుల వెల్గు నింపనె
రిప్లయితొలగించండిమ్మనమున వేయి వేణువులు మంగళ గీతము లాలపించగా
మునిజన వందితుండు నవమోహనరూప విరాజితుండు రా
ముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో
కందం
రిప్లయితొలగించండిమనలేవని కారడవుల
వనవాసమునకు వలదన పతి దేవుండున్
వెనువెంటఁ జని విడక రా
ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
చంపకమాల
నన తనువంచు భామఁగని నాథుడు రావలదంచునన్న మి
మ్మనయము వీడనంచు గహనాంతరవాసము సేయనొప్పి తా
ననుగమనమ్మునెంచి బుధులందరు మెచ్చుకొనంగ సాగి, రా
ముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో
కనికరమించుకలేకను
రిప్లయితొలగించండివినగాయాగముసలుపుటవింతగఁదోచెన్
అనుచునువాల్మీకియనగ
మునికౌగిటసీతవ్రాలిపొందెనుసుఖమున్
వనిలో నున్నను వదలక
రిప్లయితొలగించండిననయము వెంబడి తిరుగుచు నానందముతో
మనమునతమిహెచ్చగ రా
*“ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్”*
[
మునిగణ సేవితుండు నతిపూజ్యుడు మాన్య చరిత్రు చెంతతా
ననయముసంచరించుచునుహాయినిబొందుచునవ్వనిన్ సదా
మునిజనమానసుండయినభూరిగుణోన్నతుడౌమనోభిరా
మునిపరిరంభసౌఖ్యమునుబొందెనుజానకిపర్ణశాలలో.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
వనవాసమైన తదుపరి
మనుగడ సాగించ రాజమందిర మందున్
ఇనకుల వంశోద్భవ రా
ముని కౌగిట సీత వ్రాలి పొందెను సుఖమున్.
కం॥ వినఁగ రఘుపతి చరితమును
రిప్లయితొలగించండిమనమున హాయినిఁ గనెదము మరిమరి భువిలో
ఘనముగఁ బెండ్లి జరుగ రా
ముని కౌఁగిట సీత వ్రాలి పొందెను సుఖమున్
చం॥ అనిశముఁ దల్చు రామునిని యక్కున జేరి తరించు టొప్పుచున్
వినయముఁ జూపి సేవలను బ్రేమము మీరఁగ జేయు సర్వదా
ఘనముగ గౌరవించు తన కాంతుని రాఘవుఁ గొల్చు చుండు రా
ముని పరిభంగ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో
వనమున కేగమంచు నరపాలుడు పుత్రుని, కోర, వెంటనే
రిప్లయితొలగించండిచనియెను తమ్ముడున్ సతియు సాగగ కానకు రాము డిచ్చతో
వినయముగా సహోదరుడు వేగ రచింపగ నొక్క పాక రా
ముని పరిరంభ సౌఖ్యమును బొందెను జానకి పర్ణశాలలో