28, ఆగస్టు 2023, సోమవారం

సమస్య - 4517

29-8-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పట్టెఁ జరవాణిఁ బుస్తకపాణి గనుఁడు”
(లేదా...)
“పుస్తకపాణి హస్తమున భూషణమై చరవాణి యొప్పెడిన్”

15 కామెంట్‌లు:

 1. ఎట్టి వారలైన జదివి గట్టి వారు,
  పెట్టి పుట్టిన వారైన, పట్ట వలసి
  నట్టి కాలము తనచేత చిట్టి ఫోను
  పట్టెఁ జరవాణిఁ బుస్తకపాణి గనుఁడు

  రిప్లయితొలగించండి
 2. గూగులమ్మయుజెప్పుగా ఘోష నంత
  సారసమ్మిశ్రవార్తలుసరళరీతి
  వింతలెన్నియొజూపుగావిజ్ఞులకును
  పట్టెచరవాణిపుస్తకపాణిగనుడు

  రిప్లయితొలగించండి
 3. తేటగీతి
  శిల్ప చాతురి మీఱగా శిల్పి యొకఁడు
  క్రొత్తఁదనముట్టిపడునట్లు కొంత మార్చి
  చెక్కె శిల్పంబు నౌరౌర!చేతియందు
  పట్టెఁజరవాణి;పుస్తకపాణిఁగనుడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఉత్పలమాల
   నిస్తులమైన యంత్రమిది నేర్పుగ దీనిని వాడుకొన్నచో
   ప్రస్తుత కాలమందు బహుళంపు ప్రయోజనమున్నదౌర!యో
   పుస్తకపాణి!హస్తమున భూషణమై చరవాణి యొప్పెడిన్
   వాస్తవమిద్ది నీవలెనె వాసిని గాంచె దిగంతరాళమున్.

   తొలగించండి
 4. ఉ.

  మస్తక మందు డాకొలుపు మాత సరస్వతి వేఁడుకోలుచే
  హస్తమునందు భూషణము హావము భావములిచ్చు వాణి యే
  *పుస్తకపాణి; హస్తమున భూషణమై చరవాణి యొప్పెడిన్*
  దుస్తరలక్షణమ్ము నిల దుర్వ్యసనమ్ముయు గాసిచేయునే.

  రిప్లయితొలగించండి
 5. సకల విషయాలమూలమై సంత రించి
  సర్వ జనులను మురిపించి పర్వు నట్టి
  ఆధునికపు సాంకేతిక సాధనమును
  పట్టె చరవాణి పుస్తక పాణి గనుము

  రిప్లయితొలగించండి
 6. ఉ॥ మస్తుగ విస్తరించఁగను మానవ విజ్ఞత శాస్త్ర శోధనన్
  మస్తక పుస్తకమ్ములను మానిరి వాడుట నేఁడు మానవుల్
  విస్తరమైన విజ్ఞతను వేగముగాఁ జరవాణి పంచఁగన్
  బుస్తకపాణి హస్తమున భూషణమై చరవాణి యొప్పెడిన్

  రిప్లయితొలగించండి

 7. పిడికెడు పరిమాణమ్మున వెలసి యదియె
  వశ్వమంతను చూపించి విమల మతుల
  మనసు గెలిచెను కాననీ మహిని నేడు
  పట్టెఁ జరవాణిఁ బుస్తకపాణి గనుఁడు.


  పుస్తక మెందుకింకనది మూర్ఖులకే సరి నేడు గాంచగా
  హస్తము నందిముడ్చు కొనెడద్భుత వస్తువె భూమి జేరుచున్
  విస్తృత మైన విర్తలు వింతలు విజ్ఞత నందజేయగా
  పుస్తకపాణి హస్తమున భూషణమై చరవాణి యొప్పెడిన్.

  రిప్లయితొలగించండి
 8. అవసరములు పెరిగి మిన్నునంటు వేళ
  సకలము నయించి మాటాడ, చదువ ,వినగ
  నెలవయిన చిన్ని యస్త్రము నెరిగ జేత
  బట్టెఁ జరవాణిఁ బుస్తకపాణి గనుఁడు

  రిప్లయితొలగించండి
 9. కూడియొకచోట భక్తులు కోర్కె తోడ
  పలుకు తొయ్యలి పూజను సలుపు వేళ
  జనసమూహము కెల్ల విజ్ఞానమంతు
  పట్టెఁ జరవాణిఁ బుస్తకపాణి గనుఁడు

  రిప్లయితొలగించండి
 10. తే॥ జ్ఞాన సంపదఁ జరవాణి జనుల కెల్ల
  పంచ సులభముగ మిగుల భవ్యముగను
  భువిని యరచేతి యందున భూరి గాను
  బట్టెఁ జరవాణిఁ బుస్తకపాణి గనఁడు

  రిప్లయితొలగించండి
 11. తేటగీతి
  రూపమే లేని దైవమున్ జూపనెంచి
  తనదుపోలికలద్దెను మనుజుఁడనఁగఁ
  బుస్తకమ్మును మఱచిన బుద్ధి మలచ
  పట్టెఁ జరవాణిఁ బుస్తకపాణి గనుఁడు!

  ఉత్పలమాల
  హస్తమునందు భూషణమటంచును దల్చియు నాడు వాణినిన్
  బుస్తకపాణిగన్ మలచి పూజలు సేయఁగ, నేటి పోకడన్
  వాస్తవరూపకల్పనల పాటవమద్దఁగ చిత్రకారుఁడున్
  పుస్తకపాణి హస్తమున భూషణమై చరవాణి యొప్పెడిన్

  రిప్లయితొలగించండి
 12. తేటగీతి:
  మస్తకమునకు పదునిడి పుస్తకమ్ము
  హస్తభూషయై యమరె నాడందరికిని
  కాలగతి యందు నేడది కలిసిపోయి
  పట్టెఁ జరవాణిఁ బుస్తకపాణి గనుఁడు

  ఉత్పలమాల:
  పుస్తకమన్న హస్తమున భూషణమై యలనాడు నిక్కమౌ
  నేస్తముగా మనోజ్ఞముగ నిస్తుల చేతన సాధనంబుగా
  మస్తకమందు నింపెడిది మంజుల భావన, నేడదేలనో
  పుస్తకపాణి హస్తమున భూషణమై చరవాణి యొప్పెడిన్

  రిప్లయితొలగించండి

 13. పిన్నక నాగేశ్వరరావు.
  హనుమకొండ.

  శాస్త్ర సాంకేతికత తోడ జ్ఞానమంత
  చిన్న పెట్టెలో నిక్షేపించి యవసరము
  కలుగ బయటకు తీసి మరల చదివెడు
  వీలు గలిగినపుడు పుస్తకాలతోడ
  నేమి పనియుండు నరచేత నిమిడియుండ
  పట్టెఁ జరవాణిఁ బుస్తకపాణి గనుడు.

  రిప్లయితొలగించండి