6, ఆగస్టు 2023, ఆదివారం

సమస్య - 4496

7-8-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రామకథను జింతాకుపై వ్రాయఁ దగును”
(లేదా...)
“శ్రీరామాయణగాథ వ్రాయఁగఁ దగున్ జింతాకుపైఁ బూర్తిగన్”

15 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. సాధుజీవులుశోకంబుసైచువిధము
    కార్యసాధనపరమాత్ముగాంచురీతి
    జీవయానంబునిదియనిచెప్పునట్టు
    రామకథనుచితాకుపైవ్రయదగును

    రిప్లయితొలగించండి
  3. భక్తిగ నతడు జింతాకు పతకమొకటి
    చేసి రాముని కొసగగ చెరను బడిన
    రామదాసు గుర్తింపుగ , రమ్య మైన
    రామకథను జింతాకుపై వ్రాయఁ దగును

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    ఏడు కాండల సారంబు హృద్యముగను
    మూడు ముక్కలఁజెప్పిరి మోదమలర
    కట్టె,కొట్టె,తెచ్చెనటంచు ఘంటముఁగొని
    రామ కథను జింతాకుపై వ్రాయదగును.

    రిప్లయితొలగించండి

  5. పూర్వులు వచించి రనుచును మూడు ముక్క
    లందు కట్టె కొట్టెను తెచ్చె ననుచు నతిశ
    యమ్మున పలికె సుతునితో నప్ప యిట్లు
    రామకథను జింతాకుపై వ్రాయఁ దగును.



    ఏరా మూర్ఖుడ చాలుచాలికను నీవీరీతిగా వాగుటే
    పారావారము బోలునట్టి చరితన్ పారాయణన్ సల్పగా
    వారమ్మైనను చాలదంచు వచియింపన్ వింటినే యెవ్విధిన్
    శ్రీరామాయణగాథ వ్రాయఁగఁ దగున్ జింతాకుపైఁ బూర్తిగన్ ?

    రిప్లయితొలగించండి
  6. సూక్ష్మ చిత్రకళాకార్లు చూపిరిగద
    అద్భుతంబగు ప్రతిభాసమగుపరచుచు
    గంటమనుకూలమైనచో నాలుగక్షరములు
    'రామకథ'ను జింతాకుపై వ్రాయఁ దగును

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సారాంశమ్మునెఱింగి చెప్పు కథయే సంపూర్ణమై చక్కగా
      ధారావాహికమైన రామ పథమే తత్వమ్ము బోధింపగా
      శ్రీరామాయను ఘోష నిండు మనసే చింతాకు గానొప్పగా
      శ్రీరామాయణగాథ వ్రాయఁగఁ దగున్ జింతాకుపైఁ బూర్తిగన్

      తొలగించండి
  7. కట్టె సేతువు, కొట్టె లంకాధిపతిని,
    తెచ్చె సీతనందురు కొలది పలుకులను
    కట్టె,కొట్టె, తెచ్చెననెడి చిట్టి కధగ
    రామకథను చింతాకుపై వ్రాయ దగును.

    రిప్లయితొలగించండి
  8. మూడుముక్కలు చాలును ముచ్చటగను
    కట్టె కొట్టెను తెచ్చెను కలికి సీత
    ననుచు క్లుప్తముగాదెల్ప, నందమైన
    రామకథను జింతాకుపై వ్రాయఁ దగును

    రిప్లయితొలగించండి
  9. మంచి నైపుణ్య మును గల్గు మానవుండు
    దేని నైనను సాధించి తీరు ననగ
    సూక్ష్మ లిపి చేత వ్రాయు ట చోద్య. మటులె
    రామ కథను చింతాకు పై వ్రాయ దగును

    రిప్లయితొలగించండి
  10. శ్రీరామాయణమందు రాఘవుడు నిర్జించంగ తా రావణున్
    వారాశిన్తరియించి కట్టెనుగదా పాథోధిపై శేతువున్
    సారాంశంబిది కట్టెకొట్టెతన భూజానిన్ వెసన్దెచ్చెనీ
    శ్రీరామాయణగాథ వ్రాయఁగఁ దగున్ జింతాకుపైఁ బూర్తిగన్

    రిప్లయితొలగించండి
  11. పెద్ద యాకార మునుదోడ వీలు బట్టి
    పతక మొక్కటి చింతాకు వలెను మలచి
    చేయ గంటముఁ జేబట్టి చిన్మయ మగు
    రామకథను జింతాకుపై వ్రాయఁ దగును

    రిప్లయితొలగించండి
  12. శ్రీరామాయణగాథ వ్రాయఁగఁ దగున్ జింతాకుపైఁ బూర్తిగన్
    దారానాయక! సాధ్య మేయది భువిన్ ద్రైలోక్య మందెక్కడన్
    బారావారప యోధిదాటఁగను నేవారుండుఁదాపూనురే
    శ్రీరామాయణ గాధ సంద్రమును నాజింతాకు పైవ్రాయునే?

    రిప్లయితొలగించండి
  13. శా.

    పారావారము ధన్యులైన బలియుల్ వాల్మీకి హృల్లేఖమున్
    హా! రోమాంచితమే శుభంబు వినరో యాశీస్సులందించెడిన్
    *“శ్రీరామాయణగాథ వ్రాయఁగఁ దగున్ జింతాకుపైఁ బూర్తిగన్”*
    వీరావేశముతో ధ్వనించు పలుకుల్ బీభత్స కృత్యంబగున్.

    రిప్లయితొలగించండి
  14. తేటగీతి
    శ్రీమహావిష్ణువే ధర రాముడౌచు
    తాళిఁ 'గట్టి' కుజకుఁ ,జిక్క దానవునకుఁ
    ' గొట్టి' 'తెచ్చె' ననెడు మూటి గూర్చి పేర్చి
    రామకథను జింతాకుపై వ్రాయఁ దగును


    శార్దూలవిక్రీడితము
    కారే పండితులెంతొ ప్రాజ్ఞులన వ్యాఖ్యానించు ప్రావీణ్యమై
    వారంబున్ బ్రవచించి మీద వినఁ గ్లుప్తంబైన మూడంటె మూ
    డే రాశిన్ దులఁదూగు మాటలని 'కట్టెన్ గొట్టెతెచ్చం' చనన్
    శ్రీరామాయణగాథ వ్రాయఁగఁ దగున్ జింతాకుపైఁ బూర్తిగన్

    రిప్లయితొలగించండి