9, ఆగస్టు 2023, బుధవారం

దత్తపది - 199

10-8-2023 (గురువారం)
కవిమిత్రులారా,
రోత - పాడు - చెడు - ఏవ
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
వేంకటేశ్వరుని దివ్యమంగళ రూపాన్ని వర్ణిస్తూ
స్వేచ్ఛాచందంలో పద్యం చెప్పండి.

16 కామెంట్‌లు:

  1. తూలరోతవనామమెప్పుడుచూడ్కిసో
    గయగమందగా
    మాలలోతలపాడుచుండునుమాకుదిక్కునునీవెగా
    ఆలమందలుమేము, గాచెడుహస్తమీయదిచూడగా
    పాలకుండవుయేవగింపకపాదసన్నిధినిల్పునన్

    రిప్లయితొలగించండి
  2. పాడుమితని గీర్తించుచు,
    ఏడుగిరులనెక్కి నడుచు, మితడే బ్రోచున్;
    వేడుము యేవర మైనను,
    వాడెపుడాదు కొనురో, తపన గల వారిన్.

    రిప్లయితొలగించండి


  3. కాంచరో తమ్మిదాయని కతి వదను
    డితని హృదయ మందున రమయే వసియించు
    వకుళ మాలాధరుడు శ్రీని వాసు గొల్వ
    కోరిన వరము లిచ్చెడు భూరి వాడె
    జనుల కాపాడు నట్టి వజ్రముడి ధారి,

    రిప్లయితొలగించండి
  4. ఉ.

    ఏ వరమున్ బ్రసాదముగ నిచ్చుటకే యిలుపాడు కుంచెడున్
    బూవుల తోడ మాలలిడ పుణ్యమురో తలనెత్తిచూడగన్
    సేవలు వేంకటాద్రి పయి చిక్కుట భాగ్యము దివ్యమంగళా!
    నీవె మదీయమానసము నిత్యము ఠీవిగ నిల్చి కావుమా!

    రిప్లయితొలగించండి
  5. వేంక టేశ్వరు గాంచెడు వేళ యందు
    కావరో తమరి ననుచు కర ము లెత్తి
    పాడు చుందురు గీతాలు భక్తి మీర
    కోరుచు త్వ మేవ శరణని కోర్కెలన్ని

    రిప్లయితొలగించండి

  6. జినుడే తిర్మల వేంకటేశు డెదలో శ్రీయే వసింపన్ సదా
    కనరో తన్మయ మందుచున్ ధృతుడు తాకన్పించు నా కొండపై
    జనులన్ గాచెడు వాడతండె యిలలో సత్యంబిదే నమ్ముమా
    ఘనమౌ కొండలనెక్కి మ్రొక్కనతడే కాపాడు భక్తాళినే.

    రిప్లయితొలగించండి
  7. బొడ్డు జూపిం’చెడు’ యెడమ భుజతలమును
    దేవ’రో ! త’మకుడి చేయి దృశ పదముల
    వెలసితివి నను కా’పాడు’ వెంక టేశ!
    ‘ఏవ’రమును కోరనిక నా యెడద నిలువ,

    రిప్లయితొలగించండి
  8. కందము
    కా'పాడు 'నభయహస్తము
    దీపిం'చెడు 'వజ్రమకుట దీధితులటుపై
    తాపిత సొబ'గే వ'హవా!
    శ్రీపతిఁగన'రో త'దేక దృష్టిన్ శుభమౌ .

    రిప్లయితొలగించండి
  9. ఎందరో తరియింతురు చిందఱగొని
    వేడుకొన్నచో నిన్ను కాపాడుమనుచు
    పేర్మితో మమున్ బ్రోచెడు వేంకటేశ
    ఏ వగపునైన తొలగించి కావుమయ్య

    రిప్లయితొలగించండి
  10. తే.గీ.॥
    (ఏవ)రదుఁ నామకీర్తన మిచ్చు ముక్తి
    వరములొసఁగి భక్తులను కా(పాడు)చుండు
    సేమమునుగూర్చి సతము గా(చెడు) విభుండు
    వేంకటపతి(రో! త)ప్పించు సంకటములు

    రిప్లయితొలగించండి
  11. తే॥ కాంచరో తన్మయమునొంది కలుగ శుభము
    తిరుమలేశునిఁ బ్రోచెడు దివ్యరూపు
    నమిత భక్తితోఁ బాడుచు నవని లోన
    యేవరముల నైన నొసఁగెడీశుడతఁడు

    ఉ॥ అందముఁ జూడరో తనియ నద్భుత మంగళ మూర్తియందమున్
    డెందము నూగి పాడుగద ఠీవిగఁ బ్రోచెడు రూపుఁ గాంచఁగన్
    సందిటఁ జేర్చు నేవరద సద్గతి నీయుమటంచు వేడఁగా
    నందరు గొల్వరో విభుని యన్యుల నెంచక వేంకటేశ్వరున్

    రిప్లయితొలగించండి
  12. కందము:
    పాడుమ శ్రీశా! యనుచును
    వీడకు బ్రోచెడు తిరుమల వేంకట పతినే
    వాడేయిడు నేవరముల
    వేడుమురో తగు నుతులను వేడ్కగ భక్తిన్.

    ---గోలి.

    రిప్లయితొలగించండి


  13. (పాడు)త స్తుతించుచును గడు
    పరవసించి
    వేంకటేశుని, బ్రో(చెడు) వేల్పతండు
    తలప(రో త)ప్పకసతము దలపునందు
    (ఏవ)రమ్మి డకున్నని న్నేలు నతడు

    రిప్లయితొలగించండి
  14. కందం
    కనరో! తలపై మకుటము
    ననయము కాపాడు దృక్కులట! తోమాలల్
    దనుకన్ జూచెడు పదములు
    గుణపడ వెంకన్ననేవఁ గొలువఁగ శుభమౌ

    రిప్లయితొలగించండి
  15. అమ్మ *రో! త* లముందట నందమైన
    బొట్టు, శిరముపై నూ *పాడు* ముంగురులును
    కన్ను *చెడు* రూప లావణ్య మెన్న తరమె
    *ఏ వ* లను చూడ తిరుమల స్థావరమున

    రిప్లయితొలగించండి