19-8-2023 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శంకర సతియై జానకి సౌఖ్యముఁ గనె”(లేదా...)“శంకరు ధర్మపత్ని యగు జానకి గాంచె నమేయసౌఖ్యముల్”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో MSV గంగరాజు గారి సమస్య)
చేరె పార్వతి కైలాస శిఖరమెపుడొశంకర సతియై, జానకి సౌఖ్యముఁ గనెరాముడు పతిగాగ స్వయంవరమున మానసమ్ము వుప్పొంగ, పరిణయ సంత సమున.
కంటిచూపుతో కాముని కాల్చినట్టిహరునకు నరమేనై యొప్పె హైమవతియు*“శంకర సతియై జానకి సౌఖ్యముఁ గనె”*దాశరథి సతి యగుచు తా ధరణియందు
వల్లకాటికి రాజును వలచి గౌరికాపురంబునుజేసెగాకలతపడకశంకరుసతియై, జానకిసౌఖ్యముగనెఅడవిపాలైననాథునినంటియుండి
శంక రుడనెడి బావను మనువు నొందికసిడీ కాలమందె కొమరు గనగ నింతిజానకి యిపుడు మిక్కిలి సంతసపడశంకర సతియై జానకి సౌఖ్యముఁ గనె
ధర్మ సంస్థా ప నమ్ముకై ధరణి వెలసిదుష్ట రక్కసు మూకల దునిమినట్టి పరమ పావన రఘు రాము భక్త జన వశంకర సతియై జానకి షౌఖ్యము గనె
దనుజ సంహార మొనరించి ధరణి యందుధర్మ రక్షణ జేసిన దాశరథియె పావన చరితుండతగాడు భక్త జన వశంకర సతియై జానకి సౌఖ్యముఁ గనె.లంకను జేరె మర్కటములన్ గొని సేనగ దుష్ట దానవున్ బింకము గూల్చగా దలచి ప్రేర్త్వము దాటుచు, నాలి బ్రోవగన్ శంకరభక్త రావణుని సంగరమున్ బొరిగొన్న దుష్ట నాశంకరు ధర్మపత్ని యగు జానకి గాంచె నమేయసౌఖ్యముల్.
జంకక కంటితో మరుని చంపినవానిని గౌరి కోరితా*శంకరు ధర్మపత్ని యగు, జానకి గాంచె నమేయ సౌఖ్యముల్”*శంకయు నొందకన్ చనుచు సాంత్వము నందున నందమొం దుచున్వంకలు బెట్టి వద్దనెడి భర్తయె యొప్పెడి రీతి కానలో
శంకరు చాపమున్ విరచి సాధ్విమహీజను పెండ్లి యాడి యాటంకములెన్ని వచ్చిన విడంగముగా నవి దాటి చెచ్చెరన్లంకకు జేరి యుద్ధమున రావణు గూల్చినయట్టి శత్రు నాశంకరు ధర్మపత్ని యగు జానకి గాంచె నమేయ సౌఖ్యముల్
శివధనుర్భంగమొనరించి శివము గూర్చిసతిగ సీతను జేకొని సతినిఁ గావబవరమున రావణునిగూల్చు భక్తజన వశంకర సతియై జానకి సౌఖ్యముఁ గనె
తే॥ ఘనముగ వివాహ మాడఁగ గౌరి తనరె శంకర సతియై., జానకి సౌఖ్యముఁ గనెరావణునిఁ గూల్చి రాముఁడు రమ్యతఁ గనితనను చేరదీయఁగ నమితాదరముగఉ॥ బింకము వీడి పార్వతినిఁ బెండ్లినిఁ జేసికొనంగ నామెయేశంకర ధర్మపత్నియగు., జానకి గాంచె నమేయ సౌఖ్యముల్ పొంకము తోడ రావణునిఁ బోరునఁ గెల్చి గ్రహించ భర్తయేసంకట మెల్ల దీరఁగను సంతస మొందుచుఁ జేరి రామునిన్
లంకకు చేర్చి జానకిని రావణుడారడి పెట్ట నీచుడైజంకు రవంతలేని కపి సైన్యము తోడ తరించి సంద్రమున్సంకులమైన సంగరము జంపగ రాముడు వాని, దైత్య నాశంకరు ధర్మపత్ని యగు జానకి గాంచె నమేయసౌఖ్యముల్
తేటగీతిమౌని ప్రోత్సాహమందింప పూని మిగులసకల రాజగణమ్ములు సడలి పోవహరుని విలువంచి రామయ్య దరికిఁ జేరశంకర! సతియై జానకి సౌఖ్యముఁ గనెఉత్పలమాలసంకటమొందఁగన్ సతి కసాయిగ బందిని జేయ రావణుం,డంకిత భావమున్ దెలిపి యంబుధి దాటఁగఁ గట్టి వారధిన్పంకజ లోచనుండణచి పాటిగఁ జోకొని కూడి కొల్వగన్శంకరు, ధర్మపత్ని యగు జానకి గాంచె నమేయసౌఖ్యముల్
చక్కగ శివునివిల్లు తానెక్కుపెట్టిధరణిజను పొందెనా స్వయంవరములోనవరుడు కౌసలేయుడు మనోహర హృదయ వశంకర సతియై జానకి సౌఖ్యముఁ గనెశంకరుడీయగాగొనిరి చక్కనివిల్లును దేవపర్వమేజంకక దానినే విరిచి శక్తిని చాటెను రామచంద్రుడేపంకజ నేత్రుడే తనకు భర్తగదక్కగ రాక్షసాళి నాశంకరు ధర్మపత్ని యగు జానకి గాంచె నమేయసౌఖ్యముల్
పంకజ నేత్రి పార్వతి తపస్సునొనర్చెడు భర్త పద్ధతిన్సంకట మందు ముంచెనని జాలిపడెన్ మనమందు విస్తృతిన్ శంకరు ధర్మపత్నియగు, జానకి గాంచెనమేయ సౌఖ్యమున్కొంకక రావణా సురుని గూల్చినరాముని తోడగడ్పగా.
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. వెండికొండపై పార్వతి వెంటనుండెశంకర సతియై; జానకి సౌఖ్యము గనె రామచంద్రుని పత్నిగా, రాజ్యమందుసాధ్వి యనుచు గొలిచిరి ప్రజలు ముదమున.
చేరె పార్వతి కైలాస శిఖరమెపుడొ
రిప్లయితొలగించండిశంకర సతియై, జానకి సౌఖ్యముఁ గనె
రాముడు పతిగాగ స్వయంవరమున మాన
సమ్ము వుప్పొంగ, పరిణయ సంత సమున.
కంటిచూపుతో కాముని కాల్చినట్టి
రిప్లయితొలగించండిహరునకు నరమేనై యొప్పె హైమవతియు
*“శంకర సతియై జానకి సౌఖ్యముఁ గనె”*
దాశరథి సతి యగుచు తా ధరణియందు
వల్లకాటికి రాజును వలచి గౌరి
రిప్లయితొలగించండికాపురంబునుజేసెగాకలతపడక
శంకరుసతియై, జానకిసౌఖ్యముగనె
అడవిపాలైననాథునినంటియుండి
శంక రుడనెడి బావను మనువు నొంది
రిప్లయితొలగించండికసిడీ కాలమందె కొమరు గనగ నింతి
జానకి యిపుడు మిక్కిలి సంతసపడ
శంకర సతియై జానకి సౌఖ్యముఁ గనె
ధర్మ సంస్థా ప నమ్ముకై ధరణి వెలసి
రిప్లయితొలగించండిదుష్ట రక్కసు మూకల దునిమినట్టి
పరమ పావన రఘు రాము భక్త జన వ
శంకర సతియై జానకి షౌఖ్యము గనె
దనుజ సంహార మొనరించి ధరణి యందు
రిప్లయితొలగించండిధర్మ రక్షణ జేసిన దాశరథియె
పావన చరితుండతగాడు భక్త జన వ
శంకర సతియై జానకి సౌఖ్యముఁ గనె.
లంకను జేరె మర్కటములన్ గొని సేనగ దుష్ట దానవున్
బింకము గూల్చగా దలచి ప్రేర్త్వము దాటుచు, నాలి బ్రోవగన్
శంకరభక్త రావణుని సంగరమున్ బొరిగొన్న దుష్ట నా
శంకరు ధర్మపత్ని యగు జానకి గాంచె నమేయసౌఖ్యముల్.
జంకక కంటితో మరుని చంపినవానిని గౌరి కోరితా
*శంకరు ధర్మపత్ని యగు, జానకి గాంచె నమేయ సౌఖ్యముల్”*
శంకయు నొందకన్ చనుచు సాంత్వము నందున నందమొం దుచున్
వంకలు బెట్టి వద్దనెడి భర్తయె యొప్పెడి రీతి కానలో
శంకరు చాపమున్ విరచి సాధ్విమహీజను పెండ్లి యాడి యా
రిప్లయితొలగించండిటంకములెన్ని వచ్చిన విడంగముగా నవి దాటి చెచ్చెరన్
లంకకు జేరి యుద్ధమున రావణు గూల్చినయట్టి శత్రు నా
శంకరు ధర్మపత్ని యగు జానకి గాంచె నమేయ సౌఖ్యముల్
శివధనుర్భంగమొనరించి శివము గూర్చి
రిప్లయితొలగించండిసతిగ సీతను జేకొని సతినిఁ గావ
బవరమున రావణునిగూల్చు భక్తజన వ
శంకర సతియై జానకి సౌఖ్యముఁ గనె
తే॥ ఘనముగ వివాహ మాడఁగ గౌరి తనరె
రిప్లయితొలగించండిశంకర సతియై., జానకి సౌఖ్యముఁ గనె
రావణునిఁ గూల్చి రాముఁడు రమ్యతఁ గని
తనను చేరదీయఁగ నమితాదరముగ
ఉ॥ బింకము వీడి పార్వతినిఁ బెండ్లినిఁ జేసికొనంగ నామెయే
శంకర ధర్మపత్నియగు., జానకి గాంచె నమేయ సౌఖ్యముల్
పొంకము తోడ రావణునిఁ బోరునఁ గెల్చి గ్రహించ భర్తయే
సంకట మెల్ల దీరఁగను సంతస మొందుచుఁ జేరి రామునిన్
లంకకు చేర్చి జానకిని రావణుడారడి పెట్ట నీచుడై
రిప్లయితొలగించండిజంకు రవంతలేని కపి సైన్యము తోడ తరించి సంద్రమున్
సంకులమైన సంగరము జంపగ రాముడు వాని, దైత్య నా
శంకరు ధర్మపత్ని యగు జానకి గాంచె నమేయసౌఖ్యముల్
తేటగీతి
రిప్లయితొలగించండిమౌని ప్రోత్సాహమందింప పూని మిగుల
సకల రాజగణమ్ములు సడలి పోవ
హరుని విలువంచి రామయ్య దరికిఁ జేర
శంకర! సతియై జానకి సౌఖ్యముఁ గనె
ఉత్పలమాల
సంకటమొందఁగన్ సతి కసాయిగ బందిని జేయ రావణుం,
డంకిత భావమున్ దెలిపి యంబుధి దాటఁగఁ గట్టి వారధిన్
పంకజ లోచనుండణచి పాటిగఁ జోకొని కూడి కొల్వగన్
శంకరు, ధర్మపత్ని యగు జానకి గాంచె నమేయసౌఖ్యముల్
చక్కగ శివునివిల్లు తానెక్కుపెట్టి
రిప్లయితొలగించండిధరణిజను పొందెనా స్వయంవరములోన
వరుడు కౌసలేయుడు మనోహర హృదయ వ
శంకర సతియై జానకి సౌఖ్యముఁ గనె
శంకరుడీయగాగొనిరి చక్కనివిల్లును దేవపర్వమే
జంకక దానినే విరిచి శక్తిని చాటెను రామచంద్రుడే
పంకజ నేత్రుడే తనకు భర్తగదక్కగ రాక్షసాళి నా
శంకరు ధర్మపత్ని యగు జానకి గాంచె నమేయసౌఖ్యముల్
పంకజ నేత్రి పార్వతి తపస్సు
రిప్లయితొలగించండినొనర్చెడు భర్త పద్ధతిన్
సంకట మందు ముంచెనని జాలి
పడెన్ మనమందు విస్తృతిన్
శంకరు ధర్మపత్నియగు, జానకి గాంచె
నమేయ సౌఖ్యమున్
కొంకక రావణా సురుని గూల్చిన
రాముని తోడగడ్పగా.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
వెండికొండపై పార్వతి వెంటనుండె
శంకర సతియై; జానకి సౌఖ్యము గనె రామచంద్రుని పత్నిగా, రాజ్యమందు
సాధ్వి యనుచు గొలిచిరి ప్రజలు ముదమున.