22-8-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మా కరములు పదములు నియమమునఁ గొలువుమా”(లేదా...)“మా కరముల్ పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ”(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో MPS సత్యనారాయణ గారి సమస్య)
సాకారాకృతినిల్చెగచేకొనసేవలుమురియుచుసేమమునీయన్నీకరమందగదేవియుమా కరములు పదములు నియమమునగొలువుమా
వేకువజామున మేల్కొనితేకువతోమొదలిడవలె దీక్షావ్రతమున్చేకూరగ నీప్సితము రమా కరములు పదములు నియమమునఁ గొలువుమా
ఒక రాజకీయ నేత యిచ్చిన సందేశము....మాకనుకూలమైన ననుమానము లేకనొసంగనెంచెదన్ప్రాకటమైన పీఠమును పైకము సైతము వెచ్చబెట్టగామీకిక శంకలేల మితి మీరక మాకిక సేవజేయుమామా కరముల్ పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ
చేకుర వలెనన మోక్షముప్రాకటమౌ రూపము ప్రభు రాఘవు డతడే శ్రీకరుడని చేర్చుచు భామా! కరములు , పదములు నియమమునఁ గొలువుమా.ప్రాకటమైన రూపమది భక్తుల కయ్యది కయ్యది కల్పవృక్షమై శ్రీకరమైన రాఘవుని చేరుచు నిత్యము గొల్చువారికే చేకురుమోక్షమంచెఱుగు చింతను వీడుచు భక్తిఁజేర్చి భామా! కరముల్ , పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ.
నా కోరిక మన్నించుచుమా కరములు పదములు నియమమునఁ గొలువుమా!మీ కార్యము సలు పుటకయినా కరణము వచ్చియుండ నడిగెద మేమున్కరము = కప్పము,పదము = వస్తువుకొలుచు = కొలతవేయు
శబరి రాముని తో.నీకమనీయ రూపుకయి నిచ్చెలు వేచి ముముక్షు మార్గమున్చేకొని నట్టినాకు నిల శ్రీకర పాదయుగమ్ము దక్కె!నాదేకద!భాగ్యమన్న!జగతీవరవందితపాదపద్మ! రామా!కరముల్ పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ
ఉ.కేకలు వేయుచున్ లలిత గీతములన్ గిచకొట్టు భక్తులన్వేకువ ఝామునందు పువు విచ్చుట మాదిరి శిష్యులుండెడిన్రూకల దక్షిణల్ ఎఱుక రూపము సేవలు స్వంతమైన, రా*మా! కరముల్ పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ.*
శ్రీకరములు జే కూరగప్రాకటముగ నామ జపము వదలక భక్తిన్శ్రీకంఠు ని సతి యైన నుమా కరములు పదములు నియమమున గొలువుమా!
శోకవినాశిని శాంకరిసేకములను పరిహరించు చిన్మయి నగజన్లోకములేలెడి జనని యుమా కరములు పదములు నియమమునఁ గొలువుమా
శోకవిదూరుఁ జేసి మది శుద్ధముగా నొనగూర్చు నామమున్యాకలిదప్పులన్ మరచి యార్తిగ ధ్యానము సల్పఁగా కృపన్సేకములెల్ల పోదొలఁగ జేసెడి శాంకరి పూజ సేయ రమ్మా కరముల్ పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కం॥ శ్రీకర శుభకర హితకర శ్రీకాంత విభుడు జనులకు శ్రేయముఁ గూర్చున్సాకారము గాఁగ నిరత మా కరములు పదములు నియమమునఁ గొలువుమావైవిధ్య పూరణఉ॥ వేకువ జాము స్వప్నమున వింతగ నేనొక దేశ రాజునైసోఁకక చీకుచింతలును శోభగ సేవలఁ గంటి గొప్పగాషోకులు మీరగా జనులఁ జూచుచు నంటిని దర్పమెక్కువైమా కరముల్ పదాలు నియమంబునఁ బట్టిన వాఁడు ధన్యుఁడౌ
భైరవు ధర్మ పత్ని బహు బాధలు దూరము సేసెడు శక్తరూపివిన్సారెకు చిత్తమందునను సన్మతితోడనుసంస్మరించుచున్ధారుణియందు భక్తజన దాపుననుండెడు దివ్య శాంభవీమా కరముల్ పదాలు నియమంబునబట్టిన వాడు ధన్యుడౌ
శ్రీకర!సుందరాననుడ!శీఘ్రగతిన్మము బ్రోవుమో హరీ నీకనుసన్నలందెపుడునిల్చునదృష్టమొసంగుమెప్పుడున్మాకడగండ్లుబాపగనుమానసమందుతలంచుమయ్యరామాకరముల్పదాలునియమంబునబట్టినవాడుధన్యుడౌ
ఏకమనము తోడనుమాశోకమ్ములుబాపికరుణచూపుమటంచున్ లోకములనుకాపాడు యు *“మా కరములు పదములు నియమమునఁ గొలువుమా
కందంఏకబిగిని రథసప్తమిశ్రీకరు బ్రహ్మోత్సవమనఁ జెల్లుఁ దిరుమలన్మీకభయమిడుననన్ గనుమా! కరములు, పదములు నియమమునఁ గొలువుమా!ఉత్పలమాలఏకబిగిన్ పరాత్పరున కింపొనరన్ రథసప్తమీ తిధిన్శ్రీకరు మాడ వీధుల విశిష్టత నల్వమహోత్సవమ్మటుల్సేకురు తిర్మలన్, దరికి జేరఁగనే యభయమ్మొసంగు గన్మా! కరముల్, పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ!
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. శ్రీకరుడౌ రఘురాముని ప్రాకటముగ పూజచేసి ప్రతిదినమందున్ చేకూరగ మోక్షము భామా! కరములు పదములు నియమమున గొలువుమా!
సాకారాకృతినిల్చెగ
రిప్లయితొలగించండిచేకొనసేవలుమురియుచుసేమమునీయన్
నీకరమందగదేవియు
మా కరములు పదములు నియమమునగొలువుమా
వేకువజామున మేల్కొని
రిప్లయితొలగించండితేకువతోమొదలిడవలె దీక్షావ్రతమున్
చేకూరగ నీప్సితము ర
మా కరములు పదములు నియమమునఁ గొలువుమా
ఒక రాజకీయ నేత యిచ్చిన సందేశము....
తొలగించండిమాకనుకూలమైన ననుమానము లేకనొసంగనెంచెదన్
ప్రాకటమైన పీఠమును పైకము సైతము వెచ్చబెట్టగా
మీకిక శంకలేల మితి మీరక మాకిక సేవజేయుమా
మా కరముల్ పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ
రిప్లయితొలగించండిచేకుర వలెనన మోక్షము
ప్రాకటమౌ రూపము ప్రభు రాఘవు డతడే
శ్రీకరుడని చేర్చుచు భా
మా! కరములు , పదములు నియమమునఁ గొలువుమా.
ప్రాకటమైన రూపమది భక్తుల కయ్యది కయ్యది కల్పవృక్షమై
శ్రీకరమైన రాఘవుని చేరుచు నిత్యము గొల్చువారికే
చేకురుమోక్షమంచెఱుగు చింతను వీడుచు భక్తిఁ
జేర్చి భా
మా! కరముల్ , పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ.
నా కోరిక మన్నించుచు
రిప్లయితొలగించండిమా కరములు పదములు నియమమునఁ గొలువుమా!
మీ కార్యము సలు పుటకయి
నా కరణము వచ్చియుండ నడిగెద మేమున్
కరము = కప్పము,పదము = వస్తువు
కొలుచు = కొలతవేయు
శబరి రాముని తో.
రిప్లయితొలగించండినీకమనీయ రూపుకయి నిచ్చెలు వేచి ముముక్షు మార్గమున్
చేకొని నట్టినాకు నిల శ్రీకర పాదయుగమ్ము దక్కె!నా
దేకద!భాగ్యమన్న!జగతీవరవందితపాదపద్మ! రా
మా!కరముల్ పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ
ఉ.
రిప్లయితొలగించండికేకలు వేయుచున్ లలిత గీతములన్ గిచకొట్టు భక్తులన్
వేకువ ఝామునందు పువు విచ్చుట మాదిరి శిష్యులుండెడిన్
రూకల దక్షిణల్ ఎఱుక రూపము సేవలు స్వంతమైన, రా
*మా! కరముల్ పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ.*
శ్రీకరములు జే కూరగ
రిప్లయితొలగించండిప్రాకటముగ నామ జపము వదలక భక్తిన్
శ్రీకంఠు ని సతి యైన ను
మా కరములు పదములు నియమమున గొలువుమా!
శోకవినాశిని శాంకరి
రిప్లయితొలగించండిసేకములను పరిహరించు చిన్మయి నగజన్
లోకములేలెడి జనని యు
మా కరములు పదములు నియమమునఁ గొలువుమా
శోకవిదూరుఁ జేసి మది శుద్ధముగా నొనగూర్చు నామమున్
రిప్లయితొలగించండియాకలిదప్పులన్ మరచి యార్తిగ ధ్యానము సల్పఁగా కృపన్
సేకములెల్ల పోదొలఁగ జేసెడి శాంకరి పూజ సేయ ర
మ్మా కరముల్ పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ శ్రీకర శుభకర హితకర
రిప్లయితొలగించండిశ్రీకాంత విభుడు జనులకు శ్రేయముఁ గూర్చున్
సాకారము గాఁగ నిరత
మా కరములు పదములు నియమమునఁ గొలువుమా
వైవిధ్య పూరణ
ఉ॥ వేకువ జాము స్వప్నమున వింతగ నేనొక దేశ రాజునై
సోఁకక చీకుచింతలును శోభగ సేవలఁ గంటి గొప్పగా
షోకులు మీరగా జనులఁ జూచుచు నంటిని దర్పమెక్కువై
మా కరముల్ పదాలు నియమంబునఁ బట్టిన వాఁడు ధన్యుఁడౌ
భైరవు ధర్మ పత్ని బహు బాధలు
రిప్లయితొలగించండిదూరము సేసెడు శక్తరూపివిన్
సారెకు చిత్తమందునను సన్మతితోడను
సంస్మరించుచున్
ధారుణియందు భక్తజన దాపున
నుండెడు దివ్య శాంభవీ
మా కరముల్ పదాలు నియమంబున
బట్టిన వాడు ధన్యుడౌ
శ్రీకర!సుందరాననుడ!శీఘ్రగతిన్మము బ్రోవుమో హరీ
రిప్లయితొలగించండినీకనుసన్నలందెపుడునిల్చునదృష్టమొసంగుమెప్పుడున్
మాకడగండ్లుబాపగనుమానసమందుతలంచుమయ్యరా
మాకరముల్పదాలునియమంబునబట్టినవాడుధన్యుడౌ
రిప్లయితొలగించండిఏకమనము తోడనుమా
శోకమ్ములుబాపికరుణచూపుమటంచున్
లోకములనుకాపాడు యు
*“మా కరములు పదములు నియమమునఁ గొలువుమా
కందం
రిప్లయితొలగించండిఏకబిగిని రథసప్తమి
శ్రీకరు బ్రహ్మోత్సవమనఁ జెల్లుఁ దిరుమలన్
మీకభయమిడుననన్ గను
మా! కరములు, పదములు నియమమునఁ గొలువుమా!
ఉత్పలమాల
ఏకబిగిన్ పరాత్పరున కింపొనరన్ రథసప్తమీ తిధిన్
శ్రీకరు మాడ వీధుల విశిష్టత నల్వమహోత్సవమ్మటుల్
సేకురు తిర్మలన్, దరికి జేరఁగనే యభయమ్మొసంగు గ
న్మా! కరముల్, పదాలు నియమంబునఁ బట్టినవాఁడు ధన్యుఁడౌ!
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
శ్రీకరుడౌ రఘురాముని
ప్రాకటముగ పూజచేసి ప్రతిదినమందున్
చేకూరగ మోక్షము భా
మా! కరములు పదములు నియమమున
గొలువుమా!