7, ఆగస్టు 2023, సోమవారం

సమస్య - 4497

8-8-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దేవుఁడు లేనట్టి గుడియె తీర్చును గోర్కెల్”
(లేదా...)
“దేవుఁడు లేని దేవళమె తీర్చును భక్తుల కోర్కెలన్నియున్”

22 కామెంట్‌లు:

  1. భావితరములకు బడియన
    దేవుడు లేనట్టి గుడియె, దీర్చును గోర్కెల్;
    ఏవిద్యలేని వాడిక
    యేవిధమగుసుఖమెరుగడు యెన్నటికైనన్.

    రిప్లయితొలగించండి
  2. దేవళమొక్కటియేటికి
    నావలి వైపున కలదట నర్చకరహితం
    బై వరమడిగినచో క్షితి
    దేవుఁడు లేనట్టి గుడియె తీర్చును గోర్కెల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దేవుని సన్నిధిన్నిలిచి దేవుని వేడుట నిత్యకృత్యమే
      దేవునిపూజసేయుటకు దేవలుడుండుట కూడ సత్యమే
      పావనగౌతమీ తటముఁ భాసిలు దేవళమందు చూడ భూ
      దేవుఁడు లేని దేవళమె తీర్చును భక్తుల కోర్కెలన్నియున్

      తొలగించండి

  3. భావితరమ్మును దిద్దెడి
    దేవళమననేమి బడియె దేవుడు గురువౌ
    గోవున ప్రతిమగ నిలిచిన
    దేవుఁడు లేనట్టి గుడియె తీర్చును గోర్కెల్.


    పావనమైన మందిరమది బాలల తీరిచి దిద్ది మేటి మే
    ధావులు గాను మార్చు సుమధామము లేవన పాఠశాలలే
    కావలె భావి భారతికి గాంచగ విగ్రహ రూపమందునన్
    దేవుఁడు లేని దేవళమె తీర్చును భక్తుల కోర్కెలన్నియున్.

    రిప్లయితొలగించండి
  4. కందము
    సేవించుడు గురువులనే
    భావించియు దైవముగను బాలకులారా!
    శ్రీవిద్యానిలయమ్మే
    దేవుఁడు లేనట్టి గుడియె తీర్చును కోర్కెల్.

    రిప్లయితొలగించండి
  5. పోవగమానుషకర్మము
    త్రోవదికృత్రిమముమేథరోచిస్సులతో
    చేవనుజేసెనుకార్యము
    దేవుడులేనట్టిగుడియెతీర్చునుకోర్కెల్

    రిప్లయితొలగించండి
  6. భావనజేసికార్యమునుబాధ్యతనిచ్చినవేగమందుచున్
    చేవనుకృత్రిమంబునటతేటగదెల్పునుయంత్రమందునన్
    దేవర! లేదునీయునికితీరునుచూడగనీజగత్తులో
    దేవుడులేనిదేవళముతీర్చునుభక్తులకోర్కెలన్నియున్

    రిప్లయితొలగించండి
  7. ఉ.

    చేవను గోలుపోయి గుడి జేరుట కష్టము కాళ్ల నొప్పిచే
    మైవడి ధ్యానమే ప్రణవ మంత్రము నాదము మూర్తిమంతమై
    *దేవుఁడు లేని దేవళమె తీర్చును భక్తుల కోర్కెలన్నియున్*
    మేవడి ప్రార్థనాగృహము మెట్లును లేనిది భక్త కోటికిన్.

    రిప్లయితొలగించండి
  8. వావిరిగ కురియుచుండిన
    నా వర్షము బారినుండి యదలగ
    నెంచన్
    ఆవాసముకై వెదుకగ
    దేవుఁడు లేనట్టి గుడియె తీర్చును గోర్కెల్

    రిప్లయితొలగించండి
  9. పావన విద్యల నొస గెడు
    కోవెల యే బడి యటంచు కోవిదు లనగా
    నా విద్యా లయ మిలలో
    దేవుడు లేనట్టి గుడియె తీర్చును గోర్కె ల్

    రిప్లయితొలగించండి
  10. దేవళమే చదువులబడి
    దేవుఁడువేరొండులేడు తెలియుము గురుఁడే
    దీవనలిడునాచార్యుఁడు
    దేవుఁడు లేనట్టి గుడియె తీర్చును గోర్కెల్

    రిప్లయితొలగించండి
  11. భావితరాల మానవుల బ్రత్కులు
    సక్కగ సాగ విద్యయే
    కావలె నద్దియే ప్రజల కాంక్షలు
    దీర్చును బెంచి జ్ఞానమున్
    జీవుడ జ్ఞానమందిరమె చేతన
    శక్తిని బెంచు నిక్కమే
    దేవుడు లేని దేవళమె తీర్చును
    భక్తుల కోర్కులన్నయున్.

    రిప్లయితొలగించండి
  12. ఒక చోరుని స్వగతము.

    కందము:
    పోవలె,శిఖరాగ్రముపై
    కావలి లేనట్టి కోట కలదులె, నిధులే
    కావలె, త్రవ్వగ నట నా
    దేవుఁడు లేనట్టి గుడియె తీర్చును గోర్కెల్.

    ---గోలి.

    రిప్లయితొలగించండి
  13. కం:దేవుడు కలడో లేదో
    జీవులకును,దేశమునకు సిరులొసగెడు నా
    దేవళము పరిశ్రమయే
    దేవుడు లేనట్టి గుడియె తీర్చును కోర్కెల్
    ("పరిశ్రమలే ఆధునికదేవాలయాలు"ఆనకట్టలే "ఆధునికదేవాలయాలు"అనే నెహ్రూ గారి భావాలకి అనుగుణం గా.)

    రిప్లయితొలగించండి
  14. భావనచేయ దేశికుడు బాలల తీరిచిదిద్దు దైవమా
    దేవుడు కానిదేవుడుపదేశ మొనర్చుచు విద్యనేర్పి మే
    ధావులఁజేసి ఛాత్రులను ధన్యచరిత్రుల జేయుచుండు నా
    దేవుఁడు లేని దేవళమె తీర్చును భక్తుల కోర్కెలన్నియున్

    రిప్లయితొలగించండి
  15. కం॥ భావన నిల్పుచు సతతము
    జీవుఁడు దేవునిఁ గొలువఁగఁ జేతన తోడన్
    బ్రోవఁగ మనసను గుడిలో
    దేవుఁడు లేనట్టి గుడియె తీర్చును గోర్కెల్

    ఉ॥ జీవుఁడు భక్తి తత్పరతఁ జేతనఁ బొందుచు సర్వ వేళలా
    భావన తోడ మానసము వక్రము గాక తలంచి మ్రొక్కఁగన్
    బ్రోవుమటంచు దేహమునె బుద్ధిగ మల్చుచు మందిరమ్ముగన్
    దేవుఁడు లేని దేవళమె తీర్చును భక్తుల కోర్కెలన్నియున్

    రిప్లయితొలగించండి
  16. ఉ:దేవుని తత్త్వ మెంచకయె తీవ్రత తో నొక డిట్లు పల్కె" మీ
    దేవుని,విగ్రహమ్ములను తీయుము మీ గృహ మందు ,నింక మా
    దేవుని నమ్ము ,మా ప్రభువు దీవెన లిచ్చును చర్చి లోన,మీ
    దేవుడు లేని దేవళము తీర్చును భక్తుల కోర్కె లన్నియున్.

    రిప్లయితొలగించండి
  17. కందం
    జీవము త్రిమూర్తుల సమము
    గోవెలగ బడినొనరించి గురువర్యులిలన్
    దీవింప శిష్య తతి, బడి
    దేవుఁడు లేనట్టి గుడియె? తీర్చును గోర్కెల్!

    ఉత్పలమాల
    జీవమునన్ ద్రిమూర్తులు విశేష గుణంబున జేరి యొక్కటై
    కోవెల జేయుచున్ బడిని గూర్మిని విద్యను శిష్యకోటికిన్
    దీవన లిచ్చియున్ గురువు తేజమునింపఁగ, నౌనె భూమినిన్
    దేవుఁడు లేని దేవళమె? తీర్చును భక్తుల కోర్కెలన్నియున్!

    రిప్లయితొలగించండి
  18. పావనమైన దేవళము పాపలకెన్నఁడు పాఠశాలయే
    భావనచేయ నర్చకుఁడు పాఠముఁ జెప్పెడు నొజ్జయే గనన్
    దేవళమందు నర్చనకుదెచ్చిన పూవులు బాలలేసుమా
    దేవుఁడు లేని దేవళమెతీర్చును భక్తుల కోర్కెలన్నియున్

    రిప్లయితొలగించండి
  19. కావలె విద్యాలయములు
    భావోన్నత సద్గరువులు భాగ్యవిధాతల్
    కావలయు బాగుపరచగ
    దేవుడు లేనట్టి గుడులె కోర్కల దీర్చున్

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    పావనమూర్తులు గురువులు
    కోవెల వంటి బడియందు కుఱ్ఱలకెల్లన్
    దీవెనలిడుచుండగ బడి
    దేవుడు లేనట్టి గుడియె; తీర్చును గోర్కెల్.

    రిప్లయితొలగించండి