2, ఆగస్టు 2023, బుధవారం

సమస్య - 4492

3-8-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాయల కావ్యమ్మునఁ గనరావు రసమ్ముల్”
(లేదా...)
“రాయల కావ్యమందు గనరావు రసోచిత భావసంపదల్”

22 కామెంట్‌లు:

  1. పో.యగకుప్పగవర్ణన
    కాయమశాశ్వతమునంచు కావ్యమునందున్
    ఓయనిపిలచెనువిష్ణుని
    రాయలకావ్యమ్మునకనరావురసమ్ముల్

    రిప్లయితొలగించండి
  2. వ్రాయగ నేలనొ సంస్కృత
    భూయిష్టమ్ముగ సమాస పూరిత కవితన్
    రాయలు; యెరుగని వారికి
    రాయల కావ్యమ్మున గనరావు రసమ్ముల్.

    రిప్లయితొలగించండి
  3. మూయనిభక్తిసాధనలమూసగబోసెకథాస్రవంతిలో
    సోయగమెంచిచాతురినిశోధనఁజేసివరించెవిష్ణునిన్
    కూయుదురేలనోకవులుకుత్సితభావమునందుమున్గుచున్
    రా. లకావ్యమందుగనరావురసోచితభావసంపదల్

    రిప్లయితొలగించండి
  4. తీయని పదముల కూరుపు
    రాయల కావ్యమ్మునఁ ; గనరావు రసమ్ముల్
    యే యతి ప్రాసల గూర్చక
    వ్రాయు కవితలందు మరియు వాజనిడుగదా

    రిప్లయితొలగించండి
  5. రాయె కరుగందురు కవులె
    కాయును కన్నులు రసమునకై వెతకగనే
    రాయుట నెరుంగ కందురు
    రాయల కావ్యమ్మున గనరావు రసమ్ముల్

    రిప్లయితొలగించండి
  6. హాయిగ చధువగ లేనివి
    రాయల కావ్యమ్మునఁ గనరావు, రసమ్ముల్
    పాయకమౌను విరివిగా
    సోయగమొప్పును తళుకులు సూచితమవగా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తోయజనేత్ర! చూడదగు తోరపు శబ్దము భావయుక్తమై
      హాయినొసంగు రత్నమణి హారములే! రసహీన పద్యముల్
      రాయల కావ్యమందు గనరావు రసోచిత భావసంపదల్
      బాయకనుండగా నలరి పాదములన్నియు చెంగలించగన్

      తొలగించండి
  7. హాయిని గూర్చు రసాన్విత
    మాయన కావ్యముల మెత్తు రందరు మరి వై
    ధేయులగు పామరుండ్రకు
    రాయల కావ్యమ్మునఁ గనరావు రసమ్ముల్.


    స్థాయియె లేని మూఢుడు రసమ్ములవెన్నొ
    యెఱుంగనట్టి వై
    ధేయుడు దీర్ఘదర్శులకు ధీటుగ వ్రాసెద నంచు కావ్యముల్
    వ్రాయగ నేమి యందు గన వాసియె లేనికృతుల్ కనంగ నౌ
    రా! యల కావ్యమందు గనరావు రసోచిత భావసంపదల్.

    రిప్లయితొలగించండి
  8. కోయిల పాటను, సొబగున
    తోయజమును, వేగమందు తురగము నులక
    న్జేయగల మూర్ఖులకిక
    రాయల కావ్యమ్మున గనరావు రసమ్ముల్.

    రిప్లయితొలగించండి
  9. వ్రాయఁగ బూనెను కావ్యమ
    నాయాసముగా కవివరులాహాయనగన్
    మాయిరె! వెంకట భూపతి
    రాయల కావ్యమ్మునఁ గనరావు రసమ్ముల్

    రిప్లయితొలగించండి
  10. కందము
    మాయురె!యేదోషమ్ములు
    రాయల కావ్యమ్మునఁ గనరావు;రసమ్ముల్
    తీయగఁజిప్పిలు కవులో
    హో!యని మెత్తురు పఠించి యుత్సాహముతోన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      మాయురె!శంకరార్య!కనుమా!మఱి వ్యాకరణాది దోషముల్
      రాయల కావ్యమందు గనరావు;రసోచిత భావ సంపదల్
      హాయిని గూర్చు వర్ణనలు నద్భుతమైనటువంటి గాథలున్
      తీయని గద్యపద్యములు తృప్తిని గూర్చునుగా పఠించగన్.

      తొలగించండి
  11. నా ప్రయత్నం..

    కం.
    వైయాకరణము నేర్వక
    ప్రాయోగిక సంస్కృతమున బ్రాజ్ఞత కఱవై
    వ్రాయంగ లేని వారికి
    రాయల కావ్యమ్మున గనరావు రసమ్ముల్

    తిరివీధి శ్రీమన్నారాయణ

    రిప్లయితొలగించండి
  12. మాయని మచ్చ ల వేవియు
    రాయల కావ్యమ్మున గన రావు :: రసమ్ముల్
    తీయనివై. పాఠకునికి
    హాయిని. కలిగించు ను గద యవిరళ భంగిన్

    రిప్లయితొలగించండి
  13. నా ప్రయత్నం..

    కం.
    వైయాకరణము నేర్వక
    ప్రాయోగిక సంస్కృతమున ప్రజ్ఞత కఱవై
    యే యర్థము లెఱగినచో
    రాయల కావ్యమ్మున గనరావు రసమ్ముల్

    తిరివీధి శ్రీమన్నారాయణ

    రిప్లయితొలగించండి
  14. వ్రాయగనొక్క కావ్యమును రాయలకున్ మదినిచ్చ గల్గగా
    మాయురె! వ్రాసెనొక్క మహిమాన్విత భక్తిరసప్రధానమై
    శ్రేయముగూర్చు కావ్యమును, చిత్రము భక్తి వినా కనుంగొనన్
    రాయల కావ్యమందు గనరావు రసోచిత భావసంపదల్

    రిప్లయితొలగించండి
  15. కం॥ తీయని తేనియ నింపుచు
    వ్రాయఁగ భక్తి రసభరిత భావము మెఱయన్
    న్యాయము గాదు పలుకఁగను
    రాయల కావ్యమ్మునఁ గానరావు రసమ్ముల్

    ఉ॥ రాయల కావ్యమందునను రమ్యత భక్తియు భావసంపదల్
    దీయగఁ బారుచుండఁగను దేనియ లొల్కుచు ధారగానున
    న్యాయము గాద మూర్ఖతను నాణ్యత నెంచకఁ బల్కనిట్టులన్
    రాయల కావ్యమందు గనరావు రసోచిత భావసంపదల్

    రిప్లయితొలగించండి
  16. ఉ:రాయల కావ్య మందు మథురమ్మగు తత్త్వ మెరుంగ పద్యముల్
    *'రాయల కావ్యమందు గన, రావు  రసోచిత భావసంపదల్"*
    తీయని భక్తి భావములు ,తెన్ గున,సంస్కృత మందు ప్రస్తుతం
    బై యలరారు పాండితియు నందు వశించిన దంచు దెల్పెగా!
    (రావు అనే ఆయన రాయల కావ్యం లో తత్త్వం కోసం పద్యాలు చదివి దానిలో తీయని భక్తి ,తెలుగు,సంస్కృత పాండిత్యము కూడా ఉన్నాయని చెప్పాడు.)

    రిప్లయితొలగించండి
  17. కం:తీయగ సులువుగ జుర్రగ
    రాయల కావ్యమ్మున గన రావు రసమ్ముల్
    తీయని జలముల కొబ్బరి
    కాయను తిను నట్టి శ్రమయె కావలె నచటన్.
    (రాయల కావ్యం మథురమే ఐనా నారికేళ పాకం కనుక కాస్త శ్రమ పడాలి.)

    రిప్లయితొలగించండి
  18. హేయంబగుపదములసలు
    *రాయల కావ్యమ్మునఁ గనరావు ,రసమ్ముల్*
    హాయినిగూర్చగ మనమును
    కాయమునుపరవశమొందు ఖచితంబిదియే


    రాయలపేరుతోనొకడు వ్రాయగనెంచుచు నొక్క కావ్యమున్
    బాయుచు ప్రాసలన్ యతుల పద్యము లల్లగ పండితోత్తముల్
    రోయుచు గాంచిపల్కిరిటు రూక్షముగానిదికావ్య మౌనె నీ
    *రాయల కావ్యమందు కనరావు రసోచిత భావ సంపదల్ *

    రిప్లయితొలగించండి
  19. కందం
    తీయని భక్తికదియె సం
    ధాయిని యాముక్తమాల్యద విదురులెరుఁగన్
    మాయురె! క్రోలుటెరుఁగరన
    రాయల కావ్యమ్మునఁ గనరావు రసమ్ముల్

    ఉత్పలమాల
    వ్రాయుమటంచు కావ్యసుధ రాయలఁ గోరఁగ నాంధ్రవిష్ణువే
    తీయనిదౌ కవిత్వమును దీర్పఁగ మెచ్చిరి 'ముక్తమాల్యదన్'
    మాయురె! మూర్ఖ పోకడ విమర్శలఁ జూపు వితండ వాదికిన్
    రాయల కావ్యమందు గనరావు రసోచిత భావసంపదల్

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    హేయమ్మగు పదములచట
    రాయల కావ్యమ్మునఁ గనరావు; రసమ్ముల్
    వేయింతలుగా కనబడు
    నాయన రచనలు ప్రసిద్ధ మైనవి యెన్నో.

    రిప్లయితొలగించండి