27, ఆగస్టు 2023, ఆదివారం

సమస్య - 4516

28-8-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మత్స్యము సింహముగఁ జంపె మత్తగజంబున్”
(లేదా...)
“మత్స్యము సింహమై చెలఁగి మత్తగజంబునుఁ గూల్చె నింగిపై”

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో ఇప్పిలి వేణుగోపాల్ గారి సమస్య)

11 కామెంట్‌లు:

 1. కందం
  ఈ 'త్స్య' ను ప్రాసగ నిడగన్
  మత్స్యందిక విషమె! పద్యమా? నా తరమే?
  మత్స్యావతార! భువినే
  మత్స్యము సింహముగఁ జంపె మత్తగజంబున్

  ఉత్పలమాల
  ఈ' త్స్య' ను ప్రాసగన్ మలచి యింపగు నట్లు సమస్య నిచ్చితే?
  మత్స్యము భోజనంబుగను మల్చుచు నిచ్చుటె బ్రాహ్మనయ్యకున్!
  మత్స్యమునల్పమైనదగు మత్తగజంబునెదర్చుటెట్లు? నే
  మత్స్యము సింహమై చెలఁగి మత్తగజంబునుఁ గూల్చె నింగిపై?

  రిప్లయితొలగించండి

 2. మత్స్యమ్ము మ్రింగు నందురు
  మత్స్యమ్మునె జలచరమ్ము మడుగున బ్రతుకున్
  మత్స్యము మరి యెటులంటివి
  మత్స్యము సింహముగఁ జంపె మత్తగజంబున్?  మత్స్యపురాణమందిది మచ్చుక కైనను కానరాదయెన్
  మత్స్యము తోయమున్ విడిచి క్ష్మాతల మైనను చేర రాదుగా
  మత్స్యము మారబోదు కరిమాచలమట్లు మరెట్టులంటివో
  మత్స్యము సింహమై చెలఁగి మత్తగజంబునుఁ గూల్చె నింగిపై?

  రిప్లయితొలగించండి
 3. రిప్లయిలు
  1. మత్స్యము దపమున. బొందిన
   మత్స్యవ తారుని వరముల మహిమము వలనన్
   మత్స్యము మరు జన్మంబు న
   మత్స్యము సింహము గ జంపె మత్త గజంబు న్

   తొలగించండి
 4. మత్స్యము కూర్మము హరియే
  మత్స్యధ్వజుని పితరుండు మధుసూధనుడే
  మత్స్యావతారియేగద
  మత్స్యము సింహముగఁ జంపె మత్తగజంబున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కుత్స్యముతోసమస్యనిడి కొండొక మత్స్యమునెంచి యుంటిరా?
   మత్స్యపురాణమున్ వెదుక మత్తగజంబును కానకుంటినే
   మత్స్యము కూర్మమున్ గనగ మాధవ రూపము లేగదా మహా
   మత్స్యము సింహమై చెలఁగి మత్తగజంబునుఁ గూల్చె నింగిపై

   తొలగించండి
 5. మత్స్య, కరటి బొమ్మల గొని
  మత్స్యపు బొమ్న దరి కరిని మదళీ యుంచన్
  మత్స్యమొలయ గజ మొరగగ
  మత్స్యము సింహముగఁ జంపె మత్తగజంబున్

  రిప్లయితొలగించండి
 6. కం॥ మత్స్యావతారుని కెరుక
  మత్స్యము సింహముగ మారి మత్తగజమునే
  మత్స్యము చంపుట యెచటన్
  మత్స్యము సింహముగఁ జంపె మత్తగజంబున్

  ఉ॥ మత్స్యము నాదిగా నిలిపి మాన్యులె వృత్తముఁ బల్కఁగానగున్
  మత్స్యము నందు ప్రాసఁ గన మైకము వచ్చును గ్రొత్తవారికిన్
  మత్స్యము సింహమై చనఁగ మాయలు నేర్వఁగ నౌను యెచ్చటన్
  మత్స్యము సింహమై చెరఁగి మత్తగజంబునుఁ గూల్చె నింగిలో

  మూర్ఖుని జిత్తమున్ దెలియ పుంగవ కేతున కైన సాధ్యమే” అని సమస్య ఇచ్చినపుడే సంధానకర్తలు పృచ్ఛకునికి సలహా ఇచ్చారు. మరి ఈసమస్యకేమన్నారో మరి బ్రహ్మశ్రీ వద్దిపర్తి గారి పూరణేమిటో!

  రిప్లయితొలగించండి
 7. మత్స్యండిక చేదెట్లగు?
  మత్స్యంబెట్లగునుసింహమయ్యా కనగన్
  మత్స్యఁపు కూర వికటమయి
  మత్స్యము సింహముగఁ జంపె మత్తగజంబున్

  రిప్లయితొలగించండి
 8. మత్స్య పురాణమందు గనమైతిమి వేరొకచోటనైననీ
  మత్స్యఁపు వింతపోకడను, మాయగ నున్నది నమ్మ శక్యమే?
  మత్స్యఁపు వ్యంజనమ్ముఁ దిన మైకము వచ్చెనొ చిత్త భ్రాంతియో!
  మత్స్యము సింహమై చెలఁగి మత్తగజంబునుఁ గూల్చె నింగిపై!!

  రిప్లయితొలగించండి