17, ఆగస్టు 2023, గురువారం

సమస్య - 4506

18-8-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సూర్యుఁ డుదయింపఁ దిమిరమ్ము చుట్టుముట్టె”
(లేదా...)
“రవి యుదయింపఁగాఁ దిమి పరంపర గ్రమ్మె ధరాతలమ్మునన్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి శతావధానంలో పండి ఢిల్లీశ్ గారి సమస్య)

16 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. భూమి గంపించె నడిరేయి భుజ్పు రమున
    తెల్ల వారగ నష్టము తెలియ వచ్చె
    ఘోర మెంతయొ దెలియంగ గుబులు గలిగె
    సూర్యుఁ డుదయింపఁ దిమిరమ్ము చుట్టుముట్టె

    రిప్లయితొలగించండి
  3. ఓఢ్ర దేశము నజరిగె నొక్క రైలు
    దుర్ఘటన తెల్ల వారలేదు నపు డింక
    తెలిసి ప్రజలుదుః ఖించిరి తీవ్రముగను.
    సూర్యుఁ డుదయింపఁ దిమిరమ్ము చుట్టుముట్టె

    రిప్లయితొలగించండి
  4. ఉర్విపైన నీ తావునం దుదయముననె
    సవితృడీనాడు తన విధి సలుపదలచె,
    దనకు మనకు చందురుడడ్డు దగిలినంత
    సూర్యుఁ డుదయింపఁ దిమిరమ్ము చుట్టుముట్టె

    రిప్లయితొలగించండి
  5. సవితృడు పద్మ బాంధవుడు సర్వ
    జగంబులకెల్ల మిత్రుడున్,
    భువిపయి కాంతి పుంజములు
    పూర్తిగ నిండెను నాల్గు దిక్కులన్,
    రవియుదయింపగా, దిమి పరంపర
    గ్రమ్మె ధరాతలంబునన్
    దివసకరుండు పశ్చిమపు దిక్కున
    హస్తమయంబునొందగా

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    ప్రీతిఁ బృథ ముని వరము పరీక్షఁ జేయ
    తూర్పుకుఁ దిరిగి కోర సంతు బడయంగ
    ప్రమద మనసెరిగి మురిసి రమణిముందు
    సూర్యుఁ డుదయింపఁ దిమిరమ్ము చుట్టుముట్టె!

    చంపకమాల
    జవమున మౌని మంత్రమును సారస నేత్ర పరీక్ష కెంచఁగన్
    యువతి మనోరథమ్మెరిఁగి యుక్తము నెంచక పుత్రుభిక్షలో
    దివి విడి మంత్రబద్ధునిగ తేజము నిండఁగఁ గుంతి ముందటన్
    రవి యుదయింపఁగాఁ దిమి పరంపర గ్రమ్మె ధరాతలమ్మునన్!

    రిప్లయితొలగించండి
  7. కుండపోతగ కుంభినిఁ గురిసివాన
    కొంపలన్నియుఁ జిక్కెను ముంపునందు
    కారుమబ్బులు నభమును క్రమ్ముకొనఁగ
    సూర్యుఁ డుదయింపఁ దిమిరమ్ము చుట్టుముట్టె

    రిప్లయితొలగించండి
  8. అలసి పోయిన భాస్కరుడస్తమింప
    పడమటి దిశజేరగ యామవతియె జేరె
    పూపకాంతి పరిఢవిల్లు పుడమి యందు
    సూర్యుఁ డుదయింపఁ, దిమిరమ్ము చుట్టుముట్టె.


    జవమున నిల్లు జేరవలె స్వర్మణి పశ్చిమ దిక్కు జేరగా
    దవురది సన్నగిల్లు నిక తామసి చేరు క్రమక్రమమ్ముగా
    ధవళపు కాంతియే విరియు ధారుణి యందు ప్రభాతమందునన్
    రవి యుదయింపఁగాఁ,, దిమి పరంపర గ్రమ్మె ధరాతలమ్మునన్.

    రిప్లయితొలగించండి
  9. ఆసుపత్రిలోన చికిత్స కాశపడుచు
    భార్యతోడుతనరుదెంచె పట్టణమ్ము
    ప్రొద్దు పొడవకపూర్వమే పొలిసెనతడు
    సూర్యుఁ డుదయింపఁ దిమిరమ్ము చుట్టుముట్టె

    రిప్లయితొలగించండి
  10. రవియుదయింపగాఁ మహము రాజ్యముసేయును మేఘమార్గమున్
    కవి తలపోయగా నెనయు కావ్యమునందున కాంతిపుంజముల్
    సవితృడు పశ్చిమంబునకు సాగిన పిమ్మట నింగిలోన కై
    రవి యుదయింపఁగాఁ దిమి పరంపర గ్రమ్మె ధరాతలమ్మునన్

    రిప్లయితొలగించండి
  11. అల్ప పీడన మేర్పడి యాకసమున
    కారు మబ్బులు దట్ట మై కమ్ము కొనగ
    కుంభ వృష్టి గ వానలు కురియు చుండ
    సూర్యుడు ద యింప తిమి రమ్ము చుట్టు ముట్టె

    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. చంపకమాల:
      కవియఁగ మేఘమాలికలు క్రన్నన రాతిరి వేళయందునన్
      భువిపయి కుండపోతవలె బోరన వర్షము గ్రుమ్మరించె నా
      నివసనముల్ పొలమ్ములునునిండుగవర్షపు నీట మున్గె హా!
      రవియుదయింపఁగాఁ దిమి పరంపర గ్రమ్మె ధరాతలమ్మునన్

      తొలగించండి
  13. తే॥ ఆదమరచి నిదురఁ బోవ నర్ధరాత్రి
    దొంగలన్ని వస్తువులను దోచు కొనఁగఁ
    దెల్లవార లేచి కనఁగ దెలిసి నపుడు
    సూర్యఁ డుదయింపఁ దిమిరమ్ము చుట్టుముట్టె

    చం॥ “రవి యుదయింపఁగాఁ దిమి పరంపర గ్రమ్మె ధరాతలమ్మునన్”
    గవనము నందుఁ గాకఁ గనఁగా భువిలోన యసాధ్యమేఁ గదా!
    రవి కిరణమ్ము తాకఁ దిమిరమ్ము జగమ్మున యంతరించదా!
    భువనము కాంతి పుంజములఁ బూర్తిగ వెల్గును బొంది యొప్పదా!

    రిప్లయితొలగించండి
  14. ప్రాగ్దిశ యునిండె వెలుగు ప్రభాత మందు
    *సూర్యుడుదయింప దిమిరమ్ముచుట్టుముట్టె*
    కమలములుముకుళించెను కలతతోడ
    పశ్చిమదిశలోమునుగప్రభాకరుండు.

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    ప్రాచ్య దేశాల వెలుగులు ప్రస్తరించె
    సూర్యుడుదయింపఁ;దిమిరమ్ము చుట్టుముట్టె
    పశ్చిమాన గల వివిధ ప్రాంతములను
    పుడమి తిరుగుచుండగ కనపడును వెలుగు
    చీకటులు లోకమందిట్లు చిత్రముగను.

    రిప్లయితొలగించండి