5, ఆగస్టు 2023, శనివారం

సమస్య - 4495

6-8-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాంత లాదరణీయులు గారు నిజము”
(లేదా...)
“పడఁతుల నాదరింపకుఁడు పాడగు పచ్చని కాపురంబులే”
(పిరాట్ల వేంకట శివరామకృష్ణ గారికి ధన్యవాదాలతో)

20 కామెంట్‌లు:

  1. తేటగీతి
    అందరి నడుమన్ దిరుగుచు నార్థికముగ
    నున్నతస్థితి నున్నట్టి యుత్తములను
    సోయగమ్ముల వలవైచి మాయఁజేయు
    కాంత లాదరణీయులు గారు నిజము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      గుడులను గోపురమ్ములను గుంపుగ నందరి తోడఁ దిర్గుచున్
      గడు ధనవంతులై మెరయ గాంచుచు వేరొక దృష్టి వారితో
      ముడివడ జూచు స్వార్థమయి మోహమునందున ముంచఁ జూచెడున్
      బడఁతుల నాదరింపకుఁడు పాడగు పచ్చని కాపురంబులే!

      తొలగించండి
  2. కొడుకులె వలెననుచు తనకోడలుగన
    వలె మగశిశువు నెయని యవసరమైన
    భ్రూణహత్యల జేయించు జాణలైన
    కాంత లాదర ణీయులు గాదు నిజము.

    రిప్లయితొలగించండి
  3. పతుల మాటలు జవదాటిపరగు చుండి
    యిచ్చ వచ్చిన రీతిగా నిలను మెలగి
    చెడ్డ వర్తనంబు ను గల్గి చెలగు నట్టి
    కాంత లాదర ణీ యులు గారు నిజము

    రిప్లయితొలగించండి
  4. కలరు సహధర్మ చారిణి కళ్ళుగప్పి
    నిరతము వెలచెలువలతో తిరుగువారు
    తిరిగి చెడిపోయిన పిదప తెలియు వార
    కాంత లాదరణీయులు గారు నిజము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెడునడతే మనుష్యులకు చీకటిలోనికి దారిచూపదా
      గడుసరులౌ పతుల్ సతుల కళ్ళును గప్పుచు కూలియాళ్ళతో
      పడకల సౌఖ్యమున్ గొసర పాపము తీవ్రము గాదె భోగినీ
      పడఁతుల నాదరింపకుఁడు పాడగు పచ్చని కాపురంబులే

      తొలగించండి
  5. విడచుచుధర్మమార్గమునుపెల్లుగనవ్యముభావజాలమున్
    కడకునుకాష్ఠమంచుమదికానకదేహపుభ్రాంతితోనిటన్
    నడువగవారిజాక్షులునునందముగాదుసమాజమందునా
    పడతులనాదరింపకుడుపాడగుపచ్చనికాపురంబులే

    రిప్లయితొలగించండి
  6. వావి వరుస లేమియు మాకు బట్టవనుచు
    విత్తమె పరమముగ నెంచు వీధి వార
    కాంత లాదరణీయులు గారు నిజము
    పతియె దైవమనెడి యింటి పడతి మేలు

    రిప్లయితొలగించండి
  7. అడుగకనే యపారముగ నాదర మొల్కగజేసి వెంటనే
    బడునసమాన ధీమతులుపాయ మెరింగి పరాయి యిండ్లలో
    నడుగిడి కొంపగూల్తురు వినాశము జేయుదురట్టి దుష్టులౌ
    పడఁతుల నాదరింపకుఁడు పాడగు పచ్చని కాపురంబులే.

    రిప్లయితొలగించండి
  8. మంచిజెప్పగజూచినమగువవలదు
    గుట్టుగుంభనయుండినకుఱుచయండ్రు
    సంఘనియమంబులెంచినసాధుభావ
    కాంతలాదరణీయులుగారునిజము

    రిప్లయితొలగించండి
  9. తేటగీతి
    ధవుఁడు మాటలాడగ పెడచెవినిబెట్టి
    అణకువన్నది లేక గయ్యాళులగుచు
    కయ్యమునకు కాల్దువ్వుచు కల్లలాడు
    కాంతలాదరణీయులు గారు నిజము.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      గడగడలాడ జేసెదరు కాంతుని యక్కట!కంటి చూపుతో
      జడియరు కల్లలాడుటకు సారెకు సారెకు మోసగింతురే
      బిడియము లేక గ్రుమ్మఱుచు పేచికి ముందుగ సిద్ధమౌదుర
      ప్పడతుల నాదరింపకుడు పాడగు పచ్చని కాపురంబులే.

      తొలగించండి
  10. పైట జార్చుచు పరువాలు బయటపెట్టి
    కన్నుగీటుచు పిలిచెడు గరిత లిలను
    దుడ్డు దోచెడు వగలాడి దుష్ట వార
    కాంత లాదరణీయులు గారు నిజము.

    రిప్లయితొలగించండి
  11. విడుముడి దోచు చిత్తమున వీధిజరించెడు పూరుషాళికిన్
    బిడియము వీడి ధారణపు బింకములే కనిపించు రీతిగా
    గుడిగుడి చేష్టలన్ సలుపు కొమ్మలు వేడుక కత్తెలైన యా
    పడఁతుల నాదరింపకుఁడు పాడగు పచ్చని కాపురంబులే.

    రిప్లయితొలగించండి
  12. బిడియము వీడి విచ్చలుగ వీధుల వెంబడి కోడెకాండ్రకై
    చిడిముడిపాటు లేక తమ చిత్తము వచ్చినరీతి స్వేచ్ఛగా
    విడిముడికోసమై తిరుగు వేశ్యలు నీతివిహీనులౌదురా
    పడఁతుల నాదరింపకుఁడు పాడగు పచ్చని కాపురంబులే

    రిప్లయితొలగించండి
  13. కులుకులొలుకుచు తళుకుల బులుముకొనుచు
    బిడియమును వీడిపరువఁపు బిగువు చూపి
    విటుల కోసము వీధుల వెంటదిరుగు
    కాంత లాదరణీయులు గారు నిజము

    రిప్లయితొలగించండి
  14. చం.

    గొడవలునుండవే దయను గూర్చును పిల్లలు పుట్టునంతలో
    పిడతల వోలె భగ్నమయి ప్రేమ పతిన్ గని తూలనాడెడిన్
    గడచిన యేండ్లు మారెనని కయ్యము జ్యానిని బంటు భర్తయే
    *పడఁతుల నాదరింపకుఁడు పాడగు పచ్చని కాపురంబులే.*

    రిప్లయితొలగించండి
  15. అడవుల కంపె రాఘవుని యాత్మజు
    రాజును జేయ కైక రా
    ముడు కడు ప్రేమమెయి సమున్నత
    భావముతోడ గాంచినన్
    గడు కఠినాత్మురాలు గద కల్మష
    చిత్తము గల్గినట్టి యా
    పడతుల నాదరించకుడు పాడగు
    పచ్చని కాపురంబులే

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    కాసుకై విటుల కొఱకు కాపు కాచి
    నటన చేయుచు కులకాంత లటుల, వీధి
    గుమ్మమున నిల్చి పురుషులఁ గోరు వార
    కాంత లాదరణీయులు కారు నిజము.

    రిప్లయితొలగించండి